శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తా సాదితీ రాజన్స్వభర్త్రా కశ్యపేన వై
అన్వతిష్ఠద్వ్రతమిదం ద్వాదశాహమతన్ద్రితా
కశ్యప ప్రజాపతి ఇలా విధానాన్ని చెప్పిన తరువాత ఈ వ్రతాన్ని ఏమరపాటులేకుండా శ్రద్ధగా నిరంతరం పరమాత్మనే ధ్యానిస్తూ చేసింది.మనసుతో ఇంద్రియములనే అశ్వములను బుద్ధి అనే సారధితో నియమించింది
చిన్తయన్త్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరమ్
ప్రగృహ్యేన్ద్రియదుష్టాశ్వాన్మనసా బుద్ధిసారథిః
మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని
వాసుదేవే సమాధాయ చచార హ పయోవ్రతమ్
మనసును ఏకాగ్ర బుద్ధితో పరమాత్మ యందు ఉంచి ఈ పయో వ్రతాన్ని ఆచరించింది.
తస్యాః ప్రాదురభూత్తాత భగవానాదిపురుషః
పీతవాసాశ్చతుర్బాహుః శఙ్ఖచక్రగదాధరః
భర్త చెప్పినట్లు శ్రద్ధా భక్తులతో చేయగా పరమాత్మ నాలుగు భుజాలతో ఆయుధాలతో పీతాంబరము ధరించి ఆవిర్భవించాడు
తం నేత్రగోచరం వీక్ష్య సహసోత్థాయ సాదరమ్
ననామ భువి కాయేన దణ్డవత్ప్రీతివిహ్వలా
సోత్థాయ బద్ధాఞ్జలిరీడితుం స్థితా నోత్సేహ ఆనన్దజలాకులేక్షణా
బభూవ తూష్ణీం పులకాకులాకృతిస్తద్దర్శనాత్యుత్సవగాత్రవేపథుః
పరమ ప్రీతితో దండ ప్రణామం చేసి పరమానందముతో పరమాత్మను స్తోత్రం చేయాలనుకున్నా ఆనందముతో గొంతు పెగలక ఉండి పోయింది.ఆ ఆనందముతో శరీరమంతా చెమట పుట్టి వణుకుపుట్టి పులకించింది
ప్రీత్యా శనైర్గద్గదయా గిరా హరిం తుష్టావ సా దేవ్యదితిః కురూద్వహ
ఉద్వీక్షతీ సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిమ్
స్వామి అనుగ్రహాన్ని పొందిన అదితికి పరమాత్మ శక్తిని ఇవ్వగా, రమాపతి యజ్ఞ్యపతి జగద్పతి అయిన స్వామిని నేత్రాలతో తాగుతున్నట్లు చూస్తూ ఇలా స్తోత్రం చేసింది
శ్రీదితిరువాచ
యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద
తీర్థశ్రవః శ్రవణమఙ్గలనామధేయ
ఆపన్నలోకవృజినోపశమోదయాద్య
శం నః కృధీశ భగవన్నసి దీననాథః
పరమాత్మ యజ్ఞ్య పురుషుడు.అచ్యుతుడు (జారనివాడు జారనీయనివాడు) పవిత్రమైన పాదములు కలవాడు పవిత్రమైన కీర్తి కలవాడు,చెవులకు పవిత్రత కలిగించే పేరు కలవాడు. ఆపద పొందినవారి కష్టాలను తొలగించడములో మొదటివాడా
విశ్వాయ విశ్వభవనస్థితిసంయమాయ
స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే
స్వస్థాయ శశ్వదుపబృంహితపూర్ణబోధ
వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే
ఆపద పొందినవారి కష్టాలను తొలగించడములో మొదటివాడా.నీవు దీన నాధుడివి కాబట్టి మాకు శుభాన్ని కలిగించు.నీవే విశ్వము.సృష్టి స్థితి లయములు చేస్తావు నీవు
ఆచరించే పనికి నీకు కావలసిన శక్తిని నీవే కల్పించుకుంటావు
పరమాత్మ యందు ప్రేమ లేని వారు కూడా ఆరాధించడానికి కావలసిన విధానాన్ని మన ఋషులు ఏర్పరచారు. పరిపూర్ణమైన జ్ఞ్యాన స్వరూపాన్ని వృద్ధి పొందింపచేయగలిగిన నీకు నమస్కారం.నీ చీకటినీ నీవే పోగొట్టుకుంటావు (తమస పరస్తాత్).
ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీర్
ద్యోభూరసాః సకలయోగగుణాస్త్రివర్గః
జ్ఞానం చ కేవలమనన్త భవన్తి తుష్టాత్
త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః
పరమాత్మను ఆరాధించడానికి ఆయుష్షు కావాలి.ఆ ఆయుష్షు నీవే.పరమదైవమూ పరమాయువూ నీవే.భూమ్యాకాశాలూ అన్ని యోగాలూ త్రివిర్గమూ నీవే.జ్ఞ్యానము నీవే.కేవలం నీ స్వరూప జ్ఞ్యానం కలిగినా తనకు తానుగా ఒక చిన్న పూవు ఇచ్చినా నీవు ఆనందిస్తావు. ప్రతీవాడు శత్రువుల నుండి జయము పొందాలని ఐశ్వర్యం పొందాలని ఆశిస్తాడు
శ్రీశుక ఉవాచ
అదిత్యైవం స్తుతో రాజన్భగవాన్పుష్కరేక్షణః
క్షేత్రజ్ఞః సర్వభూతానామితి హోవాచ భారత
అందరిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అథితితో స్తోత్రం చేయబడిన పుండరీకాక్షుడు ఇలా అన్నాడు
శ్రీభగవానువాచ
దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాఙ్క్షితమ్
యత్సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః
తాన్వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాన్
ప్రతిలబ్ధజయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుమ్
దేవమాతా నీవెప్పటినుంచో అనుకున్నది నాకు తెలుసు. శత్రువులు అపహరించి రాజ్యాన్ని నెట్టివేసారు.బాగా మధించి ఉన్న అసురులను యుద్ధములో గెలిచి రాజ్యలక్ష్మిని పొందిన పుత్రులతో కలిసి నన్ను మళ్ళీ ఆరాధించాలని అనుకుంటున్నావు.మనం కోరిక కోరుతూ స్వామిని ఆరాధిస్తాము.అది తీరుతుంది.దానికి కృతజ్ఞ్యతతో మళ్ళీ ఆరాధించాలి.వ్రతం పూర్తై ఫలితం వచ్చాక కూడా స్వామిని ఆరాధించాలి.తొందరగా కరుణించాడు కాబట్టి కృతజ్యతగా స్వామిని మరలా ఆరాధించాలి
ఇన్ద్రజ్యేష్ఠైః స్వతనయైర్హతానాం యుధి విద్విషామ్
స్త్రియో రుదన్తీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖితాః
శత్రువుల యుద్ధములో ఓడిపోయిన ఇంద్రాది (ఇంద్రుడు పెద్దవాడిగా ఉన్న పుత్రులు) దేవతలూ, వారి భార్యలూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయారు.వారి భార్యలు ఏదుస్తున్నారు.అలా ఆ రాక్షస స్త్రీలు బాధపడడాన్ని కోరుతున్నావు కదా.
ఆత్మజాన్సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయశఃశ్రియః
నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి
వారు ఏడవాలి నీ కొడుకులు ఆనందైంచాలి అని ఉందా.కానీ ఇపుడు రాక్షసులు ఓడడం జరగదు.దైవం వారికి అనుకూలం ఇపుడు.
ప్రాయోऽధునా తేऽసురయూథనాథా అపారణీయా ఇతి దేవి మే మతిః
యత్తేऽనుకూలేశ్వరవిప్రగుప్తా న విక్రమస్తత్ర సుఖం దదాతి
వారు ఓడిపోరు అని నా అభిప్రాయం. అలాంటి వారి విషయములో పరాక్రమం పనికిరాదు.ఐనా సరే ఏదో ఉపాయం ఆలోచించాలి.శ్రద్ధతో చేసిన నా ఆరాధన వ్యర్థం కావడానికి వీలులేదు.
అథాప్యుపాయో మమ దేవి చిన్త్యః సన్తోషితస్య వ్రతచర్యయా తే
మమార్చనం నార్హతి గన్తుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్
త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః
స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్గోప్తాస్మి మారీచతపస్యధిష్ఠితః
ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమకల్మషమ్
మాం చ భావయతీ పత్యావేవం రూపమవస్థితమ్
నీ శ్రద్ధకు ఫలితం ఇవ్వాలి.నీ పిల్లల రక్షణకు నీవు యథావిధిగా ఆ వ్రతాన్ని ఆచరించావు.నేను స్వయముగా వస్తేనే నీ పని అవుతుంది.నిన్ను కాపాడతాను.కశ్యపుని తేజస్సులో నేను వచ్చి చేరతాను. ఏ పాపం లేని కశ్యపున్ని నీవు సేవించు.నీవు చేసిన ఈ రూపాన్ని మనసులో పెట్టుకునే నీ భర్త దగ్గరకు వెళ్ళు. భార్యా భర్తలు సంగమిస్తూ ఉన్నప్పుడు పరమాత్మనే తలచుకోవాలి.
నైతత్పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథఞ్చన
సర్వం సమ్పద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతమ్
ఎవరు అడిగిన ఈ విషయం చెప్పకు.ఇది దేవ రహస్యం.జాగ్రత్తగా దాచిపెట్టు.
శ్రీశుక ఉవాచ
ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాన్తరధీయత
అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః
ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్
స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత
ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితథేక్షణః
సోऽదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసమ్భృతమ్
అమాహితమనా రాజన్దారుణ్యగ్నిం యథానిలః
అదితేర్ధిష్ఠితం గర్భం భగవన్తం సనాతనమ్
హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః
పరమాత్మ ఈ విషయం చెప్పి అంతర్ధానమయ్యాడు.దుర్లభమైన పరమాత్మను పుత్రునిగా పొందిన అథితి కృతకృత్యురాలిగా భర్తను సమీపించింది.జరిగిన దాన్ని కశ్యపుడు యోగ దృష్టితో తెలుసుకున్నాడు.ఎంతో కాలమునుండీ తపస్సుతో నింపిన తన వీర్యాన్ని ఇచ్చాడు.వాయువు ఎలా ఐతే కాష్ఠములో అగ్నిని ఉంచుతో కశ్యపుడు సమాధాన మనస్కుడై తన వీర్యాన్ని అథితిలో ఉంచాడు.బ్రహ్మ అథితి గర్భములో ఉన్న పరమాత్మని స్తోత్రం చేసాడు
శ్రీబ్రహ్మోవాచ
జయోరుగాయ భగవన్నురుక్రమ నమోऽస్తు తే
నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః
నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే
త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే
త్వమాదిరన్తో భువనస్య మధ్యమనన్తశక్తిం పురుషం యమాహుః
కాలో భవానాక్షిపతీశ విశ్వం స్రోతో యథాన్తః పతితం గభీరమ్
త్వం వై ప్రజానాం స్థిరజఙ్గమానాం ప్రజాపతీనామసి సమ్భవిష్ణుః
దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోऽప్సు
పెద్దల చేత గానంచేయబడే ఉరుక్రముడివైన (పరాక్రమ కలవడవైన) నీకు నమస్కారం, బ్రహ్మణ్య దేవుడివీ త్రిగుణాత్ముడివీ, పృశ్ని గర్భుడవైన నీకు నమస్కరాం (ఇంతకు ముందు జన్మ) వేద గర్భుడవైన నీకు నమస్కారం, త్రినాభ (సత్వ గుణం), సత్వ రజసతమోగుణాలు నీవే, నీవే ఆది అంతమూ మధ్యము, అనంత పురుషుడివి,కాలరూపములో వ్యాపించి ఉన్నవాడివి,ఎలా ఐతే లోపలి ప్రవాహం అన్ని వైపులా వ్యాపిస్తుందో నీవు అన్ని వైపులా వ్యాపించి ఉంటావు. అందరి సృష్టి కర్తవూ నీవే.అందరిలా పుట్టేదీ నీవే.నీటిలో మునిగిన వారికి పడవలా స్వర్గము నుండి జారిన దేవతలకు నీవే ఆధారం