1.పాద్మ పురాణంలో ఉన్నట్లుగా
యస్మాఛ్చ యేనచ యధాచ యదాచ యచ్చ
యావచ్చ యత్ర చకృతాకృత మాత్మ కర్మ
తస్మాఛ్చ తేనచ తధాచ తదాచ తచ్చ
తావచ్చ తత్ర చ విధాతృ వళాదుపైతి
యస్మాఛ్చ - దేనివలన
యేనచ దేనితో
యధాచ ఏ విధంగా
యదాచ ఎప్పుడు
యచ్చ ఏది
యావచ్చ ఎంత
యత్ర
చకృతాకృత మాత్మ కర్మ - మంచి చెడు కరమలు
తస్మాఛ్చ దానివల్లనే
తేనచ దానితోటే
తధాచ అప్పుడే
తదాచ అదే
తచ్చ అంతనే
తావచ్చఆ విధంగానే అనుభవించబడుతుంది
తత్ర చ విధాతృ వళాదుపైతి - భగవంతుని ఇచ్చవలన
చేసిన పాపమంతా ఒక్క సారిగా అనుభవింపచేయక పరమాత్మ ఇష్టం మీద ఆధారపడి ఎంత అనుభవింపచేయాలో అంత అనుభవింపచేస్తాడు. మనం చేసిన వాటిని కొంత దాచుకొని కొంత ముందరపెట్టి కొంత అనుభవింపచేస్తాడు. కాలం కర్మ స్వభావం - ఈ మూడింటిని తన మాయ చేతా ఉంచాడు పరమాత్మ. ఆయన సంకల్పం చేత ఇచ్చిన దానిని మాత్రమే ఇచ్చినంత ఇచ్చిన రీతిలో నేను స్వీకరిస్తాను.
2. మనం నోరు తెరిచినపుడు నోటినుండి వచ్చే వాయువు పేరు నాగం. కనులు తెరుస్తున్నపుడు వచ్చే వాయువు కూర్మ వాయువు. తుమ్మినపుడు వచ్చే వాయువు క్రకరం. ఆవలించినపుడు వచ్చేది దేవదత్తం. చైనిపోయినా కూడా వదిలిపెట్టని వాయువు ధనంజయం.
అన్నీ ప్రాణములకూ వాయువులకూ కూడా పరమాత్మ నాసిక ఆధారం. అశ్వినీ దేవతలూ ఔషధులూ (ఔషధం అంటే ఒకే కానుపుతో ముగిసేవి ఔషధులు సకృత్ ప్రసూతా ఔషధి , అరటి, వరి గోధుమ. ఒక కానుపే ఇచ్చి విరమిస్తుంది. అందుకే రామయణంలో జటాయువు సీతమ్మ గురించి 'యాం ఔషధిమివ ఆయుష్మన్ ...' ఔషధిలాంటి సీతమ్మను (లేదా ఏ సీతమ్మను ఔషధిలాగ వెతుకుతున్నవో), సీతమ్మ కూడా ఒకే కనుపుతో అవతారాన్ని చాలించింది. ).
3. నారదపురాణంలో రెండున్నర అధ్యాయలలో 394 మహా మంత్రాలు చెప్పారు. వాటిలో 16 మంత్రాలు మాత్రమే స్పష్టంగా చెప్పారు.
ఉదాహరణకు : ఆకాశం అగ్నిం లక్ష్మీంచ అనుస్వారం నివేశ్య చ ప్రాణ ఆధార సంవేశ: అగ్నే: జాయా జఠ: భవేత్. జలాయనం సమాహృత్య అగ్నే: జాయ
ఆకాశం అగ్ని లక్ష్మి చంద్రుడు, నీటికి నిలయం అగ్నికి భార్య. వీటీ కలపమని చెప్తారు. ఆకాశం అంటే హ కారం. అగ్ని అంటే ర కారం. లక్ష్మి అంటే ఇ చంద్రుడు అంటే సున్నా. మొత్తం కలిప్తే హ్రీం అయింది. దానికి మొదలు ప్రణవం. జల ఆయనం - అంటే నారాయణం. అగ్ని తరువాత చతుర్దీ అంటే ఆయ. అగ్ని భార్య అంటే స్వాహ. అంటే మొత్తం కలిపి ఓం హ్రీం నారాయణాయ స్వాహా.
వర్ణ మంత్ర అక్షర బీజ సమామ్నాయ అగస్త్యుడు రాశాడు. అందులో 14000 బీజాలు ఉన్నాయి. ఆది బీజం (హ్రీం) అంత్య బీజం (ర్హీం)
అందరికీ యోగ్యమైన మత్రాలు కొన్ని ఉన్నాయి. ద్వాదశాక్షరి త్రి అక్షరి పంచాక్షరి షడక్షరి సప్తాక్షరి అష్టాక్షరి నవాక్షరీ దశాక్షరీ ఏకాదశాక్షరీ - ఎ తొమ్మిది రకాల మంత్రాలు ఒక పద్నాలుగు ఉన్నాయి. 9*14 మంత్రాలు స్పష్టంగ చెప్పబడ్డాయి నారదపురాణంలో
పురాణాల్లో మంత్రాలను మంత్రంగా కాకుండా శ్లోకంగా అందరూ చదువుకునేట్లుగా పెడతారు.
ఉదాహరణకు: నతోऽస్మ్యహం తచ్చరణం సమీయుషాం భవచ్ఛిదం స్వస్త్యయనం సుమఙ్గలమ్ - శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే
4. ప్రవర్తనా శక్తిని ఓజస్సు అంటారు
వేగ శక్తిని సహస్సు , ధారణా శక్తిని బలం అంటారు. ఇవి ఇంద్రియ మన శరీరం. ఇంద్రియాలకు ఓజస్సు, మనసుకు సహస్సు, శరీరానికి బలం (ధరించేది కాబట్టి)
5. సత్యాలు మూడు రకాలు 1. వ్యావహారిక 2. ప్రాతిభాతిక 3. పారమార్ధిక సత్యములు
1. మనం మాట్లాడేదంతా తప్పు అని తెలిసి మాట్లాడటం. బియాన్ని వండుతూ "అన్నం వండుతున్నా" అనడం, బియ్యం లేదా పప్పు విసురుతూ పిండి విసురుతున్నా అనడం. ఉన్నదంతా ఒకే ఆత్మ అయినపుడు "నీవెవరూ" అని అడగడం. నూనెని తైలం అంటున్నాం. ఇదంతా వ్యవహారంలో వాడటంవలన సత్యం అనడం వ్యావహారిక సత్యం
2. ప్రాతిభాతిక సత్యం: ఇది కలలో వచ్చేది
3. పరమార్ధత: సత్యం: జీవాత్మ పరమాత్మ ప్రకృతి అనేది.
ఒక్కొక్క దానిలో వైశిష్ట్యాన్ని విడివిడిగా లాక్కోడానికి ఒక సారి కళ్ళకూ , ఒక సారి పెదవులకు, మేధస్సుకు హృదయమునకు. మనం ఒక వస్తువుని ఇస్తే "దేవస్య త్వ సవితు ప్రసవే అశ్వినో బాహుబ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదదే" ఒక వస్తువుని తీసుకోడానికి, తీసుకునేది నేనే అయినా నాకు బాహువులూ లేవు చేతులూ లేవు. "అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం. హస్తములు పూష ఇస్తే అశ్వినీ దేవతలు బాహువులు ఇస్తే తీసుకుంటూన్నా". అశ్వినీ దేవతలు ఆరోగ్యాధిదేవతలు. మందు తయారు కావడానికి బాహుబలం కావాలి నూరడానికి, పుటం పెట్టడానికి, కొన్ని రకాల ఔషధులు లాగడానికి బాహుబలంతో కాకుండా మంత్రంతో అడగాలి, అవి కనపడవు,కనపడినా లాగినా రావు (సంజీవనీ పర్వతం).
6. ఛన్దోమయో మఖమయోऽఖిలదేవతాత్మా: హయగ్రీవుడూ వరహామూ హంస అవతారం, ఈ మూడు యజ్ఞ్యపురుషుని అవతారం. ఈయనే వేద పురుషుడు. మఖ మయ: పంచకర్తృకం యజ్ఞ్యం ఐతే ఏకకర్తృకం మఖం. బహువార్షికం సత్రం. అంతకంటే లోపల యాగం. ఒక్క రోజులో చేస్తే హోమం.
7. నైవేద్యం పెట్టేప్పుడు ఆండాళ్ శ్రీ హస్తమని గానీ ఆచార్య శ్రీ హస్తమని గాని అనడం సాంప్రదాయం
8. ప్రళయకాలం అయి బ్రహ్మగారు నిద్రూ లేవగానే సోమకుడనే రాక్షసుడు వచ్చి బ్రహ్మగారి దగ్గర నుంచి వేద ప్రతిపాదనలన్నీ దొంగిలిస్తాడు. అప్పుడు మత్స్యముగానే స్వామి వచ్చి వాటిని రక్షిస్తాడు. ఆవాస క్షేమార్ధం మత్స్య యంత్ర స్థాపన అని శాస్త్రం. ఆసనక్షేమార్థం కూర్మ యంత్రం. అంతటి ప్రళయంలో కూడా ఆ పడవను క్షేమంగా ఉంచింది. (క్షోణీమయో - మత్స్యము భూమి స్వరూపుడే.) అందుకే భూమి బాగుండాలంటే మత్స్యయంత్రాన్ని పెడతారు.
9. ఎక్కడికైనా ప్రయాణమయ్యేప్పుడు గద్ద కనపడకూడదు వినపడకూడదు. గాడిద అరుపు వినపడితే మంచికి, కాని కనపడకూడదు. నక్క కనపడితే మంచిది కాని అరుపు వినపడకూడదు. గరుడ పక్షి కనపడినా అరుపు వినపడినా మంచిదే.
10. పోతన భాగవతం నుండి నృసింహస్వామి ఆవిర్భావ ఘట్టం
ఇట్లు దానవేంద్రుండు పరిగ్రుహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును,రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును,వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును ,తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి హరి నిందు జూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున సభామండప స్థంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలును మిణుగురులు సెదర జిటిలి పెటిలి పడి బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా బలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన చట చ్చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి యాకాస కుహరాన్తరాళమ్బు నిరవకాసంబు సేసి నిండినం బట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవసంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాన్కుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంభరాభర దౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినిధర కూర్మ కులశేఖరుండును దుగ్ద జలధి జాత శుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళున్డును ఘన ఘణాయమాన మణికిన్కినీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేసుండును , నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును , కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును , దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాస , రక్షో రాజ వక్షో భాగ విసంకటక్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన ,ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును , శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగా మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన , మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళున్డును , మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భుషితుండును , త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కన్ధరుండును ,ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశా సంచలితాధరుండును . శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును , కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజ్రుమ్భమాణ సప్తజిహ్వ జిహ్వా తులిత తరళ తరాయమాన విబ్రాజమాన జిహ్వుండును , మేరు మందర మహా గుహాన్తరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును , నాసికా వివర నిస్సర న్నిబిడ నిస్స్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును , పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సద్రుక్ష సమంచిత లోచనుండును , లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగా వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును , ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును , సంధ్యారాగ రక్త దారధరమాలికా ప్రతిమ మహా బ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును ,సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును , నిష్కంపిత శంఖ పర్ణా మహోర్ద్వకర్ణుండును , మన్ధదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శికరాకార భాసుర కేసరుండును , పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహున్డును , నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావత సార్వభౌమ ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును , ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును , దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపన్ధి యాతుదాన నికురుంబ గర్వాంధకారుండును , బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును , మహా ప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుం డావిర్భవిన్చినమ్ గనుంగొని .