Followers

Friday, 7 February 2014

ధృవుని వృత్తాంతం మనకు చెప్పేదేమిటి


ధృవుడు తన కన్న తల్లి వద్దకు ఆవేదనతో వెళ్ళినప్పుడు తల్లి, "నీ మనసు బాధపెట్టినవారిని బాధపెట్టడానికి ప్రయత్నించకు.  పరమాత్మ గురించి తపించు" అని చెప్పింది. మనందరికి కూడా అదే వర్తిస్తుంది
ధృవుడు తపస్సు చేసేప్పుడు పరమాత్మ మీదే ధ్యానముతో ఉండి, పరమాత్మను తప్ప మరి దేన్నీ చూడలేదు. 
పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నందు వలన ఆయనకి ఆకలి దప్పులు కలగలేదు
పరమాత్మని ధృవుడు చేసిన స్తోత్రం పరమాత్మ కృప వలనే కలిగింది 
పరమాత్మ మీద ధ్యానం చేసి ధృవుడు ఏ కోరికా కోరలేదు. అందరి హృదయములో ఉండే స్వామికి ధృవుని మనసులో ఉన్న కోరిక తెలుసు. 
ధృవుడు కోరిక బయటకి చెప్పకపోయినా, ఆ సమయములో ధృవుని మనసులో ఉన్న దాన్ని పరమాత్మ అనుగ్రహించాడు. అంటే మనం
ధృవుడు అంత తపస్సు చేసినా మోక్షాన్ని కోరలేదు. అంటే మనమేమి కోరాలో అది కూడా స్వామి సంకల్పమే. 
ధృవుని పొరబాటు ఎక్కడ జరిగింది? పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీవంటి (విదురుని) వాళ్ళు, పరమాత్మ వచ్చి ఏమి కావాలంటే "నీ కైంకర్యం కావాలి" అంటారు గానీ, ఇంకో సంపద కోరరు. మనము ఏదో ఒక దానిని ఎందుకు కోరతాము? కొరత ఉంటే కోరతాము. పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన జీవుడు ప్రకృతిలో వేటి వేటిని పొందగలడో అవి అన్నీ పరమాత్మకు దాసుడైన వాడు పొందుతాడు. వాటితో బాటు అన్నింటికన్నా శ్రేష్టమైన పరమాత్మ దాస్యం లభిస్తుంది. 
అందుకే భగవంతుని దాస్యాన్ని తప్ప మరి దేన్నీ కోరరు 
అందుకే సాయినాథులు ఎప్పుడూ "నేను భగవంతుని దాసుడను" అనే వారు. అంటే మనం కూడా ఏమి కోరాలో ఆయన చెబుతూనే వున్నారు 

పరమాత్మ సంకల్పం వల్లనే మనకు ఆయన కథల మీద భక్తి, భక్తుల మీద భక్తి, ఆయన మీద భక్తి కలుగుతుంది. ఆయన సంకల్పం చేతనే మనకు వచ్చే ఆలోచనలూ, కోరికలూ. ఆయన సంకల్పమే మన చేత ఇంద్రియ అధిష్ఠాన దేవతల రూపములో ఉంది మన చేత బుద్ధిని ప్రచోదనం చేసి ఆయా కర్మలు చేయిస్తుంది. చివరికి భగవంతుని సాక్షాత్కారం అయినా, ఆయన సంకల్పానుసారమే మనము కోరతాము. మనము చేయవలసిందీ కోరవలసిందీ కూడా ఆయన కైంకర్యాన్నే

Popular Posts