Followers

Wednesday, 5 February 2014

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 7


1. ఈ మంత్రము రోజూ చదువుకుంటే నష్ట ద్రవ్యం త్వరగా దొరుకుతుంది 

ఆమంత్రయే జనస్థానం కర్ణికారాన్ చ పుష్పితాన్ |
క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణః |౩-౪౯-౩౦|

2. ఆకాశములో పాప గ్రహాలు శుభ గ్రహాలను బాధించడం  అంటే మంచి గ్రహాలను దాటిపోతున్నారు. దీన్ని జ్యోతీషములో అతిచారము అంటారు. ఒక రాశిలోకి వెళ్ళాల్సినది రెండు రాశుల్లోకి వెళ్తారు. ఆకర్షణం అంటే వెనక్కు నుంచి ముందుకు లాగడం. ముందు నుంచి వెనక్కు లాగడం వక్రం అంటారు. ఒకే రాశిలోకి రెండు గ్రహాలు వచ్చి కొట్టుకుంటే యుద్ధం. శుభ గ్రహం గెలిస్తే అది శుభం. మనం పుట్టే సమయములో పాప గ్రహం శుభ గ్రహం మీద గెలిస్తే వాటి ప్రభావం మన మీద కూడా ఉంటుంది. అతిచారం, ఆకర్షణ, వక్రం యుద్ధం పరాజయం ఈ ఐదు గ్రహచారములో సంభవించే మహాదోషాలు. వీటి వలన వ్యక్తులకే కాదు దేశములకి కూడా అరిష్టము.

3.  కశ్యపుడు ఇద్దరికీ పేర్లు పెట్టాడు. తన నుండి ముందు పుట్టాడో వాడి పేరు హిరణ్య కశిపుడు, ఆమె నుండి మొదలు పుట్టినవారికి హిరణ్యాక్షుడు (ఇది కవల పిల్లల వయసు నిర్దేశించడములో విధానం). మొదలు ఆమె ప్రసవించినవాడు హిరణ్యాక్షుడు. హిరణ్య కశిపుడు అంటే భోగ వ్యామోహం. హిరణ్యాక్షుడంటే ఇంద్రియ వ్యామోహం. ప్రపంచం వేరు పరమాత్మ వేరు అనుకున్న వారికి ఈ రెండూ ఉంటాయి

4. నక్క కనపడితే మంచి, అరుపు వినపడకూడదు. గాడిద అరుపు వినపడకూడదు, గాడిద కనపడితే మంచి. మేకల దుమ్మూ ఊడుస్తుంటే వచ్చే దుమ్ము గాడిదల దుమ్ము శ్మశానములో దుమ్మూ అపశకునాలు

5. మనకి మనం తీర్చుకోలేని గొప్ప ఆపద వచ్చినప్పుడు గజేంద్రమోక్షన కథను గుర్తు చేసుకోవాలి. అలాగే మనము తొలగించుకోలేము అని నిశ్చయించుకున్న ఆపద తొలగిపోయిన తరువాత కూడా గజేంద్ర మోక్ష కథని తలచుకోవాలి. చివరి ఊపిరితో స్వామిని స్తోత్రం చేసాడు. పదివేల ఏళ్ళు కోట్లాడాడు, ఒక వేయి ఏళ్ళు స్తోత్రం చేసాడు. మహత్యాపదిసంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః  ఇక్కడ హరి అనేది కూడా అవతారం. చాక్షుష మన్వంతరములో హరి కూడా ఒక అవతారము. ఉలూక ప్రజాపతికి స్వామి హరిగా అవతరిచాడు.  ఆపద వచ్చినా తొలగినా ఆయననే తలచాలి. అందుకే అన్నిలోక దేవతలూ గజేంద్ర మోక్షాన్ని తలచుకుంటున్నారు
ఆడ యేనుగులు మొత్తుకుంటుంటే పరమాత్మను ధ్యానం చేస్తున్న ఏనుగుని ఎవరు కాపాడారో, అలాంటి శ్రీమన్నారాయణున్ని ధ్యానం చేయడం అత్యంత సులభం. సుఖారాధ్యుడు.

6. వరాహావతార వైభవం

పరమాద్భుతమైన గాధ అయిన హిరణ్యాక్ష వధను, ఒక ప్రయోజనాన్ని ఆశించి వరాహ అవతారం ధరించిన స్వామి క్రీడను ఎవరు వింటారో, చదువుతారో, గానం చేస్తారో, ఆమోదిస్తారో, చదువుతారో, చెబుతారో, అలాంటి వాడికి బ్రహ్మ హత్యా పాతకం కూడా పోతుంది. అంటే తొలగింపబడని పాపం లేదు. వింటే భుక్తి (ఇహ లోక సుఖమూ) ముక్తి (పరలోక సుఖం)

ఏతన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషామ్
ప్రాణేన్ద్రియాణాం యుధి శౌర్యవర్ధనం నారాయణోऽన్తే గతిరఙ్గ శృణ్వతామ్

మనమందరం ఉండటానికి కావలసిన ఆధారము దొరికింది. దొరికిన భూమికి వచ్చిన ఆపద తొలగింది. స్మరించగానే ప్రత్యక్షమైన పరమాత్మ అవతారము వరాహ అవతారం. మనకి ఆపద వస్తున్న విషయం తెలియకున్నా తానొచ్చి అడ్డుగా నిలబడి ఆ ఆపదను తొలగిస్తాడు. ప్రతీ నిత్యం స్మరించ వలసిన అవతారం. తలిస్తే వచ్చే అవతారం. పిలిస్తే పలికే అవతారం. మత్స్య కూర్మాది ఇతర అవతారాల కంటే విశిష్టమైన అవతారం. స్మరణ మాత్రాన పాపములు తొలగించే అవతారం. సంధ్యావందనములో "ఆసనే వినియోగః" అన్నప్పుడు ఆ ఆసనం రావడానికి స్థానాన్ని ప్రసాదించిన అవతారం వరాహవతారం. ఇది చాలా మంచి రోజు గొప్ప ఫలమును ప్రసాదించే పరమ పవిత్రమైన రోజు. ఈ స్వామి భూమిని పైకి తీసుకుని వచ్చిన తరువాత కాళ్ళ గిట్టలకూ మూతి పైభాగానికి అంటిన మట్టిని దులిపాడు. కిందపడిన ఆ మట్టిని తన కేశముల మీద( దర్భల మీద) మూడు మూడు మూడు గా పెట్టి పితృదేవతారాధన చేసాడు. ఆ సాంపరదాయాన్ని ఆయనే ప్రారంభించాడు. ధన్యమైనది - ధనానికి యోగమైంది. యశస్త్యం - కీర్తి వస్తుంది. దీర్ఘ ఆయువు వస్తుంది. అన్ని కోరికలూ తీరుతాయి. యుద్ధములో ప్రాణములకు ఇంద్రియములకూ శౌర్యం పెరుగుతుంది. మనందరమూ యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇంద్ర్యములతో విషయములతో ప్రతీక్షణం చేస్తూనే ఉన్నాము. విషయ ఇంద్రియాలకు జరిగే యుద్ధములో విషయాల మీద ఇంద్రియములు విజయం సాధించాలంటే ఇంద్రియాధిపతైన స్వామిని ప్రార్ధించాలి. చెప్పేవారికీ వినేవారికీ చివరికి శ్రీమన్నారాయణుడే గతి. మోక్షం లభిస్తుంది. జీవించి ఉన్ననతకాలం శరీరేంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు.

7. నీవు వివాహం చేసుకోవాలనుకుంటున్నావని విన్నాను. నీ కోరిక తీర్చడానికి నీకు ఇచ్చుటకు నిర్ణయించబడిన కన్యను నీకు ఇస్తున్నాను. (ఒకరికి ఇస్తానని అన్న అమ్మాయిని వేరొకరికి ఇవ్వడం వ్యభిచారముతో సమానం. ఇంకొకరికి ఇస్తా అన్న అమ్మయిని వివాహం చేసుకోకూడదు అని శాస్త్రం)

8. ఒకరికి ఇస్తానని అన్న అమ్మాయిని వేరొకరికి ఇవ్వడం వ్యభిచారముతో సమానం. ఇంకొకరికి ఇస్తా అన్న అమ్మయిని వివాహం చేసుకోకూడదు (అన్యప్రస్థాం నగృహ్ణీతా) అని శాస్త్రం

9. బ్రహ్మ తన చాయతో సృష్టి జరిపాడు. ఇది తామస (మోహ) సృష్టి. అది చూసి తృప్తి పడలేదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు (లేదా ఆ తామస భావాన్ని విడిచిపెట్టాడు)
బ్రహ్మ విడిచిపెట్టిన రూపముతో రాత్రి పుట్టింది. ఈ రాత్రిగా ఉన్న ఈ తామస భావాన్ని యక్షులు రాక్షసులూ తీసుకున్నారు. తరువాత దైవ సృష్టి చేసాడు. సత్వ గుణముతో తేజో మయముగా ఉంది. ఆ శరీరాన్ని విడిచిపెడితే వెలుతురు అయ్యింది. తన నడుము నుండి కొంతమంది సృష్టించారు. వీరు రాక్షసులకంటే భయంకరులు. కామోద్రేకులు. బ్రహ్మ కామోద్రేక భావాన్ని విడిచిపెట్టాడు. అపుడు అది సంధ్యగా మారి,ఆ సంధ్యాకాలం ఒక స్త్రీగా మారి కామోద్రేకముతో ఉన్న వారికి ఇవ్వబడింది.ఈ సంధ్యను స్త్రీ అనుకొని మూఢులై స్వీకరించారు. సంధ్యాసమయం రాక్షస భావాలకు ఆస్పదం. ఆ సమయములో భగవత్ పూజ స్తోత్రమూ పూజా తప్ప ఏ పనీ చేయకూడదు (భోజనం గానీ, పని గానీ)

10. దేహము కన్నా ధర్మాచరణా, భోగము కన్నా తపస్సిద్ధీ ఎంతో ముఖ్యము.నూరు సంవత్సరాలు పరిశుద్ధితో శరీరన్ని మనసుని నిగ్రహించుకుని ఎదురుగా ఉన్న ప్రియుడైన భర్తను చూస్తూ సేవించింది దేవహూతి. ఉత్తమ సంతానం కలగాలంటే దంపతులు కఠోరమైన నియమాన్ని ఆచరించాలి.  ఎంతటి భోగాన్ని అనుభవించే శక్తి ఉండి కూడా కేవలం విరత్కి చేత అనుభవించలేదు. అన్నీ వేదాలలో ఉన్నా, కోరిక లేక వారు అలా అనుభవించలేదు.

Popular Posts