Followers

Friday, 2 August 2013

అంతా దైవం దయ..


ఈ అద్భుతమైన సృష్టి దైవం వల్ల ఏర్పడింది .


ప్రాచీన గ్రంధాలలో సృష్టి గురించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.

అయితే , నాస్తికులు దైవం అంటూ ఎవ్వరూ లేరు అంటారు. .


ఇంకా,.... సృష్టి దానికదే మొదలయిందని , బిగ్బాంగ్ ద్వారా గ్రహాలు, నక్షత్రాలు వగైరా వాటికవే ఏర్పడ్డాయనీ, తరువాత సూర్యుడు, గాలి, నీరు ఏర్పడటం , డైనోసార్లు పుట్టటం, తరువాత పోవటం, తరువాత కోతులు పుట్టటం , వాటిలో కొన్ని కోతులు మనుషులుగా మారిపోవటం .... ఇలా చెబుతుంటారు. .


(డైనోసార్లు ముందుపుట్టాయా ? కోతులు ముందు పుట్టాయా ? అన్నది నాకు తెలియదు.)

ఇదంతా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.


ఏ శక్తి సహాయం లేకుండా ఏదైనా నిర్జీవమైన వస్తువు దానికదే పనిచేయటం జరగదు కదా !


ఉదా...ఒక నిర్జీవమైన కంప్యూటర్ను ముక్కలు చేసి ఒక గదిలో పడేసి ఒక సంవత్సరం తరువాత చూస్తే కంప్యూటర్ భాగాలు అలాగే పడి ఉంటాయి కానీ, ఆ ముక్కలన్నీ వాటికవే అతుక్కుని కంప్యూటర్ తయారయిపోవటం జరగని పని.


కంప్యూటర్ తయారవ్వాలంటే .... దానివెనుక మనిషి లేదా మనిషి తయారుచేసిన యంత్రాలు ఉంటేనే కంప్యూటర్ తయారవుతుంది.


అలాగే ....ఏ శక్తి ( దైవం ) ప్రమేయం లేనిదే బిగ్బాంగ్ , తరువాత పరిణామాలూ ..... ఇలా దానికదే సృష్టి జరగటం అసంభవం .


సృష్టిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.


జీవులలో ప్రాణం ఎలా వస్తుంది ? ఇన్ని కోట్ల మనుషుల్లో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒక్కలా ఎందుకు ఉండవు ? ఇలా.........ఎన్నో ప్రశ్నలు.



వాతావరణానికి , పరిసరాలకు అనుగుణంగా మాత్రమే .... అన్ని జీవుల పుట్టుక జరిగి ఉంటే ........ మరి ఒకే రకమైన వాతావరణం, పరిసరాలు ఉండే ఒకే చెరువులో పుట్టే జీవులన్నీ ఒకేలా ఉండవు కదా !


ఒకే చెరువులో ఆల్గే . దాన్ని తినే చేపలు, కప్పలు, వాటిని తినే పాములు, ఇలా ఎంతో భిన్నంగా జీవుల పుట్టుక ఉంటుంది.


ఇలా సృష్టించటం ఎంతో అద్భుతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఆ మహాశక్తినే దైవం అని ఆస్తికులు ఆరాధిస్తుంటారు.



అంతేకానీ ఏ శక్తీ ( దైవం ) లేనిదే ఇంత అద్భుతమైన ప్రణాళిక గల సృష్టి దానికదే ఎలా ఏర్పడగలదు ? 


సృష్టిని దైవం సృష్టించారు .... అని ఆస్తికులు నమ్ముతారు.

మరి దైవాన్ని ఎవరు సృష్టించారు ? అన్న ప్రశ్నకు గ్రంధాలలో సమాధానాలు ఉంటాయి. అయితే అవి నా లాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....... .


ఈ సృష్టి ఎలా ఏర్పడింది ? అన్న ప్రశ్నకు...... దైవం వల్ల. అని ఆస్తికులు సమాధానం చెప్పగలరు.


కానీ ఈ సృష్టి ఎలా ఏర్పడింది ? అన్న ప్రశ్నకు .....నాస్తికులు సమాధానం చెప్పలేరు.


వారు సృష్టిలోని పదార్ధాల నిర్మాణం గురించి వివరించగలరు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టి చెప్పగలరు అంతే.


. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండేలా ఏర్పరచటం,

సూర్యుడు రోజూ క్రమం తప్పకుండా ఉదయించటం అస్తమించటం ,

చంద్రుడు బెడ్ లైట్ లాగా తక్కువ వెలుతురుతో వెన్నెలను కురిపించటం ...

ఇవన్నీ దైవం అనే మహాశక్తి ప్రమేయం లేకుండా వాటికవే జరిగిపోవు కదా !


ఇవన్నీ ఏర్పరిచిన అద్భుతమైన ఆలోచనా శక్తిగల మహాశక్తి దైవం....దైవానికి అనేక కృతజ్ఞతలు.

అంతా దైవం దయ...

Popular Posts