మనది మతం కాదు. మనది ధర్మం. వేద ధర్మం మతం
అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత
పుట్టింది. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఏ లక్షణం
వుంటుందో అది ప్రకృతి ధర్మం. వైదేసికంగా వికాసం
చెందిన మానవుడు క్రమంగా ప్రకృతికి దూరంగా
జరుగుతాడు. దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులను
ఎదుర్కొంటాడు. అలాంటి విపత్తుల నివారణ కోసం
మహాత్ములు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు.ఈ
నిబంధనలు గ్రంథంగా ఏర్పడ్డాయి. అవే ధర్మశాస్త్రాలు.
అందుకే అవి ముఖ్యమైనవి.