పూజ
ప్రార్థన మూలంగా మనం భగవంతుని నుండి
అనేకములు పొందుతాం. అందుచేత పరిపక్వత చెందిన
మనస్సుతో భగవంతునికి కొన్నిటికి సమర్పిస్తాం. ఇలా
వచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతున్నపుడు, మనం
క్రమక్రమంగా భగవంతుని సమీపిస్తాం. ధ్యాన స్థితి
నెలకొంటుంది. ధ్యానస్థితిని ఉపాసన అని పేర్కొంటారు.
ఉపాసన (ఉప ఆసన) అంటే దగ్గరగా ఉండడం.
భగవంతునికి దగ్గరగా ఉండడమన్నమాట.
అర్హులైన కొందరి జీవితంలో ప్రార్థనే ధ్యానంగా
రూపాంతరం
చెందడం కద్దు. కాని, అనేకులకు ప్రార్థనకు, ధ్యానానికి
నడుమ ఒక మెట్టు ఆవశ్యకమవుతుంది. అదే పూజ. ఈ
విధంగా పూజ మానవుణ్ణి భగవంతుని దగ్గరకు తీసుకొని
పోతుంది. భగవద్దర్శనం కలిగిస్తుంది.
పూజకు మూలాధారమైనవి:
1. త్యాగం: దైవం నిమిత్తం ఒక వస్తువును త్యాగం
చేయడం, అంటే సమర్పించడం పూజ.
అది ఒక పుష్పమే కావచ్చు. పదార్థమే కావచ్చు.
మనస్సే కావచ్చు, పనియే కావచ్చు. ఎలాటిదైనా దానిని
త్యాగభావంతో సమర్పించాలి. ప్రార్థనద్వారా పరిపక్వత
సంతరించుకొన్న మనస్సుతో సమర్పించాలి. పత్రం,
పుష్పం, ఫలం< తోయం – వీటిలో వేటినైనా
స్వీకరిస్తానని
భగవద్గీతలో భగవానుడు తెలిపే ఉన్నాడు. కాని దాన్ని
సభక్తికంగా సమర్పించాలని ఆయన వక్కాణించాడు.
2. పవిత్రత: హిందూమతం మూడు రకాల పవిత్రతను
ప్రస్తావిస్తుంది.
మొదటిది అధి భౌతికం: భౌతిక స్థితిలో అంటే బాహ్యమైన
పవిత్రత. పూజాద్రవ్యాలన్నిటిని మంత్రోచ్ఛారణ చేస్తూ
నీటితో శుభ్రపరచడమే ఇది.
రెండవది అధి దైవతం: ఒక్కో వస్తువుకూ, శరీరంలోని
ఒక్కో అంగానికి ఒక దివ్యరూపం ఉంటుంది. అవి
ఒక్కోదేవత అధీనంలో ఉంటాయి. ఈ దేవతను
అధిష్టానదేవతగా పేర్కొంటారు. ఈ దెవతలను గంట,
దీపం, శంఖం, పువ్వులు, నీరు ఇత్యాదులతో ఆవాహన
చేయడం వల్ల ఆ వస్తువులు పవిత్రీకరింప బడతాయి.
మూడవది ఆధ్యాత్మికం:- మానవ ఆత్మ శాశ్వతంగా
పవిత్రమైనది. స్వయంప్రకాశమైనది. పాపం,
అపవిత్రతలు
మనస్సుకే వర్ణిస్తాయి. అందుచేత మనస్సున
పవిత్రీకరించడం మూలంగా ఆత్మ తన స్వాభావిక
ప్రకాశాన్ని, వైభవాన్ని అభివ్యక్తీకరిస్తుంది.
నాలుగవై దివ్యబంధం:- పూజించే వ్యక్తికి, ఇష్టదైవానికి
మధ్య ఒక బంధం నెలకొనాలి. పూజించే విగ్రహంలో
భగవంతుడు నెలకొని ఉన్నట్లు భావించాలి. అక్కడ
నెలకొని ఉన్న ఆయనతో పూజించే వ్యక్తి ఎడతెగని
బంధాన్ని ప్రేమబంధాన్ని ఏర్పరచుకోవాలి.