హెయిర్‌వాష్
హెయర్‌కట్ కోసం వెళ్లినప్పుడు హెయిర్ వాష్ చేసి కట్ చేయడం సాధారణం. ఆ సమయంలో హెయిర్ డ్రస్సర్‌కు తల ఇచ్చేసి పనయిపోయిందని రిలాక్స్ అవ్వొద్దు. ఈ సమయంలో మీ నెక్ కేర్ తప్పనిసరి. వాష్‌బేసిన్, చైర్‌ల ఫిట్టింగ్ సరిగా లేక మీకు మెడ నొప్పులు రావడం ఖాయం. అందుకే ఆ సమయంలో మీ మెడకు సపోర్ట్‌గా మెత్తటి టవల్ కానీ, ప్యాడ్ కానీ ఉంచాలి.
వ్యాక్సింగ్
పెడిక్యూర్
ఫిష్ పెడిక్యూర్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ దీని వల్ల ప్రమాదముందంటున్నారు వైద్య నిపుణులు. హెపటైటిస్8, హెచ్‌ఐవీ, రక్తం నుంచి వ్యాపించే రకరకాల వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నిల్వ ఉంచిన నీళ్లు, చేపలతో ఇవి ఎక్కువగా వ్యాపించే అవకాశముందని అంటున్నారు. లింక్ ఉన్న ఫిష్ ట్యాంక్‌లను వాడొద్దని నిర్వాహకులకు చెప్పండి. ఎపుడూ తాజా నీటిని, బ్యాక్టీరియా లేకుండా ఉన్న నీళ్ల ట్యాంకులనే ఉపయోగించమని చెప్పండి. పెడిక్యూర్ కోసం ఉపయోగించే టబ్స్‌లో ఎక్కువగా నీరు నిల్వ ఉంటుంది. దీంతో ఎక్కువ ఫంగస్8, ఇతర ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాగా శుభ్రపరిచిన టబ్‌ను మాత్రమే ఉపయోగించమని చెప్పాలి.
మ్యానిక్యూర్
మీరు పార్లర్స్‌లో మ్యానిక్యూర్ చేయించేటప్పుడు గోళ్లను పూర్తిగా కత్తిరించేస్తారు. వీటితోపాటుగా పక్కనే ఉన్న క్యూటికల్స్ కట్ అవుతాయి. కట్ అయిన క్యూటికల్స్‌తో ఇన్‌ఫెక్షన్స్ సులువుగా వచ్చే అవకాశం ఉంది. గోళ్లు కత్తిరించే సమయంలో వేడి నీటిలో ముంచి తీసిన వస్తువులనే వాడమని చెప్పాలి. క్యూటికల్స్ తెగిపోకుండా జాగ్రత్త పడాలి.
బొటక్స్ ట్రీట్‌మెంట్
పిగ్మెం హెయిర్ రిమూవల్
ఈ కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య పిగ్మెం అన్‌వాంటెడ్ హెయిర్. పిగ్మెం కోసం చేసే ట్రీట్‌మెంట్స్ హైపో పిగ్మెం హైపర్ పిగ్మెం ఏదైనా మీ స్కిన్‌కు సరిపడని చికిత్స అయితే ఇది స్కిన్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. చర్మం పూర్తిగా కమిలిపోయే అవకాశం ఉంది. ట్రీట్‌మెంట్‌కు ముందు, తరువాత పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి.
హెయిర్ కలరింగ్
హెయిర్ కలరింగ్ వల్ల జుట్టు కళ కోల్పోవడమే కాదు, పూర్తిగారాలిపోయి బట్టతలకు దారి తీయవచ్చు. అందువల్ల హెయిర్ కలరింగ్ కోసం ఆర్గానిక్ కలర్స్‌ని, అమోనియా లేని రంగులను మాత్రమే వాడమని చెప్పండి. మీ హెయిర్ కలర్‌ను కాపాడే షాంపూస్8, కండీషనర్స్‌ను మాత్రమే వాడమని హెయిర్ డ్రెస్సర్‌కు చెప్పాలి. దీనివల్ల జుట్టురాలిపోవడం తగ్గడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.