ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. మనిషికి శక్తినిచ్చే సాధనం నిద్ర. సరైన నిద్ర లేకపోవ టం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటా యి. పడుకోగానే రాత్రి మంచి నిద్ర పట్టగలగటం ఒక వరం. నిద్రలేకపోతే మనిషి జీవితం నరకప్రాయ మే. మంచి నిద్ర వల్ల ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యం గా ఉంటారు. ఏదో సమయంలో ఎప్పుడు పడితే అ ప్పడు నిద్ర పోకూడదు. నిద్రకు కూడా ఒక సమ యం నిర్దేశించుకోవాలి. ప్రతిరోజూ పడుకునే సమ యం, మెలకువ తెచ్చుకునే సమయం ఒకటిగా పాటించాలి. దీనివల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది.
పగటి పూట ఆట, పాట, చదువు, ఉద్యోగం వంటి వాటిని చూసుకోవాలి. రాత్రిపూట నిద్ర పోవాలి. ఈ పనులను ప్రకృతి నిర్దేశించింది. శరీరం కూడా ఒక్కొక్క సమయంలో ఒక రకమైన పనికి సిద్ధంగా ఉంటుంది.అందుకే ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో నిర్దేశిత పనులు చేయాలి.పగటిపూట గంటసేపు పడుకున్నా చాలు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకుండా పోవటానికి. రాత్రిపూట నిద్ర తగినంత పొం దాలంటే పగటి పూట నిద్రకు దూరంగా ఉండాల్సిందే.పనులు చేసుకుని అలసిపోయిన వారు పగటిపూట కొద్దిసేపు న డుం వాలుద్దామనుకుంటారు. వారికి తెలీకుండానే చిన్నగా నిద్రలోకి జారుకుంటారు. ఒక పావుగంట సేపు పడుకుందాం అనుకున్నవారు కాస్తా గంటలసేపు కొనసాగిస్తారు. దీని ఫలి తంగా రాత్రిళ్ళు కళ్ళు తెరుచుకొని కూర్చోవలసి వస్తుంది.
అవసరానికంటే ఎక్కువ సమయం నిద్రపోతున్నట్టు అనిపిస్తే నిద్రను నియంత్రించేందుకు అలారం గడియారాన్ని ఉపయో గించవచ్చు. ఎన్ని గంటలు పడుకోవాలనుకున్నామో, ఆ మోతా దు మించకుండా ఉండేందుకు అలారంను సెట్ చేసు కోవాలి. పడకగదిలో అలారం క్లాక్ లేదా వాల్‌క్లాక్ ఉండటం వల్ల ఇబ్బంది ఉంటుందంటారు చాలా మంది. ప్రతి పది నిమిషాలకు గడి యారం వైపు చూడాలనిపిస్తుంది. అలా చూడటం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. ఇటువంటి సందేహం మనసులో ఉంటే గడియారాన్ని ఎదురుగా కాక, ధ్వని వినిపించేలా కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదా ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ల వాడ కం ఎక్కువ అయింది కాబట్టి దానిలోనే అలారం టైమ్ ఫిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పడుకోవచ్చు.
నిద్ర సరిగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటి లో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి గురయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగం లో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి.ఇటువంటి సమస్యలకు విరుగుడు సాయంత్రం వేళలో చేసే వ్యాయామం. నడక లేదా యోగాసనాలు వంటివి వేయటం వల్ల సులభంగా నిద్రపోగలుగుతారు. పడుకునే ముందు దీర్ఘం గా గాలి పీల్చి వదలటం వల్ల శరీరం తేలికపడుతుంది. నిద్ర లోకి తీసుకుని వెళ్ళే మార్గాలలో అది ఒకటి మాత్రమే. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవటం చాలా సులభం.
జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. రాత్రివేళ భోజ నం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది.
నిద్ర సమస్యకు పడకగది వాతావరణం కూడా కారణం కావ చ్చు. కంటి మీద వెలుతురు కనుక పడుతుంటే కూడా నిద్ర పట్టదు. ఎక్కువ వేడిగా ఉన్నా, మరీ చల్లగా ఉన్నా నిద్ర పట్టడం లో సమస్య వస్తుంది. మరీ చీకటిగా కూడా పడకగది ఉం డ కూడదు. వెలుతురు కూడా అనుకూలంగా ఉండి తీరా లి. గదిలో ఒక మూలగా బెడ్ ల్యాంప్ వెలుగుతుంటే బాగుంటుంది. గదిలోని వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండాలి. విపరీతమైన గాలి, శబ్దాలు నిద్రను పాడు ఏస్తా యి. కనుక పడకగదిలో ఎక్కువగా ధ్వనులు రాకుండా వాతావరణం ఉండాలి.
సాయంత్రం వేళ తీసుకునే కాఫీ, టీ, మత్తు పానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. సాయంత్రంవేళ అతిగా పొగతాగిన వారికి, నిద్రకు ముందు రెండు, మూడు గం టలు టెలివిజన్ కార్యక్రమాలు తిలకించే వారికి నిద్ర సమస్య తలెత్తుతుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే పై ఏ కారణాల వల్లనో అయి ఉండవచ్చునని గమనించండి. మానసిక వత్తిళ్ళ వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. నిద్ర పట్టడం లేదని వైద్యుని సలహా లేకుండా మాత్రలు అలవా టు చేసుకుంటారు కొంతమంది. ఇది మంచి అలవాటు కాదు. ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.
నిద్ర వస్తే ఎక్కడైనా నిద్ర పోగలం అనేది అన్ని సమయాల లో నిజం కాదు. మంచి నిద్ర పట్టటానికి పక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పక్క సౌకర్యంగా లేకపోతే నిద్ర పట్టదు. అది సౌకర్యవంతమైన పక్క అయితే హాయిగా నిద్రించగలుగుతారు. పక్క మీద ముడతలు లేకుండా, దుప్పటిని బాగా దులిపి వేసుకోవాలి పడుకునే ముందు. దిండు మరీ ఎత్తుగా లేదా మరీ లోతుగా ఉండకుండా చూసుకోవాలి.
కొంతమందికి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకోవ టం అలవాటు. అది మంచి అలవాటే. మంచి సంగీతం ఏదైనా పర్వా లేదు. అది జోకొట్టినట్టుగా పనిచేస్తుంది. మంచి సంగీతం వింటే అది మెదడులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
నిద్రకు తప్పనిసరిగా ఆరు నుండి ఎనిమిది గంటలు కేటా యించుకోవాలి. ఆరుగంటలకన్నా తక్కువ నిద్రపోవడం అంటే శరీరాన్ని కష్టపెట్టటమే. పెద్దవాళ్ళకన్నా పిల్లలకు నిద్ర ఎక్కువ అవసరం. పిల్లలు కనీసం పది గంటలన్నా నిద్రపోవాలి. నిద్రను ఒక క్రమపద్ధతిలో పాటించాలి. లేకుంటే ఇబ్బందే.అన్ని అంశాలు సక్రమంగా ఉన్నప్పటికీ నిద్రలేకపోతుంటే అతి ఆలోచనలు మెదడులో ముసురుతున్నాయేమో చూసు కోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. పైన చెప్పిన సూత్రాలను అనుసరిస్తే నిద్ర సమస్యను అధిగమించి హాయిగా నిద్రపోయి నిద్రలో వచ్చే లాభాలు అందుకోగలుగుతారు.