Followers

Friday, 13 September 2013

జుట్టుకు, తలకు సౌందర్య పోషణ



  • ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
· ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.అన్నం ఉడికిన తర్వాతబియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి గంజిని ఆరంగ ఆరంగా కనీసంమూడుసార్లు జుట్టుకు పట్టించాలితర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలిఇది జొన్నపీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
· ఒక్కోసారి తలంతా దురద పుడుతుందిఅలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్పదురద మానదుఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్సఅందుకు ఏం చేయాలంటే తాజా బీట్రూట్ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలిదీనిని నేరుగా తలకుపట్టించుకోవాలిపావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండిజుట్టు పట్టులామెరుస్తుంది.
· గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రుపోతుంది.
· తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకునిమృదువైన షాంపూ తో తలస్నానం చేయండి.జుట్టు పొడిబారటం తగ్గుతుంది.
  •  తలకు గోరింటాకు పెట్టుకునే ముందుదానిలో కొద్దిగా బీట్ రూట్ రసాన్ని కలిపితే జుట్టుకు మంచిమెరుపుతో పాటు రాగిరంగు ఛాయ వస్తుంది.
· నీళ్ళలో కలిపిన ఆపిల్ జూస్ ను తరచూ తలకి రుద్దుకుంటే చుండ్రు పోతుంది.
· పొడిబారిన కురులకు కొబ్బరినూనెకొబ్బరిపాలుపెరుగు తలా పావుకప్పుఒక గుడ్డులోని తెల్లసొనతీసుకునిఅన్నింటినీ బాగా కలపాలి మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాలతర్వాత కడగేయాలి.
  •  పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి.అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండిజుట్టు ఎంతో కోమలంగాతయారౌతుంది.
· పారిజాతం గింజల్లోని పప్పును వేరు చేసి బాగా దంచి తలకు పట్టించాలిపావు గంట తర్వాత కుంకుడురసంతో తలస్నానం చేస్తే చుండ్రుతగ్గిపోతుంది.
· పలుచని జుట్టు తరచూ రాలిపోయే జుట్టుతో బాధపడేవారు గోరువెచ్చటి ఆలివ్ లేదా బాదం నూనెతోమర్దన చేసుకుంటే సరి.
  • బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరిఅందుకు బొప్పాయి,అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలివీటన్నిటినిమిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి గుజ్జును బాగా వడకట్టాలిఅలా వడకట్టగావచ్చిన రసాన్ని తలంతా పట్టించండితర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
  • మెంతికూర ఆకుల్ని మెత్తగా నూరి దానిని తలకు పట్టిస్తుంటే జుట్టు బాగా పెరుగుతుందినల్లటిరంగు నిలబడుతుంది.
  • వారానికి ఒకసారి తలకు పుదీనా పేస్ట్ రాసుకుని ఇరవై నిముషాల పాటు ఉంచుకుని కడిగేస్తేచుండ్రు పోతుంది.
· సీకాయ పొడిలో కాస్త మజ్జిగ కలిపి తలంటుకుంటే జుట్టుకు మంచిది.

Popular Posts