ఆచార్యులవారు పూరించినవి
42వ శ్లొకము నుండి 59 శ్లొకములను ’సౌందర్యలహరి’ గా పరిగణింపబడుచున్నది. వీటిని ఆచార్యులవారే పూరించినారు.
42 గతైర్మాణిక్యత్వం గగన మణిభిః సాంద్రఘటితమ్
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః |
స నీడేయచ్ఛాయా చ్ఛురణ పటలమ్ చంద్రశకలమ్
ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ||
ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.
43 ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనమ్
ఘన స్నిగ్థ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌతభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మి న్మన్యే బలమథన వాటీ విటపినామ్ ||
దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన.
44 తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ
పరీవాహ స్తోత స్సరణిరివ సీమంతసరణిః |
వహంతీ సిందూరం ప్రబల కబరీభార తిమిర
ద్విషాం బృదైర్బందీకృత మిప నవీనార్కకిరణమ్ ||
దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.
45 అరాళైస్వాభావ్యా దళికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిరమ్ |
దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్క రుచిరీ
సుగంధౌమాద్యంతి స్మరదహన చక్షుర్మధుతిహః ||
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.
46 లలాటం లావణ్యద్యుతి విమల మా భాతి తపయత్
ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలమ్ |
విపర్యాసన్యాసా దుభయ మపి సంభూయ చ మిధః
సుభాలేప స్యూతిః పరిణమతి రాకాహిమకరః ||
లావణ్యకాంతితో నిర్మలమైన దేవి ఫాలము రెండవ చంద్రఖండమువలెనున్నది. మొదటి చంద్రఖండమును దేవి తలయందు ధరించినది.
47 భ్రువౌ భుగ్నే ద్భువన భయ భంగవ్యసనీ
త్వదీయే నేత్రాభ్యాం మభుకరరుచిభ్యాం ధృత గుణమ్ |
ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతౌః
ప్రకోష్టే ముషౌచ స్థగయతి నిగూఢాన్తరముమే ||
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి.
48 అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా
త్రియామం వామంతే సృజతి రజనీనాయకతయా |
తృతీయాతే దృష్టి ర్ధరదలిత హేమంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశమో రంతరచరీమ్ ||
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.
49 విశాలా కళ్యానీ స్ఫుటరుచి రయోధ్యా కునలయైః
కృపాథారా ధారా కిమపి మధురా భోగవతికా |
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే ||
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది.
50 కవీనాం సందర్భ స్తబకమకరం దైకరసికం
కక్షటావ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం |
ఆముంచంతౌదృష్ట్వా తవనవర సాస్వా దతరళౌ
అసూయాసంసర్గా దళిక నయనం కించి దరుణం ||
దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.
51 శివేశృంగారార్ద్రా తదితరజనేకిత్సు నపరా
సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజయనీ
సఛీషుస్మేరాతే మయిజనని దృష్టి స్సకరుణా ||
శ్రీ అమ్మవారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు భీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.