Followers

Sunday 29 September 2013

ప్రార్థన విధములు, అనేకములు ఉండవచ్చు. మనిషి మనిషికి మారవచ్చు. కాని, దాని ముఖ్యోద్దేశం అందరికీ ఒకటే.



ప్రార్థన విధములు, అనేకములు ఉండవచ్చు. మనిషి మనిషికి మారవచ్చు. కాని, దాని ముఖ్యోద్దేశం అందరికీ ఒకటే. ఒక జీవికి భగవంతునికి మధ్య ప్రత్యేకమైన బాంధవ్యమును పెంపొందించటానికి పనిసి వచ్చే సాధనమే ప్రార్థన. అంటే సృష్టి,సృష్టి కర్తకు మధ్యవుండే బంధాన్ని బలపరిచేదే ప్రార్థన.

సాధారణంగా దేనినైనా స్వీకరించే స్థితిలో ఉండటం మనస్సు ప్రవృత్తి  అందుచేతనే ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు ప్రార్థన. ఈ ప్రార్థనా ఫలితంగా భగవంతుని అనుగ్రహజనితవీక్షణం, విశ్వాసం, ప్రేమ, బలిమి రూపాలలో ప్రసరించిమన మనస్సును నింపుతుంది. మొత్తానికి ప్రార్థన మనిషికి ఆధ్యాత్మిక జ్ణ్జానమును పొందుటకు కావలసిన మనో వికాసమును కలుగజేస్తుంది.

ప్రార్థన చేయు విధానములు

ప్రార్థనను మూడు విధాల ఆచరించవచ్చు. అవి కాయిక, వాచిక, మానసలుగా పేర్కొనవచ్చు.

ఆచారకర్మ లేక ఒక పూజను చేయడం కాయిక పూజ కిందికి వస్తుంది. భగవంతుని పొగుడుతూ పాడుత, వేదములలోని ధ్యాన శ్లోకములను పఠించుట, భక్తి గీతములను పాడుత – వాచిక ప్రార్థన అనబడును. నిశ్శబ్దముగా మనసులో భగవంతుని ధ్యానము చేసుకొనుట మానస ప్రార్థనగా పేర్కొనవచ్చు.

Popular Posts