డ్రై స్కిన్... విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం.
- రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి అపె్లై చేయాలి. అది ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు రెగ్యులర్‌గా చేస్తే సరి.
- అరటి పండును గుజ్జును ముఖానికి అపె్లై చేసి అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- క్యారెట్ జ్యూస్‌లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయండి.
- ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అపె్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి.
- బీట్ రూట్ రసం రెగ్యుల్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.
- ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అపె్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అపె్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.