మనకు శరీరాన్ని ఇచ్చిన తల్లి తండ్రులను , మనకు కావలసిన ప్రాణ వాయువు ని , ఆహారాన్ని ప్రసాదించే ప్రకృతిని , కాంతినిచ్చే సూర్యుణ్ణి , ఓషధుల నిచ్చే చంద్రున్ని, మనకు కారణ శరీరాన్ని , ఆత్మని - ఇవన్నీ ప్రసాదించిన శక్తిని మనం ఏ పేరు పెట్టి ఏ రూపంలో కొలిచినా అది మన కృతజ్ఞా భావాన్ని తెలియ చేసేదే .
నామ సంకీర్తన మొదలగు నవ విధములైన భక్తీ విధానాలు మనిషిని దైవత్వం వైపుకి మళ్ళించే సాధనలు .
మనుషు లంద రూ ఒక్క రకంగా ఉండరు . సాత్విక ,రాజసిక ,తామసిక గుణాల సంమే ళ నమే మనిషి .
త్రిగుణాల నిష్పత్తిలో ఉన్న తేడాల వ ల్ల మనుషుల్లో రకరకాల మన స్తత్వాలు ఉంటాయి .
దానికి అనుగుణంగా మనిషి ఎంచుకొనే పద్దతులు - ఆలోచనలు ,పనులు ,అలవాట్లు ,చేసే ప్రార్ధనలు ,పూజలు ,పూ జించే దేవతలు - విభిన్నంగా ఉంటాయి .
ఒకే మనిషి భిన్న కాలాల లో , భిన్న పరిస్థితుల లో భిన్నంగా ప్రవర్తిస్తాడు .అలాగే పూజలు ,దేవుళ్ళు .
99.99 శాతం మనుషులు అతి సామాన్య మానసిక స్థాయి లో ఉంటారు . వారి వారి అవసరాలకు , మన స్తత్వా లకు అనుగుణంగా ఏక కాలం లోనే వివిధ దేవుళ్ళ ను పూ జిస్తారు .
సాధకులు ఒ కే దేవుణ్ణి మంత్ర పూ తం గా ధ్యానిస్తారు .
పంచాయతన పూజ - శక్తి ,గణపతి ,సూర్య ,విష్ణు ,శివ - ఆరాధన లు
షోడసోప చార పూజలు ,నోములు ,వ్రతాలు , శాంతులు ,యాగాలు , హొమాలు ,యజ్ఞాలు -ఇవన్నీ సకామం (కోరికలు ) తో చేసే పూజలు.
యమ నియమాల తో ధ్యాన సమాధి తో చేసే సాధనాలు ముక్తి కోసం నిష్కామం గా చేసే ఆత్మా ర్పణలు .
దైవ చింతన కు భౌతిక రూపం పూజ .
విగ్రహారాధన , ఏకేశ్వరోపాసన , రూప రహిత పూజ , బహు దేవత పూజ -ఇలా ఏ మార్గమైనా మనిషిని సదా దైవ స్మరణ లో ఉంచితే అదే అనుసరణీయం .