Followers

Wednesday, 30 October 2013

మగవాడు పరిపూర్ణ మగవాడు ఎప్పుడు అవుతాడు? ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి.

శుక్ల యజుర్వేదం లోని "శథపథ బ్రాహ్మణం" లోని క్రింది శ్లోకాన్ని చూడండి.

అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి
సర్వో భవతి! సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి (5.2.1.10)

అర్థం :
 
భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.

కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.

మనం ఇంకోటి గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది. పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడే పరిపూర్ణత పొందుతాడని చెప్పబడింది. అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది.

Popular Posts