Followers

Wednesday 23 October 2013

విగ్రహారాధన -- దేవాలయ వ్యవస్థ


హిందూధర్మం యొక్క మూల సూత్రాలలో ఒకటి విగ్రహారాధన. అన్యమతాలు దీనిని అంగీకరింపవుకాని, పరోక్షంగా ఆచరిస్తూనే ఉంటాయి. విగ్రహారాధనను తిరస్కరించే వారంతా దానిని అనుసరిస్తున్నవారే. దీన్ని నిరూపించే చక్కని సంఘటన వివేకానందుని చరిత్రలో కన్పడుతుంది. పాశ్చాత్య ప్రభావానికి లోబడిన ఆళ్వారు మహారాజు హిందూ ధర్మాచారాలను వ్యతిరేకించేవాడు. స్వామీజీముందు విగ్రహారాధనను గూర్చి చెడుగా విమర్శించాడు. కొద్ది సమయం ఆగి వివేకానందస్వామి దివానును పిలిచి రాజుగారి పటం తీయించి దానిపై ఉమ్మి వేయమని చెప్పాడు. దివాన్ "మహారాజుకు అవమానం చేయజాలనని" బదులిచ్చాడు. వెంటనే వివేకానంద "రంగుపూసిన గుడ్డమీది బొమ్మపై ఉమ్మివేయడం మీ మహారాజునవమానించడం ఎలా అవుతుంది?" అంటూ ఆళ్వారు రాజుతో "ఈ చిత్రంలో వీరు మహారాజును చూస్తున్నారు. అలాగే భక్తులు విగ్రహంలో భగవంతుని చూడటంలో తప్పేముంది?" అనటంతో ఆళ్వారు మాహారాజుకు ఙ్ఞానోదయమైంది.

అన్ని మతాలవారు వారి దేవుళ్ళయొక్క, దేవాలయాల యొక్క చిత్రాలను, కట్టడాలను దైవ సమంగా పవిత్రంగా చూసుకొంటున్నారంటే పరోక్షంగా వారూ విగ్రహారాధనను అంగీకరించినట్లే. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది. దానిని చించినా తగులబెట్టినా వారిని కఠినంగా శిక్షిస్తారు. "అది గుడ్డయేకదా!" అంటే కాదు అది ఆ దేశానికే ప్రతీక. దానిని అవమానిస్తే ఆ దేశాన్ని అవమానించినట్లు.

Popular Posts