తీర్థయాత్రలలో మన సంప్రదాయాలు
చాల మందికి కొత్త ప్రాంతాలు సందర్శిoచాలన్న కోరిక ఉంటుంది .కానీ దాన్ని సాకారం చేసుకోవడాoలొనే పలు సమస్యలు ఎదుర్కొంటారు .మిగిలిన యాత్రల సంగతి ఎలా ఉన్న తీర్థయాత్రల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు తేలుసుకోదగ్గ విషయాలు ఉంటాయీ.
"భగవంతుడు సర్వాoతర్యామి "అన్న కారణంగా ఎ యాత్ర చేయకుండ ఉంటే తరువాత కాలం గడిచి ,వృద్దప్యoలోకి వచ్చాక ,ఆధ్యాత్మిక మార్గంలోకి పట్టిన తరువాత బాధపడే స్థితి వస్తుంది .అందువల్ల ఆరోగ్యం సహకరించినప్పుడే ఆర్ధిక తదితర సమస్యలను ఏదోలా అధిగమించే కొన్ని ముఖ్యమైన తీర్థయాత్రలైనా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి .
విహార ,విజ్ఞానయాత్రల మాదిరిగా ఆధ్యాత్మిక పర్యటనలను తేలీగ్గా తీసేయలేo .కొన్నీ రకాల ఆహ్హ్లదకర ప్రాంతాలను ఎప్పుడు ,ఎలా వెళ్లి చూసి వచ్చిన పెద్ద తేడా ఉండకపోవచ్చు .కానీ తీర్థయాత్రల విషయం అలా కాదు .ఆయా సందర్బాలు ,సమయాలలో అలాంటి వాటికీ ప్రతీక విలువ ,గుర్తింపు ఉంటాయీ.ఫలితంగా పుణ్యనికి పుణ్యo ,పురుషార్ధం లభిస్తాయని పెద్దలు అంటారు .అందువల్ల మంచి సమయాన్ని ఎంపిక చేసుకోండి .
ఆయా పండుగలు ,ఉత్స్ట్టవాలు ,వేడుకలప్పుడు ,సంభంతిత క్షేత్రాలు శోభయమనంగా ,వెలుగొందుతుoటాయి .ఉదాహరణకు పుష్కరాల సమయంలొ నదిస్తాన్నం ,బ్రహ్మోత్స్ట్టవాలు .కుంభ మేళాలు ,ప్రత్తేక దీక్షలు ,జాతర వేళ ఆయా ప్రదేశాలను సందర్శిoచడానికి ఆనేకమంది అదిక ప్రాధాన్యం ఇస్తూoటారు .ఇలాంటి వేళ దైవదర్శనాల వల్ల అదిక పుణ్యం సంప్రాప్తిస్తుంది అని పెద్దలు అంటారు .
ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ముందు వెంట తీసుకెళ్లవలసిన వస్త్తువులతో పాటు ,పూజా సామాగ్రీని కూడా మరిచిపోకూడదు .ప్రతిది అక్కడికి వెళ్లాకే కొనుక్కోవచ్చు .అనుకొంటే ఒక్కోసారి అనవసరశ్రమ ,కాలయాపన ,అదిక వ్యయం తప్పకపోవచ్చు .ఆలాగే యాత్ర నుండి తిరిగి వస్తు ఆక్కడి నుండి ప్రసాదాలతో పాటు కుంకుమ ,తీర్థాలు తేచ్చుకోవడం మరిచిపోవద్దు .
దక్షిణ ,ఉత్తర ప్రాంతాలలోని ఆయా దేవలయలలో కొన్ని ప్రత్తెయేక నియమాలు ఉంటాయీ .ఉదాహరణకు తమిళనాడులోనీ గురువాయుర్ వంటి అనేక ప్రధాన క్షేత్రలలోను ,పురుషులు ప్యాoటు ,పైన చొక్కా ధరించి ఆలయ ప్రవేశం చేయలేరు .విధిగా లుంగీనో ,లేదా పంచనో ధరించాలి .ఎ ప్రాంతానికి వెళ్ళిన అక్కడి నియమాలను ముందే తెలుసుకోవడం మంచిది .
ఏ దేవలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు కీర్తనలు చేయడం మంచి భక్తుల లక్షణం .తిరుమల యాత్రికులు విధిగా "గోవింద " నామస్మరణం చేయస్లీoదేనంటూ ఇటివల వార్త వచ్చిoది .దైవసంకీర్తనలు ,భజనలు మనకే కాక తోటి వారికీ ఎంతో స్పూర్తిని ,ఉతేజ్జన్ని ఇస్తాయి .
సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలకు ,అనుగుణంగా దేవాలయాలలో నడుచుకోవాలి .ఉత్తరాది అర్చకులకు ,దక్షిణాది అర్చకులకు మంత్రోచ్చరణలోను ,వస్త్రదరణలోను కొంత తేడా ,మరికొంత పోలిక కనపడుతుంది .మనకు మంత్రాలూ వచ్చినా కొత్త ప్రాంతాలలో మనసులోనే చదువుకోవడo మంచిది ,పూజారులు సరిగ్గా ఉచ్చరించడం లేదంటే మనం ప్యాoటు,షర్టులతో ఉండి వాటిని చదవడం భావ్యంకాదు .
ఆధ్యాత్మిక యాత్రలకు అన్నీoటి కంటే ముఖ్యం మనసు.ఆత్మశుద్ధితో ,భక్తిప్రవృత్రులతో దైవసందర్సన చేసుకొంటే యాత్రఫలం సిద్దిస్తుంది అని పెద్దలు చేబుతారు .