శ్రీ సీతా రాముల కల్యాణం భారతీయుల జీవన స్రవంతిలో ముఖ్యం గా హిందూ వివాహ చట్రానికి
ఒక సూత్రం గా ఎలా , ఎందుకు భాసిల్లుతుంది ?
మన దేశ సంఘ వ్యవస్థ ఒక విధం గా మన వివాహ వ్యవస్థ పైనే ఆధార పడి ఉంది .
చెక్కు చెదరని వివాహ వ్యవస్థ ద్వారా పిల్లల పెంపకం , ఉమ్మడి కుటుంబాలు , సామాజిక సుస్థిరత -ఇవన్నీ ఒక దానిపై ఒకటి ఆధార పడి ఉన్నాయి .
రాముడు తదితర రామాయణ కాలపు వ్యక్తులు నిజం గా ఈ భూమి పై నడయాడిన వారేనా ?
లేక , కొత్తగా భూమి పై నివాసం ఏర్పరచు కొంటున్నఇతర గ్రహాల వారా ?
లేక వాల్మీకి సృష్టించిన పాత్రలా ? ---- ఇలాంటి సందేహాలతో ఎంతో మంది సతమవుతూ ,
అందరినీ తికమక పెడుతూ ఉన్నా, ఈ దేశం లోని సామాన్య జనులు మాత్రం రామాయణాన్ని వారి
గుండె లలో పెట్టుకొని , జీవన విధానానికి ,జీవిత గమ్యానికి చుక్కాని లాగా అన్వయించు కొంటూ
ప్రతి క్షణం పండుగ చేసుకొంటూ నే ఉన్నారు .
దేవ లోకపు వారా ? ఇతర గ్రహాల వారా ? అసలు మనుషులేనా ? అప్పటి నాగరికత అంతగా వృద్ది
పొందిందా ? ఇలాంటి సందేహాలని శాస్త్ర కారులకు వదిలేసి , మనం చూడ వలసింది రాముని నడత ,
సీతమ్మ దైర్యం &అనువర్తత , లక్ష్మణుని అంకిత భావం , భరతుని కర్తవ్య పాలన ,హనుమ పాండిత్యమూ ,
సేవా భక్తీ ... ,
భర్త గా ,అన్నగా ,కొడుకు గా , అన్నింటినీ మించి ప్రజలను పాలించే రాజుగా - ఎలా నడవాలో ,
నడవడిని ఎలా మార్చుకోవాలో అంటే మనిషి తన ధర్మాన్ని ( అవసరమైన కార్యం ) ఎలా నిర్వర్తిం చాలో
చూపించిన మార్గ దర్శి రాముడు .
ధర్మం అంటే - మనిషి జీవనానికి కి అత్యవసర మైన వన్నీ సాధించు కోవడం మనిషి కనీస ధర్మం .
నేడు మనలో లోపించిందీ ధర్మమే . అనగా మన కేది అత్యవసరమో తెలియక అన్నింటినీ కోరు కోవడ మే
అధర్మం .
రావణుడు , శూర్పణఖ , వాలి , కైకేయి , - వీరు , వారికి అత్యవసరం కాని వాటి పై మోజు పడి అధర్మం బాట పట్టి వారి జీవనాన్ని ,వారితో పాటు ఇతరుల జీవితాలను బ్రష్టు పట్టించారు .
మనిషి తను ఉన్న ఆశ్రమానికి ( విద్యార్ధి, గృహస్తు , వానప్రస్థ, సన్యాసి ,రాజు ,నాయకుడు తదితర ఆశ్రమాలు ) అనుగుణం గా , తన కనీస అవసరాలను గుర్తించి సాధించు కోవడం , ఆ క్రమం లో ఇతరులకు , ప్రకృతికి ఎలాంటి హానీ కలుగ కుండా జాగా రూకత తో మెలగడం ---- ఇదే మనిషి ధర్మం .
మతం గురించి , దైవం గురించి చెప్పడం లేదు .
రాముణ్ణి ,రామాయణాన్ని ఒక మతానికి పరిమితం చేయడం సంకుచిత్వం .
మనిషి జీవన నాదం ఎలా శ్రుతి చేస్తే స్వర లయ బద్దం గా ఉంటుందో వాల్మీకి చెప్పాడు . భారతీయులే కాదు ,
ఈ సమస్త భూమండలం లోని మనిషన్న వాడు, నడవ వలసింది రాముని బాట ,స్మరించ వలసింది రామ నామం , తరించ వలసింది రామాయణ పారాయణం ...
అప్పుడే సీతా రామ కల్యాణం విశ్వ కల్యాణానికి నాంది అవుతుంది .
రామో విగ్రహవాన్ పరమో ధర్మః