Followers

Tuesday 22 October 2013

ఆధ్యాత్మికత ఎందుకు ?

మనం చేసే కర్మలన్నీ ఫలితం ఆశించి చేస్తున్నాము .

కోపము ,కసి ,కోరిక ,పట్టుదల , గర్వం ,డబ్బు  ,భయం  , పోటీ , ఇత్యాది మానసిక స్తితులతో మనం పని లేదా కర్మలను చేస్తున్నాము .
ద్వంద భావంతో ,ద్వందం కోసం చేస్తున్న కర్మలన్నీ సుఖ దుఖాలను ఇస్తాయి .ఇవీ బండి చక్రం లాగా ఒకదాని తర్వాత వస్తూ పోతూ ఉంటాయి .
 ఈ  జీవితం ఇలాగే ఉన్నా చాలను కొంటే మరేదీ తెలుసుకో నవసరం లేదు .

కానీ , ఇలా ఎంత కాలం ? మన బ్రతుకు కి అర్ధం పరమార్ధం ఉందా ? అని ప్రస్నించు కొని ,  అప్పుడు మనం ఏ దైతే  తెలుసు కోవాలని అనుకొంటామో దానిని ఆధ్యాత్మికత అని అంటాము . 

నిజం గురించి తెలుసు కోవటం వేరు . ఇది విజ్ఞానం .
నిజాన్ని అనుభూతి చెందడం వేరు . ఇది జ్ఞానం .
అలాగే , దేవుడి గురించి తెలుసు కోవటం వేరు .ఇది పురాణం .
దేవు న్ని తెలుసు కోవటం వేరు . ఇది ఆధ్యాత్మికత .

Popular Posts