Followers

Monday 7 October 2013

వేంకటాద్రిలో వేం – కట వెనుక ఉన్న అర్థం ఏమిటి…?!!

ఏడుకొండలలో వేంకటాద్రిపై వెలిశాడు వేంకటేశ్వరుడు. ఈ వేంకటాద్రి పదంలో ‘వేం’ అంటే పాపాలు, ‘కట’ అంటే హరించడం అని అర్థం. సర్వ పాపాలు తొలగించే పవిత్ర స్థలం కాబట్టి ఇది వేంకటాద్రి అయిందని కొందరు, వేంకటేశ్వరుడు వెలసిన పర్వతం కాబట్టి వెంకటాద్రి అయిందని కొందరు అంటారు. ఏది ఏమైనా వేంకటాద్రి కున్న ప్రత్యేకత ఎంత చెప్పినా తరగనిది.
తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఉన్నంత ఆదరణ ప్రపంచంలో మరే పుణ్యక్షేత్రానికీ లేదు. సంవత్సరంలో ఏదో ఒకరోజు కోట్లాది మంది భక్తులు ఒక చోటుకు చేరే పవిత్ర క్షేత్రాలు ఇతర మతాల వారివి ఉండవచ్చు. కానీ సంవత్సరంలో ప్రతిరోజు ఎండ, వాన, తుఫాన్లు, వడగాల్పులు.. వేటినీ లెక్క చేయకుండా లక్షలాది మందిని తన దర్శనానికి పిలుపించుకునే శక్తివంతమైన రూపం మాత్రం ఏడుకొండలవాడిదే. వేంకటాద్రి శ్రీ వేంకటేశ్వరుని నివాసం. ఇది కలియుగ దైవం వెలసిన ప్రదేశం

Popular Posts