పురుటి విషయం (బిడ్డ జన్మించడం )జత శౌచం అవుతుంది .అంటే "అంటు " అంటారు.ఒకే ఇంటి వారికీ అంటే ఇంటిపేరు ,గోత్రం ఉన్న కుటుంభం వారికి పురిటి నీళ్ళ నుంచి మూడు రోజులకు అంటు ఉంటుంది ..నాల్గోవరోజు స్నానంతో వారు అంటు నుంచి విముక్తులు అవుతారు .జన్మించిన శిశువు తండ్రి ,తాత ,బాబాయ్ లకు మాత్రం పదకొండు రోజులు అంటు ఉంటుంది .ఈ పదకొండు రోజులు దేవాలయ ప్రవేశం ఉండదు .పదకొండవ రోజు శుద్ధి జరిగిన తరువాత ,శాంతులు ఏవైనా ఉంటే వాటిని నిర్వహించుకొని తదుపరి దేవాలయ దర్శనానికి వెళ్ళడం శుభప్రదం .
ఒకవేళ ఆ యజమాని దేవాలయంలో ఉద్ద్యోగిగా ఉంటే నాల్గోవ రోజు నుంచి దేవాలయ ప్రాoగణ ప్రవేశం చేయవచ్చు .గర్భగుడిలోకి కానీ ,ప్రసాదవితరనములకు గాని చేయకూడదు .కనుక నియమం పాటించడం అందరికి శుభప్రదం ఈ విషయం కొడుకు,కోడళ్ళకి కలిగిన సంతన అంశమని గమనించాలి .కూతురు కి పురుడు
ఐతే కేవలం మూడు రోజులు వరుకు తల్లితండ్రులుకు అంటు ఉంటుంది .నాల్గోవ రోజునుంచి యధావిధిగా అన్నీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు