స్త్రీలకు భర్త కలలో కనిపించినట్లైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. భర్త కలలో కనిపిస్తే ఆ స్త్రీ పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని పండితులు అంటున్నారు. అలాగే భర్తకి భార్య కలలో కనిపిస్తే ధనలాభము, ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది. కలలో అత్త చనిపోయినట్లు కనిపిస్తే అధిక ధనలాభం కలుగుతుంది.
ఇకపోతే కలలో తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారు. కలలో సోదరుడు కనిపిస్తే గౌరవం, కీర్తి లభిస్తుంది. కలలో అన్న-వదిన కనబడితే ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఇంకా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కలలో తమ్ముడు కనిపిస్తే పెద్దలను గౌరవిస్తారు. కలలో అన్నదమ్ములు డబ్బులిచ్చినట్లు జరిగితే ధనలాభము చేకూరుతుంది.