Followers

Wednesday, 9 October 2013

తిండి కాదు... బరువు తగ్గాలి

టీనేజ్ నుంచి మధ్య వయస్కుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు అందరూ నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు . అందుకు డైటింగ్, యోగా, వ్యాయామం... ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఎంత వ్యవధిలో ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో షెడ్యుల్ తయారుచేసుకోనే ముందు వయసు, శరీరాకృతి, ఆరోగ్య పరిస్థితి... ఇలా ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే బరువు తగ్గే మాట అటుంచి లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. 

ఒకేసారి డైటింగ్ చేసి అంటే పూర్తిగా బోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటారు చాలా మంది, ఇది పొరబాటు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపు కోల్పోతుంది. వ్యార్ధకపు చయలు కనిపిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో క్యాల్షియం , ఇనుము, విటమిన్ - ఎ,ఇ,సి,బి కాంప్లెక్స్‌లు వంటి సూక్ష్మపోషకాలు తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి . సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉండాలనే ...మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

ఆహారంలో జాగ్రత్తలు
సమతులాహారం, వ్యాయామం, జీవనవిధానం... వీటన్నింటితో కూడి ఉండాలని మీ బరువు తగ్గే ప్రణాలిక, సరైన సత్ఫలితాలు సాధించాలంటే... శరీరాకృతి, ఆహారపుటలవాట్లు ఆధారంగా అత్యవసరమైన పోషకాలు సరైన సమయంలో తీసుకోవాలి. అందులో ఏమేమి ఉండాలంటే...

కొవ్వు తీసేసిన (స్కిమ్డ్‌) పాలు (0.3 శాతం కొవ్వు ).
ఎముకలు బలంగా ఉండటానికి - మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు...
మాంసకృత్తుల కోసం - కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు.
హోల్‌ వీట్‌, జొన్నలు, తెల్ల ఓట్స్‌, రాగిమాల్ట్.
శెనగలు, రాజ్‌మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలు...వీటి వల్ల మాంసకృత్తులు, పిండి పధార్ధాలు, 'బి' విటమిన్లు అందుతాయి.
ముదురు పసుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు తదితరాలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఇలా తగ్గాలి...
డైటింగ్ విషషయంలో పక్కన బెడితే ఒకటి రెండు వారాల్లో అధిక బరువు పూర్తిగా తగ్గిపోవడమనేది సరైన ఆలోచన కాదు. మూడు నెలల కాల వ్యవధిలో దాదాపు పన్నెండు నుంచి పదిహేను కిలోల బరువు తగ్గేలా ఉండాలి ప్రణాలిక . మూడు నెలల తర్వాత మీరెంత బరువున్నారో మీకు తెలుస్తుంది. మరో ప్రణాలిక రూపొందించుకునేవరకు మీరు అంతే బరువు ఉండాలి .

Popular Posts