ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఆరవ అధ్యాయం
శ్రీ బాదరాయణిరువాచ
అథ తర్హ్యాగతో గోష్ఠమరిష్టో వృషభాసురః
మహీమ్మహాకకుత్కాయః కమ్పయన్ఖురవిక్షతామ్
అరిష్టాసురుడు వృషభ ఆకారములో పెద్ద మదించిన కోడెలాగ తమ ముట్టెలతో భూమిని తవ్వుకుంటూ, భూమిని గీస్తూ తోక పైకి ఎత్తి, గుట్టలనూ గోడలనూ కొమ్ములతో పెకిలిస్తూ
రమ్భమాణః ఖరతరం పదా చ విలిఖన్మహీమ్
ఉద్యమ్య పుచ్ఛం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్
కిఞ్చిత్కిఞ్చిచ్ఛకృన్ముఞ్చన్మూత్రయన్స్తబ్ధలోచనః
పేడ వేస్తూ మూత్రం పోస్తూ,
యస్య నిర్హ్రాదితేనాఙ్గ నిష్ఠురేణ గవాం నృణామ్
పతన్త్యకాలతో గర్భాః స్రవన్తి స్మ భయేన వై
అది అంబారావం చేస్తే ఆ అంబారావం వలన కలిగిన భయముతో స్త్రీలు తమ గర్భాన్ని విడిచిపెడుతున్నారు.
నిర్విశన్తి ఘనా యస్య కకుద్యచలశఙ్కయా
తం తీక్ష్ణశృఙ్గముద్వీక్ష్య గోప్యో గోపాశ్చ తత్రసుః
మేఘములు పర్వతం అనుకుని దీని నూపురం మీద వచ్చి కూర్చున్నాయి. ఇలాంటి స్వరూపాన్ని చూచి గోపికలూ గోపాలురూ ఆవులూ దూడలూ పశువులూ అన్ని భయపడ్డాయి. భయపెట్టి పరుగెడుతూ కృష్ణా కాపాడమని అడిగారు
పశవో దుద్రువుర్భీతా రాజన్సన్త్యజ్య గోకులమ్
కృష్ణ కృష్ణేతి తే సర్వే గోవిన్దం శరణం యయుః
భగవానపి తద్వీక్ష్య గోకులం భయవిద్రుతమ్
మా భైష్టేతి గిరాశ్వాస్య వృషాసురముపాహ్వయత్
పరమాత్మ వారి ప్రార్థనను విని ఆ వృషభాన్ని చూచి భయపడవద్దు అని ఆ వృషభముతో "భయపడే వారిని భయపెట్టడం కాదు, నేను నీ ఎదుట నిలబడి ఉన్నాను."
గోపాలైః పశుభిర్మన్ద త్రాసితైః కిమసత్తమ
మయి శాస్తరి దుష్టానాం త్వద్విధానాం దురాత్మనామ్
నీలాంటి పరమ దుర్మార్గుల బల దర్పాన్ని అణచడానికే నేను వచ్చాను
ఇత్యాస్ఫోత్యాచ్యుతోऽరిష్టం తలశబ్దేన కోపయన్
సఖ్యురంసే భుజాభోగం ప్రసార్యావస్థితో హరిః
అని చప్పట్లు కొట్టి కోపింపచేస్తూ, మిత్రుని భుజం మీద చేయి పెట్టుకుని ఉల్లాసముగా ఉన్నాడు
సోऽప్యేవం కోపితోऽరిష్టః ఖురేణావనిముల్లిఖన్
ఉద్యత్పుచ్ఛభ్రమన్మేఘః క్రుద్ధః కృష్ణముపాద్రవత్
తన తోకను తిప్పుతూ ఉంటే ఆకాశములో ఉన్న మబ్బులన్నీ చెల్లాచెదురైపోతున్నాయి. కృష్ణుని మీదకు కొమ్ములు ముందుకు పెట్టి ఎర్రని కళ్ళతో ముందుకు వచ్చాడు
అగ్రన్యస్తవిషాణాగ్రః స్తబ్ధాసృగ్లోచనోऽచ్యుతమ్
కటాక్షిప్యాద్రవత్తూర్ణమిన్ద్రముక్తోऽశనిర్యథా
ఇంద్రుడు వదిలిపెట్టిన వజ్రాయుధములాగ భయపెడుతూ,
గృహీత్వా శృఙ్గయోస్తం వా అష్టాదశ పదాని సః
ప్రత్యపోవాహ భగవాన్గజః ప్రతిగజం యథా
మహావేగముగా వచ్చాడు. రెండు చేతులతో రెండు కొమ్ములూ పట్టుకుని ఎంత వేగముగా ముదుకు వచ్చాడో అంత వేగముగా దన్ని వెనక్కు పంపగా ఆ వృషభం తోయబడి కింద పడీ మళ్ళీ వేగముగా వచ్చింది
సోऽపవిద్ధో భగవతా పునరుత్థాయ సత్వరమ్
ఆపతత్స్విన్నసర్వాఙ్గో నిఃశ్వసన్క్రోధమూర్చ్ఛితః
తమాపతన్తం స నిగృహ్య శృఙ్గయోః పదా సమాక్రమ్య నిపాత్య భూతలే
నిష్పీడయామాస యథార్ద్రమమ్బరం కృత్వా విషాణేన జఘాన సోऽపతత్
దాన్ని కిందపడవేసి కాలితో తొక్కిపెట్టి, కొమ్ములు పట్టుకుని, తడి బట్టను పిండినట్లు ఆ వృషభాన్ని కొమ్ములతో పిండేసాడు
అసృగ్వమన్మూత్రశకృత్సముత్సృజన్క్షిపంశ్చ పాదాననవస్థితేక్షణః
జగామ కృచ్ఛ్రం నిరృతేరథ క్షయం పుష్పైః కిరన్తో హరిమీడిరే సురాః
నెత్తురు కక్కుకుంటూ మూత్ర మలాలు విడుస్తూ కాళ్ళు కొట్టుకుంటూ ప్రాణం వదిలాడు.
ఏవం కుకుద్మినం హత్వా స్తూయమానః ద్విజాతిభిః
వివేశ గోష్ఠం సబలో గోపీనాం నయనోత్సవః
ఈ అరిష్టుని పేరు వింటే భయపడే దేవతలందరూ స్వామి మీద పుష్ప వృష్టి కురిపించారు. గోపికల నేత్రాలకు పండువైన స్వామి వృషభాసురున్ని చంపి తన ఇంటికి వెళ్ళాడు
అరిష్టే నిహతే దైత్యే కృష్ణేనాద్భుతకర్మణా
కంసాయాథాహ భగవాన్నారదో దేవదర్శనః
ఇలా అరిష్టుడు సంహరించబడిన తరువాత నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చాడు. దేవతల రహస్యాన్ని బాగా తెలిసిన నారదుడు కంసునితో ఇలా అన్నాడు
యశోదాయాః సుతాం కన్యాం దేవక్యాః కృష్ణమేవ చ
రామం చ రోహిణీపుత్రం వసుదేవేన బిభ్యతా
న్యస్తౌ స్వమిత్రే నన్దే వై యాభ్యాం తే పురుషా హతాః
కంసా! ఎంత అమాయకుడవు, దేవకికి ఆడపిల్ల పుట్టినదనుకుంటున్నవా, ఆడపిల్ల పుట్టింది యశోదకు. నీ బావ పుట్టిన మగ శిశువుని తీసుకు అక్కడ పెట్టాడు. రోహిణీ పుత్రుడైన బలరాముడు కూడా వసుదేవుని కొడుకే. వారిని తన మిత్రుని వద్ద ఉంచాడు. నీవు పంపినవారందరినీ వాళ్ళే చంపారు
నిశమ్య తద్భోజపతిః కోపాత్ప్రచలితేన్ద్రియః
నిశాతమసిమాదత్త వసుదేవజిఘాంసయా
అది విన్న కంసుడు కోపం వచ్చి పళ్ళు కొరికి వసుదేవున్ని చంపేస్తా అని ఖడ్గం తీసుకు బయలుదేరాడు.
నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః
జ్ఞాత్వా లోహమయైః పాశైర్బబన్ధ సహ భార్యయా
అప్పుడు నారదుడు వారించాడు. కావలంటే వారిని కారాగరములో పడెయ్యమని చెప్పగా వారిని కంసుడు బంధించాడు
ప్రతియాతే తు దేవర్షౌ కంస ఆభాష్య కేశినమ్
ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవౌ
ఇలా నారదుడు వెళ్ళిపోగానే కేశీ అనే వాడిని పిలిచి బలరామ కృష్ణులను చంపమని చెప్పాడు
తతో ముష్టికచాణూర శలతోశలకాదికాన్
అమాత్యాన్హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్
ముష్టికాది, మల్లులందరినీ పిలిచాడు మంత్రులనూ మావటి వారినీ ఏనుగులనూ పిలిచి
భో భో నిశమ్యతామేతద్వీరచాణూరముష్టికౌ
నన్దవ్రజే కిలాసాతే సుతావానకదున్దుభేః
నందవ్రజములోనే నన్ను చంపడానికి కృష్ణ బలరాములు పెరుగుతున్నారు. అక్కడకు వెళ్ళిన వారందరినీ చంపుతున్నారు. వారిని పిలిపిస్తాను. వారు రాగానే వారిని మీరు చంపేయండి. మల్ల యుద్ధ పోటీలు పెడదాము
రామకృష్ణౌ తతో మహ్యం మృత్యుః కిల నిదర్శితః
భవద్భ్యామిహ సమ్ప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయా
మఞ్చాః క్రియన్తాం వివిధా మల్లరఙ్గపరిశ్రితాః
పౌరా జానపదాః సర్వే పశ్యన్తు స్వైరసంయుగమ్
పౌరులనూ జనపదులనూ ఆహ్వానించండి.
మహామాత్ర త్వయా భద్ర రఙ్గద్వార్యుపనీయతామ్
ద్విపః కువలయాపీడో జహి తేన మమాహితౌ
పెద్ద మావటివాడినీ కువలయాపీడం అనే ఏనుగును ఉంచారు. అది దాటి వస్తే చంపడానికి మల్ల యోధులను ఉంచాడు
ఆరభ్యతాం ధనుర్యాగశ్చతుర్దశ్యాం యథావిధి
విశసన్తు పశూన్మేధ్యాన్భూతరాజాయ మీఢుషే
ఇదే సందర్భములో ధనుర్యాగం చేసి శంకరున్న్ని సంతోషపెడదాము. ఆయనకు ఆహుతి ఇద్దాము.
ఇత్యాజ్ఞాప్యార్థతన్త్రజ్ఞ ఆహూయ యదుపుఙ్గవమ్
గృహీత్వా పాణినా పాణిం తతోऽక్రూరమువాచ హ
ఇలా కావలసిన వాటిని మంత్రులతో మిత్రులతో ఆజ్ఞ్యాపించి, అకౄరున్ని పిలిపించాడు
భో భో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృతః
నాన్యస్త్వత్తో హితతమో విద్యతే భోజవృష్ణిషు
అతని చేయి పట్టుకుని ఇలా అన్నాడు. కొద్దిగా ఆదరముతో మన స్నేహ ధర్మాన్ని పాటించి నేను చెప్పినది చేయి. భోజ వృష్ణి వంశాలలో నీవొక్కడవే హితకారివి
అతస్త్వామాశ్రితః సౌమ్య కార్యగౌరవసాధనమ్
యథేన్ద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థమధ్యగమద్విభుః
ఇంద్రుడు విష్ణువు యొక్క సహాయముతో తన పని పూర్తి చేసుకున్నట్లుగా నీ సహాయముతో నా పని పూర్తి చేసుకుంటాను. వ్రేపల్లె వెళ్ళి నందగోపులనూ గోపాలురినీ కృష్ణ బలరాములనూ తీసుకురా. వారు రాగానే ఏనుగుతో చంపిస్తాను, అది తప్పించుకుంటే మల్ల యోధులతో చంపిస్తాను, వారు చనిపోయిన తరువాత వారి తల్లి తండ్రులనూ, ముసలివాడైనప్పటికీ రాజ్యం కావాలి అంటున్న తండ్రి ఐన ఉగ్రసేనున్నీ, నాకు అడ్డుగా వస్తున్న అతని సోదరుడూ మొదలైన వారినీ చంపేస్తాను, నాకు అడ్డుగా ఉండేవారందరినీ చంపేసి భూమండలమంతా పాలిస్తాను. జరాసంధాదులు నా మిత్రులు. వారి చేత దేవతా మిత్రులను సంహరిస్తాను. నీవు నా మిత్రుడవు కాబట్టి నీకు ఇదంతా చెప్పాను. నీవు కృష్ణ బలరాములను తీసుకురా.
గచ్ఛ నన్దవ్రజం తత్ర సుతావానకదున్దుభేః
ఆసాతే తావిహానేన రథేనానయ మా చిరమ్
నిసృష్టః కిల మే మృత్యుర్దేవైర్వైకుణ్ఠసంశ్రయైః
తావానయ సమం గోపైర్నన్దాద్యైః సాభ్యుపాయనైః
ఘాతయిష్య ఇహానీతౌ కాలకల్పేన హస్తినా
యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యుతోపమైః
తయోర్నిహతయోస్తప్తాన్వసుదేవపురోగమాన్
తద్బన్ధూన్నిహనిష్యామి వృష్ణిభోజదశార్హకాన్
ఉగ్రసేనం చ పితరం స్థవిరం రాజ్యకాముకం
తద్భ్రాతరం దేవకం చ యే చాన్యే విద్విషో మమ
తతశ్చైషా మహీ మిత్ర
భవిత్రీ నష్టకణ్టకా
జరాసన్ధో మమ గురుర్ద్వివిదో దయితః సఖా
శమ్బరో నరకో బాణో మయ్యేవ కృతసౌహృదాః
తైరహం సురపక్షీయాన్హత్వా భోక్ష్యే మహీం నృపాన్
ఏతజ్జ్ఞాత్వానయ క్షిప్రం రామకృష్ణావిహార్భకౌ
ధనుర్మఖనిరీక్షార్థం ద్రష్టుం యదుపురశ్రియమ్
మొత్తం యదుకుల సంపదనూ ధనుర్యాగాన్ని చూడడానికి రమ్మని ఆహ్వానించు
శ్రీక్రూర ఉవాచ
రాజన్మనీషితం సధ్ర్యక్తవ స్వావద్యమార్జనమ్
సిద్ధ్యసిద్ధ్యోః సమం కుర్యాద్దైవం హి ఫలసాధనమ్
నీ దుఃఖ నివారణకు చక్కని సాధనం చేసుకున్నావు. అన్నీ చేసేది దేవుడు. ఐనా మన మార్గం మనం ఎన్నుకోవాలి.
మనోరథాన్కరోత్యుచ్చైర్జనో దైవహతానపి
యుజ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమి తే
అనుకున్నవి సఫలమైనా విఫలమైనా సమానముగా ఉండాలి ఎందుకంటే ఫలితం ఇచ్చేది దైవం. మానవులు ఎన్నో అనుకుంటారు. భగవంతునికి ఇష్టం లేనివాటిని కూడా అనుకుంటారు. అవి ఐతే సంతోషిస్తారు, కాకపోతే ఏదుస్తారు. నేను నీకు సేవకున్ని నీవు చేయమన్న పని చేస్తాను, నీవు చెప్పినా నేను చేసినా భగవంతుడు అనుకుంటేనే అవుతుంది.
శ్రీశుక ఉవాచ
ఏవమాదిశ్య చాక్రూరం మన్త్రిణశ్చ విషృజ్య సః
ప్రవివేశ గృహం కంసస్తథాక్రూరః స్వమాలయమ్
ఇలా అకౄరునికి చెప్పి మంత్రులను వదిలిపెట్టి, కంసుడూ అకౄరుడు తమ ఇళ్ళకు వెళ్ళారు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు