Followers

Sunday 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై మూడవ అధ్యాయం


                                                             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరన్తప
మల్లదున్దుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః

తెల్లవారిన తరువాత రామ కృష్ణులు కూడా స్నానాదులు ముగించుకుని మల్లుల యుద్ధం దుంధుభులు మోగగా అది చూద్దామని బయలుదేరారు

రఙ్గద్వారం సమాసాద్య తస్మిన్నాగమవస్థితమ్
అపశ్యత్కువలయాపీడం కృష్ణోऽమ్బష్ఠప్రచోదితమ్

ఈ రాజు గారి కోట ద్వారానికి రాగా అక్కడ పెద్ద ఏనుగు కనపడింది.
పైన మావటి వాడు ఉన్నాడు. ఆ మావటి వాడు వీరి మీదకు ఏనుగును తోలుతున్నాడు.

బద్ధ్వా పరికరం శౌరిః సముహ్య కుటిలాలకాన్
ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా

చూచాడు కృష్ణుడు. వస్త్రాన్ని గట్టిగా కట్టుకుని, నడుముకు వస్త్రం కట్టుకుని, ఉంగరాల జుట్టును సవరించుకుని, యుద్ధానికి సిద్ధమై మాట్లాడుతున్నాడు.

అమ్బష్ఠామ్బష్ఠ మార్గం నౌ దేహ్యపక్రమ మా చిరమ్
నో చేత్సకుఞ్జరం త్వాద్య నయామి యమసాదనమ్

మావటి వాడా పక్కకు జరుగు మేము లోపలకు పోవాలి. రాజు గారు పిలిచాడు. నీవు మా మాట విని దారి ఇవ్వకుంటే నిన్నూ నీ ఏనుగునూ యమలోకానికి పంపుతాము.

ఏవం నిర్భర్త్సితోऽమ్బష్ఠః కుపితః కోపితం గజమ్
చోదయామాస కృష్ణాయ కాలాన్తకయమోపమమ్

ఇలా బెదిరించగా కోపం వచ్చిన మావటి వాడు ఏనుగుకు కూడా కోపాన్ని తెప్పించాడు. ఆ ఏనుగును వారి మీదకు పంపాడు

కరీన్ద్రస్తమభిద్రుత్య కరేణ తరసాగ్రహీత్
కరాద్విగలితః సోऽముం నిహత్యాఙ్ఘ్రిష్వలీయత

ఆ ఏనుగు వచ్చి కృష్ణున్ని తన తొండముతో పట్టుకుంది. స్వామి వెంటనే జారి ఏనుగును దూరముగా తోసేసి. ఆ ఏనుగు నాలుగు కాళ్ళ మధ్యనా దాక్కున్నాడు. పరమాత్మ ఈ జగత్తు అనే ఏనుగుకు గల ధర్మార్థకామమోక్షాలనే నాలుగు కాళ్ళ మధ్య దాక్కుని ఉంటాడు. ఏ ఏనుగైనా తన కాళ్ళ మధ్య తాను చూసుకోలేదు.

సఙ్క్రుద్ధస్తమచక్షాణో ఘ్రాణదృష్టిః స కేశవమ్
పరామృశత్పుష్కరేణ స ప్రసహ్య వినిర్గతః

ఏనుగుకు కోపం వస్తోంది. కృష్ణుడు కనపడట్లేదు. నాసికాగ్ర దృష్టితో ప్రయత్నిస్తే పరమాత్మ కనపడతాడు. ఏనుగు కూడా అలాగే చేసింది. తొండముతో కృష్ణున్ని బయటకు తోలాలని చూడగా కృష్ణుడు తొండాన్ని తోసి బయటకు వచ్చాడు

పుచ్ఛే ప్రగృహ్యాతిబలం ధనుషః పఞ్చవింశతిమ్
విచకర్ష యథా నాగం సుపర్ణ ఇవ లీలయా

గరుత్మంతుడు సర్పమును లాగినట్లు. కృష్ణ పరమాత్మ ఏనుగు తోకను పట్టుకుని వెనక్కు లాగాడు. ఇరవై అడుగుల దూరం తీసుకు వెళ్ళాడు.

స పర్యావర్తమానేన సవ్యదక్షిణతోऽచ్యుతః
బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః

అలా లాగుతూ ఉంటే ఇటూ అటూ తిరుగుతోంది. ఏడమా కుడీ తిరుగుతూ ఉంది. దూడతో పిల్లవాడిలా ఇలా చుట్టూ చుట్టూ తిప్పి, ఇలా కాసేపు కాళ్ళ సందు మధ్యనా కాసేపు తోకతో ఆడి అది బాగా అలసిపోయాక ఆ ఏనుగుకు ఎదురుగా వచ్చాడు

తతోऽభిమఖమభ్యేత్య పాణినాహత్య వారణమ్
ప్రాద్రవన్పాతయామాస స్పృశ్యమానః పదే పదే

చేత్తో ఆ ఏనుగును గట్టిగా కొట్టాడు. అది పారిపోతుంటే పడేస్తున్నాడు. లేవక ముందే తోసేస్తున్నాడు. ఇలా పదే పదే పడేస్తూ లేస్తూ ఉండగా

స ధావన్కృదయా భూమౌ పతిత్వా సహసోత్థితః
తమ్మత్వా పతితం క్రుద్ధో దన్తాభ్యాం సోऽహనత్క్షితిమ్

ఈ ఆటలో ఏనుగుకు కూడా ఉత్సాహం ఇవ్వాలని స్వామి కూడ ఒక సారి పడిపోయింది. అపుడు స్వామిని పొడుద్దామని దంతాలతో ముందుకు వచ్చింది.

స్వవిక్రమే ప్రతిహతే కుఞ్జరేన్ద్రోऽత్యమర్షితః
చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవద్రుషా

దంతాలతో ఏనుగు భూమిని గుద్దింది.మళ్ళీ తన పరాక్రమం అంతా వ్యర్థమవుతోంది. ముందుకీ వెనక్కూ వెళుతోంది. మావటి వాడు పొడుస్తూ ఉన్నాడు.

తమాపతన్తమాసాద్య భగవాన్మధుసూదనః
నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే

కృష్ణుడు తొండం పట్టి కిందకు పడేసాడు. కింద పడగానే దాని దంతం ఊడ పెరికి దాన్నే చంపాడు. మావటి వాడు రాగా ఆ దంతముతోనే మావటి వాన్ని కూడా సంహరించాడు

పతితస్య పదాక్రమ్య మృగేన్ద్ర ఇవ లీలయా
దన్తముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః

మృతకం ద్విపముత్సృజ్య దన్తపాణిః సమావిశత్
అంసన్యస్తవిషాణోऽసృఙ్ మదబిన్దుభిరఙ్కితః

ఎపుడైతే ఏనుగు చనిపోయిందో ఆ ఏనుగు దంతములను భుజముల మీద వేసుకుని, ఆ ఏనుగుల దంతములకు అంటిన మట్టి భుజముల మీద ఉండగా సభకు వచ్చారు

విరూఢస్వేదకణికా వదనామ్బురుహో బభౌ

కాస్త ముఖం మీద చెమట బిందువులు ఉండి

వృతౌ గోపైః కతిపయైర్బలదేవజనార్దనౌ
రఙ్గం వివిశతూ రాజన్గజదన్తవరాయుధౌ

గోప బాలకులతో చుట్టబడి ఉన్నారు. మల్లులకు వజ్రాయుధములా ఉన్నారు.

మల్లానామశనిర్నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్
గోపానాం స్వజనోऽసతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రోః శిశుః
మృత్యుర్భోజపతేర్విరాడవిదుషాం తత్త్వం పరం యోగినాం
వృష్ణీనాం పరదేవతేతి విదితో రఙ్గం గతః సాగ్రజః

మనుజులకు ఉత్తమ మనుషులులా, స్త్రీలకు రూపు దాల్చిన మన్మధుడిలా, గోపాలురకు తనవారిలా, దుష్ట రాజులకు శాసకుడిలా, తన తల్లి తండ్రులకు పుత్రుడిలా, కంసునికి మృత్యువులా, తెలియని వారికి విరాట్ పురుషునిలా, యోగులకు పరతత్వం వృష్ణి వంశానికి పర దేవతలా, ఇలా ఎవరికి వారు ఇలా భావిస్తున్నారు.
మనం ఏమి అనుకుంటే మనసులో మన ఎదురుగా అదే కనపడుతుంది. అలాగే కనపడుతుంది.

హతం కువలయాపీడం దృష్ట్వా తావపి దుర్జయౌ
కంసో మనస్యపి తదా భృశముద్వివిజే నృప

కువలయాపీడాన్ని చంపి వచ్చాడని తెలుసుకున్న చాణూర ముష్టికులు కూడా మనసులో ఒక్కసారి భయపడి ఉద్వేగం పొందారు. కంసుడు కూడా బాగా (భృశం) ఉద్వేగాన్ని పొందాడు

తౌ రేజతూ రఙ్గగతౌ మహాభుజౌ విచిత్రవేషాభరణస్రగమ్బరౌ
యథా నటావుత్తమవేషధారిణౌ మనః క్షిపన్తౌ ప్రభయా నిరీక్షతామ్

ఆ రంగములో వారందరూ శోభిస్తున్నారు. చందన పూలమాలలతో ఆభరణాలతో శోభిస్తునారు. ఉత్తమమైన నటులులాగ ఉన్నారు. చూసేవారి కనులనూ మనసునూ తన దివ్యమైన తేజస్సుతో కప్పుతూ ఉన్నారు

నిరీక్ష్య తావుత్తమపూరుషౌ జనా మఞ్చస్థితా నాగరరాష్ట్రకా నృప
ప్రహర్షవేగోత్కలితేక్షణాననాః పపుర్న తృప్తా నయనైస్తదాననమ్

అలా వచ్చిన వారిద్దరినీ సభలో ఉన్నవారు అందరూ చూసారు. నగర జనులూ రాజ్య జనులూ చూసి సంతోష సంరంభముతో కనులు విప్పారాయి. మనసు వికసించింది. వారి ముఖాన్ని కనులతో జుర్రుకున్నారు. ఐనా వారి తనివి తీరలేదు

పిబన్త ఇవ చక్షుర్భ్యాం లిహన్త ఇవ జిహ్వయా
జిఘ్రన్త ఇవ నాసాభ్యాం శ్లిష్యన్త ఇవ బాహుభిః

నాలుకతో ఆస్వాదించారు. కన్నూల్తో తాగపడుతున్నట్లుగా నాలుకతో నాకి వేస్తున్నట్లుగా ముక్కులతో వాసన చూస్తున్నట్లుగా చేతులతో ఆలింగనం చేస్తున్నట్లుగా

ఊచుః పరస్పరం తే వై యథాదృష్టం యథాశ్రుతమ్
తద్రూపగుణమాధుర్య ప్రాగల్భ్యస్మారితా ఇవ

వారందరూ ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. ఇది వరకు మేమెలా విన్నామో అలాగే ఉన్నాడు, మేము ఇది వరకు నగరములో ఎలా చూసమో అలాగే ఉన్నారు. అతని రూపం గుణం మాధుర్యమూ ఇవాన్ని గుర్తుకు వచ్చి

ఏతౌ భగవతః సాక్షాద్ధరేర్నారాయణస్య హి
అవతీర్ణావిహాంశేన వసుదేవస్య వేశ్మని

కృష్ణావతారములో కృష్ణుడు పరమాత్మ అని అందరికీ తెలుసు. ఆయనను నారాయణుడిగానే తెలుసు.

ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులమ్
కాలమేతం వసన్గూఢో వవృధే నన్దవేశ్మని

ఈ మహానుభావుడు దేవకికి పుట్టాడట వ్రేపల్లెకు తీసుకుపోగా నంద గోపుని ఇంటిలో పెరిగాడట,

పూతనానేన నీతాన్తం చక్రవాతశ్చ దానవః
అర్జునౌ గుహ్యకః కేశీ ధేనుకోऽన్యే చ తద్విధాః

పాలు ఇచ్చి చంపుదామనుకున్న పూతనను పాలు తాగి చంపాడటం, తృణావర్తుని శకటాసురున్నీ సంహరించాడట

గావః సపాలా ఏతేన దావాగ్నేః పరిమోచితాః
కాలియో దమితః సర్ప ఇన్ద్రశ్చ విమదః కృతః

కుబేర కుమారులైన రెండు వృక్షాలనూ కొల్లగటాడు, ధేనుకాసురున్ని సంహరించాడు. ఎంతో మంది గోవులనూ గోపాలకులను దావాగ్ని నుండి కాపాడాడు, కాలీయుని దర్పాన్ని హరించాడు, ఇంద్రుని గర్వాన్ని హరించడానికి గోవర్దన పర్వతన్ని ఏడు రోజులు ఒకే వేలితో ఎత్తుకుని

సప్తాహమేకహస్తేన ధృతోऽద్రిప్రవరోऽమునా
వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులమ్

రాళ్ళ వానతో మామూలు వానతో బాధించబడిన గోకులాన్ని ఒక చేత్తో ఏడు రోజులు గోవర్థనాన్ని ఎత్తి కాపాడాడు.

గోప్యోऽస్య నిత్యముదిత హసితప్రేక్షణం ముఖమ్
పశ్యన్త్యో వివిధాంస్తాపాంస్తరన్తి స్మాశ్రమం ముదా

ఎల్లప్పుడు చిరునవ్వు తొణికిసలాడే ఈయన ముఖాన్ని గోపికలు రోజూ చూస్తూ అన్ని రకాల తాపాన్ని తొలగించుకున్నారు.

వదన్త్యనేన వంశోऽయం యదోః సుబహువిశ్రుతః
శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః

యదువంశం ఇతని చేతనే ఉద్దరించబడుతుంది సంపదా కీర్తి ఇతని చేతనే లభిస్తాయి

అయం చాస్యాగ్రజః శ్రీమాన్రామః కమలలోచనః
ప్రలమ్బో నిహతో యేన వత్సకో యే బకాదయః

మహా శోభ కలవాడైన బలరాముడు ఇతని అన్నగారు. ఈయన కూడా ప్రలంభాసురున్నీ వత్సాసురున్నీ సంహరించాడు అని

జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ
కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్

జనం ఇలా పెద్దగా చర్చించుకుంటున్నారు. అందరూ ఉత్సాహముగా ఉండగా మంగళ వాద్యాలు మోగించారు. బలరామ కృష్ణులను చూచి చాణూరుడు ఇలా అంటున్నాడు.

హే నన్దసూనో హే రామ భవన్తౌ వీరసమ్మతౌ
నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాహూతౌ దిదృక్షుణా

కృష్ణా రామా మిమ్ములను మేము వీరులుగా గుర్తించాము. ద్వంద్వ యుద్ధములో మీరు నేర్పరులని గుర్తించిన్ రాజు ఇక్కడకు పిలిచాడు

ప్రియం రాజ్ఞః ప్రకుర్వత్యః శ్రేయో విన్దన్తి వై ప్రజాః
మనసా కర్మణా వాచా విపరీతమతోऽన్యథా

ఆ రాజ్యములో ప్రజలమైన మనకు రాజుకు ప్రియం చేకూర్చడం ధర్మం. వారే శ్రేయస్సును పొందుతారు. రాజుగారికి ప్రియాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి.

నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథాస్ఫుటమ్
వనేషు మల్లయుద్ధేన క్రీడన్తశ్చారయన్తి గాః

మీ గోపాలకులూ అందరూ ఆవులను బాగా మేపుతు అక్కడ వనములో మల్ల యుద్ధం బాగా చేసింటలు విన్నాము ,

తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామ హే
భూతాని నః ప్రసీదన్తి సర్వభూతమయో నృపః

మీరు మల్ల యుద్ధం చేసి రాజుగారికి మేలు కలిగించాలి. రాజుకు మేలు కలిగిస్తే సకల ప్రాణులూ ప్రసన్నముగా ఉంటాయి. రాజంటే సర్వ భూత స్వరూపుడు

తన్నిశమ్యాబ్రవీత్కృష్ణో దేశకాలోచితం వచః
నియుద్ధమాత్మనోऽభీష్టం మన్యమానోऽభినన్ద్య చ

ఇదంతా విని కృష్ణుడు దేశ కాలోచితమైన మాటలు ఇలా మాట్లాడాడు. ఈ యుద్ధం మాకు కూడా ఇష్టమే అని మనసులో అభినందించి ఇలా అన్నాడు

ప్రజా భోజపతేరస్య వయం చాపి వనేచరాః
కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః

మీరు ఆయన ప్రజలు. మేము అడవిలో ఉండే వారము. మాలాంటి వన చరులతో కూడా ప్రీతి పొందాలని అనుకున్నాడంటే రాజు గారు ఎంతో దయ కలవారు

బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితమ్
భవేన్నియుద్ధం మాధర్మః స్పృశేన్మల్లసభాసదః

మేము చిన్న పిల్లలం , మేము మాలాంటి వారితో ఆడుకొంటాము. మల్లులారా అధర్మం మనను స్పృశించకూడదు. సమాన బలం గలవారితో మల్ల యుద్ధం చేస్తాము.

చాణూర ఉవాచ
న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః
లీలయేభో హతో యేన సహస్రద్విపసత్త్వభృత్

నీవు పిల్లవాడవా. నీవు బాలుడవూ కిశోరుడవూ కావు. బలరాముడూ నీవూ కూడా బలవంతులైన వారిలో శ్రేష్టులు. పది వేల ఏనుగుల బలం ఉన్న కువలయాపీడాన్ని విలాసముగా చంపారు మీరు. (ఇద్దరూ ఒప్పుకుంటేనే మల్ల యుద్ధం చేయాలి)

తస్మాద్భవద్భ్యాం బలిభిర్యోద్ధవ్యం నానయోऽత్ర వై
మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః

మీరు కూడా బలవంతులు. మీతో యుద్ధం చేయడం అన్యాయం కాదు. నీవు నాతో యుద్ధం చేయి. బలరామునితో ముష్టికుడు యుద్ధం చేస్తాడు.
  
                                                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts