శ్రీశుక ఉవాచ
ఏవం భగవతాదిష్టో దుర్వాసాశ్చక్రతాపితః
అమ్బరీషముపావృత్య తత్పాదౌ దుఃఖితోऽగ్రహీత్
బాధతో అంబరీషుని పాదాలను పట్టుకున్నాడు.
తస్య సోద్యమమావీక్ష్య పాదస్పర్శవిలజ్జితః
అస్తావీత్తద్ధరేరస్త్రం కృపయా పీడితో భృశమ్
తన కాళ్ళు పట్టుకోగానే సిగ్గుపడి అంబరీషుడు వెనక్కు జరిగాడు. దయ తలచి ఆ చక్రాన్ని స్తోత్రం చేసాడు.
ఈ స్తోత్రాలు మహా ఆపద నుండి మనను రక్షిస్తాయి. ఇది చదువుకుంటే మనకు ఏ ఆపదా రాదు
అమ్బరీష ఉవాచ
త్వమగ్నిర్భగవాన్సూర్యస్త్వం సోమో జ్యోతిషాం పతిః
త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేన్ద్రియాణి చ
నీవే అగ్నివి నీవే సూర్యుడవూ చంద్రుడవు నీరూ భూమీ వాయువూ అన్ని ఇంద్రియములూ. సుదర్శనమా
సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుతప్రియ
సర్వాస్త్రఘాతిన్విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే
సకల అస్త్రములను సంహరించే మహానుభావుడా ఈ బ్రాహ్మణోత్తమునికి శుభమును కలిగించు
త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞోऽఖిలయజ్ఞభుక్
త్వం లోకపాలః సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరమ్
ధర్మమూ సత్యమూ మోక్షమూ యజ్ఞ్యమూ నీవే, సకల యజ్ఞ్య ఫలములనూ భుజించేవాడవు నీవు
నమః సునాభాఖిలధర్మసేతవే హ్యధర్మశీలాసురధూమకేతవే
త్రైలోక్యగోపాయ విశుద్ధవర్చసే మనోజవాయాద్భుతకర్మణే గృణే
నీవే లోకపాలకుడవు, సర్వాత్మవూ ఉత్తం తేజస్సువు. సునాభా, అన్ని ధర్మాలకూ మర్యాదగా ఉండే నీకు నమస్కారం. అధర్మం స్వభావముగా ఉండే రాక్షసులకు నీవు ధూమకేతువు (తోకచుక్కవు)
త్వత్తేజసా ధర్మమయేన సంహృతం తమః ప్రకాశశ్చ దృశో మహాత్మనామ్
దురత్యయస్తే మహిమా గిరాం పతే త్వద్రూపమేతత్సదసత్పరావరమ్
మూడు లోకాలనూ కాపాడేవాడవు. సత్వరజస్తమో గుణ దోష లేని తేజోవంతుడవు. మనో వేగం కలవాడవు అద్భుతమైన కృత్యాలను చేసేవాడవు. ధర్మబద్ధమైన నీతేజస్సుతో చీకటంతా తొలగి వెలుగు ఆవిర్భవించింది. నీ మహిమ ఎవరూ దాటలేరు. అది వాక్కుకు కూడా అందనిది. అదే సత్, అసత్. అదే పరావరం.
యదా విసృష్టస్త్వమనఞ్జనేన వై బలం ప్రవిష్టోऽజిత దైత్యదానవమ్
బాహూదరోర్వఙ్ఘ్రిశిరోధరాణి వృశ్చన్నజస్రం ప్రధనే విరాజసే
నీవు పరమాత్మ చేత ప్రయోగించబడి దైత్య దానవ సైన్యాన్ని ప్రవేశిస్తే శత్రువుల బాహు ఉదర అంఘ్రులను ఖండించుకుంటూ నీ దివ్య ప్రభావాన్ని ప్రకటింపచేస్తావు
స త్వం జగత్త్రాణ ఖలప్రహాణయే నిరూపితః సర్వసహో గదాభృతా
విప్రస్య చాస్మత్కులదైవహేతవే విధేహి భద్రం తదనుగ్రహో హి నః
పరమాత్మ నిన్ను సకల జగత్తూ కాపాడటానికీ దుష్టులను సంహరించుటకు స్వామి నిన్ను ఏర్పరచాడు. దేన్నైనా సహించగలవు ఎలాంటిదాన్ని ఐనా ఎదిరించ గలవు. మా కులమును నిరంతరం కాపాడే బ్రాహ్మణోత్తములకు శుభం కలిగించు. అదే నేను కోరుతున్నాను,నీవు మా మీద చూపే అనుగ్రహం ఇదే.
యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః
కులం నో విప్రదైవం చేద్ద్విజో భవతు విజ్వరః
నేను ఏమైనా దానం యాగం చేసి ఉంటే ధర్మాన్ని ఆచరించి ఉంటే, మా కులము బ్రాహ్మణులను పూజించుటే చేసి ఉన్నట్లైతే ఈ బ్రాహ్మణుడకు శుభం కలుగుగాక
యది నో భగవాన్ప్రీత ఏకః సర్వగుణాశ్రయః
సర్వభూతాత్మభావేన ద్విజో భవతు విజ్వరః
పరమాత్మ సకల గుణాశ్రయుడు, ప్రతీ ప్రాణికీ ఆత్మగా ఉండే పరమాత్మ మా విషయములో ప్రీతి ఉంటే ఈ బ్రాహ్మణోత్తమునికి ఆపద లేకుండా ఉండు గాక.
శ్రీశుక ఉవాచ
ఇతి సంస్తువతో రాజ్ఞో విష్ణుచక్రం సుదర్శనమ్
అశామ్యత్సర్వతో విప్రం ప్రదహద్రాజయాచ్ఞయా
ఇలా రాజు యాచిస్తే అప్పటిదాకా బ్రాహ్మణోత్తమున్ని తపింపచేస్తున్న చక్రం స్తుతించబడి శాంతించింది
స ముక్తోऽస్త్రాగ్నితాపేన దుర్వాసాః స్వస్తిమాంస్తతః
ప్రశశంస తముర్వీశం యుఞ్జానః పరమాశిషః
అస్త్రాగ్ని తాపముతో దహించబడిన దుర్వాసుడు చల్లబడి అతన్ని ఆశీర్వదిస్తూ అతనీ శ్లాఘించాడు
దుర్వాసా ఉవాచ
అహో అనన్తదాసానాం మహత్త్వం దృష్టమద్య మే
కృతాగసోऽపి యద్రాజన్మఙ్గలాని సమీహసే
పరమాత్మ భక్తుల యొక్క మహిమ ఇప్పుడు నాకు అర్థమయ్యింది. మహారాజా తప్పు చేసిన వారికి కూడా శుభం కలగాలని కోరుకున్నావు. ఇలా కోరగలిగేది పరమాత్మ భక్తులు మాత్రమే
దుష్కరః కో ను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనామ్
యైః సఙ్గృహీతో భగవాన్సాత్వతామృషభో హరిః
సజ్జనులకు చేయరానిదంటూ లేదు. మహాత్ములకు విడువరానిదంటూ లేదు. సాక్షాత్ పరమాత్మనే పట్టుకున్నవారికి చేయలేనిదేముంది. వారు పరమాత్మనే గుప్పిట్లో పెట్టుకున్నారో
యన్నామశ్రుతిమాత్రేణ పుమాన్భవతి నిర్మలః
తస్య తీర్థపదః కిం వా దాసానామవశిష్యతే
పరమాత్మ నామాన్ని వినగానే పాపరహితుడవుతాడు. అలాంటి పరమ పవిత్ర పాదములు కల పరమాత్మ శిష్యులకు లేనిదేముంటుంది
రాజన్ననుగృహీతోऽహం త్వయాతికరుణాత్మనా
మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణా యన్మేऽభిరక్షితాః
నీవు అతి దయతో నన్ను కరుణించావు.నేను చేసిన తప్పును చూడకుండా నా ప్రాణాలను కాపాడావు.
రాజా తమకృతాహారః ప్రత్యాగమనకాఙ్క్షయా
చరణావుపసఙ్గృహ్య ప్రసాద్య సమభోజయత్
ఇంత సేపూ అంబరీషుడు అక్కడే నిలబడ్డాడు. బ్రాహ్మణుడు భోజనం చేయకుండా ఆయన చేయడు. ఆయన కాళ్ళుపట్టుకుని భోజనం చేయమని ప్రార్థించాడు. ఆయన భోజనం చేసాక ఈయన కూడా భోజనం చేసాడు
సోऽశిత్వాదృతమానీతమాతిథ్యం సార్వకామికమ్
తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరమ్
ప్రపంచములో ఉన్న ఎలాంటి వాడైనా ఇలాంటి ఆథిత్యం కావాలని కోరుకునే లాంటి ఆథిత్యాన్ని పొంది, తృప్తి పొందాడు. అలా చేసాక ఇంకేమి చేయాలి అని అడిగాడు. దుర్వాసుడు నీవు భోజనం చేయమని ఆజ్ఞ్య ఇచ్చాడు
ప్రీతోऽస్మ్యనుగృహీతోऽస్మి తవ భాగవతస్య వై
దర్శనస్పర్శనాలాపైరాతిథ్యేనాత్మమేధసా
నేను సర్వాత్మనా ప్రీతి పొంది నీ చేత అనుగ్రహించబడ్డాను, నీవు పరమభాగవతోత్తముడివి. మహాత్ములను దర్శించినా స్పృశించినా ధ్యానించినా నమస్కరించినా స్మరించినా పాపాలు పోతాయి. అందుకే పెద్దాలు కనపడితే ఏదైనా మాట్లాడమని చెబుతారు.
కర్మావదాతమేతత్తే గాయన్తి స్వఃస్త్రియో ముహుః
కీర్తిం పరమపుణ్యాం చ కీర్తయిష్యతి భూరియమ్
నీ ఈ వ్రత్రం పరిశుద్ధి పొందినది. నీవు చేసిన ఈ కర్మను స్వర్గలోకములో స్త్రీలు కూడా గానం చేస్తారు. ఈ భూమి కూడా నీ పరమ పావనమైన కీర్తిని గానం చేస్తుంది
శ్రీశుక ఉవాచ
ఏవం సఙ్కీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః
యయౌ విహాయసామన్త్ర్య బ్రహ్మలోకమహైతుకమ్
ఇలా వరమిచ్చి ఆయన బ్రహ్మ లోకానికి వెళ్ళాడు
సంవత్సరోऽత్యగాత్తావద్యావతా నాగతో గతః
మునిస్తద్దర్శనాకాఙ్క్షో రాజాబ్భక్షో బభూవ హ
చక్రం వెంటబడితే కాపాడుకోవడానికి వెళ్ళిన దుర్వాసుడు సంవత్సరానికి వచ్చాడు. అలాంటి మహానుభావున్ని చూడాలనే కోరికతే కేవలం జలం మాత్రమే తీసుకుంటూ ఎదురుచూసాడు
గతేऽథ దుర్వాససి సోऽమ్బరీషో ద్విజోపయోగాతిపవిత్రమాహరత్
ఋషేర్విమోక్షం వ్యసనం చ వీక్ష్య మేనే స్వవీర్యం చ పరానుభావమ్
ఇలా దుర్వాస మహర్షి వెళ్ళిన తరువాత అంబరీషుడు బ్రాహ్మణులు ఉపయోగించడం వలన పవిత్రమైన ప్రసాదాన్ని, ఋషి శాపం కూడా తొలగిపోవడముతో సంతోషించి పరమాత్మ ప్రభావం ఇంతటిదా అని గ్రహించాడు.
ఏవం విధానేకగుణః స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే
క్రియాకలాపైః సమువాహ భక్తిం యయావిరిఞ్చ్యాన్నిరయాంశ్చకార
ఈ రీతిలో అంబరీషుడు చాలా గుణములు కలవాడు. పరమాత్మ యందూ పరబ్రహ్మ యందూ వాసుదేవుని యందూ తానాచరించిన అన్ని కర్మలనూ అర్పించాడు. ఇతని చర్యతో బ్రహ్మ వరకూ తనకంటే తక్కువ చేసాడు. మిగతా లోకాలను నరకములను చేసాడు.
శ్రీశుక ఉవాచ
అథామ్బరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః
వనం వివేశాత్మని వాసుదేవే మనో దధద్ధ్వస్తగుణప్రవాహః
కొంతకాలం తరువాత పుత్రులకు రాజ్యాన్నిచ్చాడు. ఆ పుత్రులు కూడా తనవంటి స్వభావం కలవారు. ధీరుడై ఇతను రాజ్యాన్ని వదిలిపెట్టాడు. పరమాత్మను మనసులో దాచుకుని అరణ్యానికి ప్రవేశించి తనలో ఉన్న సాత్విక రాజసిక తామసిక గుణాలను అరికట్టాడు
ఇత్యేతత్పుణ్యమాఖ్యానమమ్బరీషస్య భూపతే
సఙ్కీర్తయన్ననుధ్యాయన్భక్తో భగవతో భవేత్
ఇది అంబరీష ఆఖ్యానం, దీన్ని చదివినా గానం చేసినా భక్తుడూ భాగవతుడూ అవుతాడు
అమ్బరీషస్య చరితం యే శృణ్వన్తి మహాత్మనః
ముక్తిం ప్రయాన్తి తే సర్వే భక్త్యా విష్ణోః ప్రసాదతః