స్వామి యొక్క ఎనిమిది అవతారాలు ఈ స్కంధములో చెప్పబడినవి
కూర్మ, ధన్వంతరీ, మోహినీ, వామన, మత్స్య, హరి (గజేంద్ర మోక్షణం) పర్వతములోనూ వాసుకిలోనూ కూడా స్వామి ప్రవేశించడం వలన, అష్టమ స్కంధములో ఎనిమిది అవతారాలు ఉన్నాయి
శ్రీరాజోవాచ
భగవన్ఛ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణః
అవతారకథామాద్యాం మాయామత్స్యవిడమ్బనమ్
యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితమ్
తమఃప్రకృతిదుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వరః
లోకమంతా జుగుప్స కలిగించే అజ్ఞ్యానానికి పరాకాష్ఠ ఐన, సహనం లేనిదైన మత్స్యావతారం స్వామి ఎందుకు ధరించాడు
ఏతన్నో భగవన్సర్వం యథావద్వక్తుమర్హసి
ఉత్తమశ్లోకచరితం సర్వలోకసుఖావహమ్
పరమాత్మ చరిత్ర విన్నవారికీ చెప్పినవారికే కాక లోకమంతటికీ సుఖాన్ని కలిగిస్తుంది
శ్రీసూత ఉవాచ
ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్బాదరాయణిః
ఉవాచ చరితం విష్ణోర్మత్స్యరూపేణ యత్కృతమ్
మత్స్యావతారముగ స్వామి ఏమి చేసాడొ పరీక్షిత్తుకు శుకుడు వివరించాడు
శ్రీశుక ఉవాచ
గోవిప్రసురసాధూనాం ఛన్దసామపి చేశ్వరః
రక్షామిచ్ఛంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవ హి
పరమాత్మ అన్ని అవతారాలు, గో విప్ర సాధు వేదాలను దేవతలనూ ధర్మాన్ని అర్థాన్ని కాపాడటానికే తను శరీరం ధరిస్తాడు
ఉచ్చావచేషు భూతేషు చరన్వాయురివేశ్వరః
నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణైః
నీకూ నాకూ జుగుపిస్తం కావొచ్చేమో గానీ, పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. మత్స్యములో కూడా ఆయనే ఉన్నాడు. ఎక్కువా తక్కువా ఆయనకు లేవు. పరమాత్మ దేహం కానిదంటూ లేదు. వాయువులాగ ఆయన అందరిలోనూ ఉన్నాడు. అవమానం గౌరవం లాంటివి ఆయనకు ఉండవు
ఆసీదతీతకల్పాన్తే బ్రాహ్మో నైమిత్తికో లయః
సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప
నైమిత్తిక ప్రళయం (బ్రహ్మకు ఒక పూట) యందు భూ భువ సువ లోకాలు సముద్రముచే ముంచబడతాయి
కాలేనాగతనిద్రస్య ధాతుః శిశయిషోర్బలీ
ముఖతో నిఃసృతాన్వేదాన్హయగ్రీవోऽన్తికేऽహరత్
కాలము వలన నిద్ర పోవాలి అనుకున్న స్వామికి నిద్రపోతూ ఉన్న బ్రహ్మ ముఖము నుండి వెలువడుతున్న వేదాలను హయగ్రీవుడనే రాక్షసుడపహరించాడు
జ్ఞాత్వా తద్దానవేన్ద్రస్య హయగ్రీవస్య చేష్టితమ్
దధార శఫరీరూపం భగవాన్హరిరీశ్వరః
అతని వధించి వేదాలను తీసుకు రావడానికి మత్స్య రూపం ధరించాడు
తత్ర రాజఋషిః కశ్చిన్నామ్నా సత్యవ్రతో మహాన్
నారాయణపరోऽతపత్తపః స సలిలాశనః
అదే సమయములో సత్యవ్రతుడు పరమాత్మకు పరమ భక్తుడు నీరు మాత్రమే భుజిస్తూ ఉన్నాడు. అతనే తరువాతి కల్పములో సూర్యునికి
యోऽసావస్మిన్మహాకల్పే తనయః స వివస్వతః
శ్రాద్ధదేవ ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః
పుత్రుడై శ్రాద్ధదేవుడనే పేరుతో మనువుగా తరువాత అవతరించబోతాడు
ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్
తస్యాఞ్జల్యుదకే కాచిచ్ఛఫర్యేకాభ్యపద్యత
అలా అనుకుని పరమాత్మ, ఈ సత్య వ్రతుడు నదీ తీరములో జలాన్ని తర్పణం చేయాలనుకుంటున్నపుడు ఆయన దోసిట్లోకి తీసుకున్న నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనపడింది
సత్యవ్రతోऽఞ్జలిగతాం సహ తోయేన భారత
ఉత్ససర్జ నదీతోయే శఫరీం ద్రవిడేశ్వరః
తమాహ సాతికరుణం మహాకారుణికం నృపమ్
యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మాం దీనవత్సల
కథం విసృజసే రాజన్భీతామస్మిన్సరిజ్జలే
నేను చిన్న చేపను.నన్ను సముద్రములో పెద్ద చేపలకు ఆహారముగా వేస్తావా అని అడిగితే
తమాత్మనోऽనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరమ్
అజానన్రక్షణార్థాయ శఫర్యాః స మనో దధే
ఆ చేపను కాపాడదామని ఆ చేపను తీసుకుని కలశములో ఉంచాడు. ఋఆత్రి అవుతుండగానే పెరిగిపోయింది
తస్యా దీనతరం వాక్యమాశ్రుత్య స మహీపతిః
కలశాప్సు నిధాయైనాం దయాలుర్నిన్య ఆశ్రమమ్
సా తు తత్రైకరాత్రేణ వర్ధమానా కమణ్డలౌ
అలబ్ధ్వాత్మావకాశం వా ఇదమాహ మహీపతిమ్
నాహం కమణ్డలావస్మిన్కృచ్ఛ్రం వస్తుమిహోత్సహే
కల్పయౌకః సువిపులం యత్రాహం నివసే సుఖమ్
నేను ఈ కమండలములో ఇమడలేకపోతున్నాను, నాకు పెద్ద ఆధారము కల్పించు అని అడిగితే కొంచెం పెద్ద పాత్రలో వేసాడు
స ఏనాం తత ఆదాయ న్యధాదౌదఞ్చనోదకే
తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయమవర్ధత
ఒక ముహూర్త కాలములోనే మూడు చేతులంత అయ్యింది. నాకిది కూడా సరిపోవడం లేదు అని చెప్పగా
న మ ఏతదలం రాజన్సుఖం వస్తుముదఞ్చనమ్
పృథు దేహి పదం మహ్యం యత్త్వాహం శరణం గతా
ఒక సరోవరములో పడేసాడు.
తత ఆదాయ సా రాజ్ఞా క్షిప్తా రాజన్సరోవరే
తదావృత్యాత్మనా సోऽయం మహామీనోऽన్వవర్ధత
అది కూడా సరిపోక పోతే, ఇంక పెద్ద మడుగులో వేస్తూ వెళ్ళాడు.నదులైపోయాక సముద్రములో వేసాడు. నన్ను సముద్రములో వెయ్యవద్దు అని అడిగింది.
నైతన్మే స్వస్తయే రాజన్నుదకం సలిలౌకసః
నిధేహి రక్షాయోగేన హ్రదే మామవిదాసిని
ఇత్యుక్తః సోऽనయన్మత్స్యం తత్ర తత్రావిదాసిని
జలాశయేऽసమ్మితం తం సముద్రే ప్రాక్షిపజ్ఝషమ్
క్షిప్యమాణస్తమాహేదమిహ మాం మకరాదయః
అదన్త్యతిబలా వీర మాం నేహోత్స్రష్టుమర్హసి
ఏవం విమోహితస్తేన వదతా వల్గుభారతీమ్
తమాహ కో భవానస్మాన్మత్స్యరూపేణ మోహయన్
నీవెవరు,ఇలాంటి చేప ఉంటుందని నేనెపుడూ వినలేదు చూడలేదు.
నైవం వీర్యో జలచరో దృష్టోऽస్మాభిః శ్రుతోऽపి వా
యో భవాన్యోజనశతమహ్నాభివ్యానశే సరః
రెండు మూడు రోజులలోనే నీవు నూరు యోజనాలు పెరిగావు. ఇలాంటి చేప ఎక్కడైనా ఉంటుందా
నూనం త్వం భగవాన్సాక్షాద్ధరిర్నారాయణోऽవ్యయః
అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్
ఆలోచిస్తే సకల లోకముల ప్రాణులను కాపాడటానికి పరమాత్మ ఐన నీవే ఈ రూపం తీసుకున్నట్లు ఉంది
నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో
సృష్టి సంహారాల నాయకుడివి, నీ భక్తులకు నీవే ఆత్మ గతివి, నీకు నమస్కారం
సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః
జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్
నీవెత్తే అన్ని అవతారాలు సకల భూతములకు మేలు చేసేవే. నీ ఈ రూపం యొక్క అంతర్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను
న తేऽరవిన్దాక్ష పదోపసర్పణం మృషా భవేత్సర్వసుహృత్ప్రియాత్మనః
యథేతరేషాం పృథగాత్మనాం సతామదీదృశో యద్వపురద్భుతం హి నః
సకల లోకములకు ప్రియుడవూ మిత్రుడవూ ఐన నీ పాదాలను సేవించుట విఫలం కాదు. అనే ఆకారాల కంటే నీవు ఈ మత్స్య రూపములో ఉన్నావు.నీ ఈ రూపనికి వెనక గల కారణం ఏమిటి
శ్రీశుక ఉవాచ
ఇతి బ్రువాణం నృపతిం జగత్పతిః సత్యవ్రతం మత్స్యవపుర్యుగక్షయే
విహర్తుకామః ప్రలయార్ణవేऽబ్రవీచ్చికీర్షురేకాన్తజనప్రియః ప్రియమ్
ప్రళయం రాబోతున్నది. ఆ ప్రళయ కాల సముద్రములో విహరించబోయి ఈ రూపం ధరించాను. ప్రళయ కాలములో కూడా మరణించకుండా ఉండేవారికి దర్శనం కలిగించి సిద్ధిని అందించడానికి, వారికి ప్రీతి కలిగించడానికి
శ్రీభగవానువాచ
సప్తమే హ్యద్యతనాదూర్ధ్వమహన్యేతదరిన్దమ
నిమఙ్క్ష్యత్యప్యయామ్భోధౌ త్రైలోక్యం భూర్భువాదికమ్
నేటికి ఏడవ నాటికి భూ భువ సువ లోకాలను సముద్రం ముంచుతుంది
త్రిలోక్యాం లీయమానాయాం సంవర్తామ్భసి వై తదా
ఉపస్థాస్యతి నౌః కాచిద్విశాలా త్వాం మయేరితా
నీవు సురక్షితముగా ఉంటావు. అలా ముంచగానే ఒక విశాలమైన పడవ నేను మోస్తుండగా నీ వద్దకు వస్తుంది
త్వం తావదోషధీః సర్వా బీజాన్యుచ్చావచాని చ
సప్తర్షిభిః పరివృతః సర్వసత్త్వోపబృంహితః
నీవు ఔషధులూ బీజములూ పెద్దవీ చిన్నవీ అన్ని తెచ్చుకుని అందులో కూర్చో, అక్కడ సప్తృషులు ఉంటాయి. ఒక్కో ప్రాణికీ ఒక్కో బీజం తీసుకో
ఆరుహ్య బృహతీం నావం విచరిష్యస్యవిక్లవః
ఏకార్ణవే నిరాలోకే ఋషీణామేవ వర్చసా
ఎలాంటి దైన్యం లేకుండా ప్రళయ కాలాంతం నావ మీద ఉండు. సప్తృషుల తేజస్సుతో ప్రభావముతో అంతా వెలుగుతూ ఉంటుంది
దోధూయమానాం తాం నావం సమీరేణ బలీయసా
ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా
పెద్ద గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలికి పడవ అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. వాసుకి అనే సర్పముతో ఆ పడవని నా కొమ్ముకు కట్టు.
అహం త్వామృషిభిః సార్ధం సహనావముదన్వతి
వికర్షన్విచరిష్యామి యావద్బ్రాహ్మీ నిశా ప్రభో
బ్రహ్మకు రాత్రి పూర్తి అయ్యే వరకూ ఆ నావను ఈ సముద్రములో తిప్పుతూ విహరిస్తాను
మదీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితమ్
వేత్స్యస్యనుగృహీతం మే సమ్ప్రశ్నైర్వివృతం హృది
ఎలాగూ కూర్చున్నావు కదా, బ్రహ్మ రాత్రి పూర్తి అయ్యే వరకూ సకల విశ్వ రహస్యాన్నీ నా నుండి వింటావు (అదే మత్స్య పురాణం)
ఇత్థమాదిశ్య రాజానం హరిరన్తరధీయత
సోऽన్వవైక్షత తం కాలం యం హృషీకేశ ఆదిశత్
ఇలా చెప్పి రాజుని ఆజ్ఞ్యాపించి పరమాత్మ అంతర్థానం చెందాడు. ఈ రూపం వెనక కారణం నా నిజమైన రూపం ఆ పడవను ఆపుతుందా అన్న నమ్మకం కలగడానికి. పరమాత్మ చెప్పిన సమయాని కొరకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు
ఆస్తీర్య దర్భాన్ప్రాక్కూలాన్రాజర్షిః ప్రాగుదఙ్ముఖః
నిషసాద హరేః పాదౌ చిన్తయన్మత్స్యరూపిణః
తూర్పు వైపు దర్భలు పరచి తాను ఉత్తరాభిముఖుడై మత్స్య రూపుడైన పరమాత్మను ధ్యానిస్తూ కూర్చున్నాడు
తతః సముద్ర ఉద్వేలః సర్వతః ప్లావయన్మహీమ్
వర్ధమానో మహామేఘైర్వర్షద్భిః సమదృశ్యత
సమయం రానే వచ్చింది. భూమిని ముంచి వేస్తోంది.ఎనుగు తొండం వంటి ధారలతో వర్షం కురుస్తోంది
ధ్యాయన్భగవదాదేశం దదృశే నావమాగతామ్
తామారురోహ విప్రేన్ద్రైరాదాయౌషధివీరుధః
ఆయన ధ్యానం చేయగా పరమాత్మ ఆదేశముతో పడవ వచ్చింది. అన్ని ఔషధులల్తో ఆ పడవ ఎక్కాడు
తమూచుర్మునయః ప్రీతా రాజన్ధ్యాయస్వ కేశవమ్
స వై నః సఙ్కటాదస్మాదవితా శం విధాస్యతి
పరమాత్మను ధ్యానం చేయమని మునులు చెప్పారు. ఆయనే మనకు శుభాన్ని కలిగిస్తాడు, కష్టం నుంచి తప్పిస్తాడు
సోऽనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్ణవే
ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతయోజనః
సత్య వ్రతుడు ధ్యానం చేస్తేనే మత్స్య రూపుడైన పరమాత్మ వస్తాడు. అలా రానే వచ్చాడు పరమాత్మ బంగారు మత్స్య రూపములో. ఒకటే శృంగం, లక్ష యోజనాల వైశాల్యం కలిగి ఉన్నాడు.
నిబధ్య నావం తచ్ఛృఙ్గే యథోక్తో హరిణా పురా
వరత్రేణాహినా తుష్టస్తుష్టావ మధుసూదనమ్
మొదలు పరమాత్మ చెప్పినట్లుగా నావను కొమ్ముకు సర్పముతో కట్టాడు, కట్టి స్తోత్రం చేస్తున్నాడు
శ్రీరాజోవాచ
అనాద్యవిద్యోపహతాత్మసంవిదస్తన్మూలసంసారపరిశ్రమాతురాః
యదృచ్ఛయోపసృతా యమాప్నుయుర్విముక్తిదో నః పరమో గురుర్భవాన్
అనాదినుండీ వచ్చే అవిద్య చేత ఆత్మ జ్ఞ్యానం తొలగించబడి, దాని వలన సంసార పరిశ్రంతో ఖిన్నులైన మానవులు నీ సంకల్పముతో ఇచట చేరాము. అలాంటి వారు ఎవరిని పొందాలో అటువంటి నీవు ఇక్కడకు వేంచేసావు.
జనోऽబుధోऽయం నిజకర్మబన్ధనః సుఖేచ్ఛయా కర్మ సమీహతేऽసుఖమ్
యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రన్థిం స భిన్ద్యాద్ధృదయం స నో గురుః
ఈ జీవులు జ్ఞ్యానం లేనివి. మేము ఆచరించే కర్మలే మమ్ము బంధిస్తాయి. సుఖం కావాలని పనులు చేస్తూ దుఃఖాన్ని పొందుతాము. అలాంటి వారం నీ సేవతో దుష్టబుద్ధి తొలగించుకుంటారు. అటువంటి పరమాత్మ నా హృదయ గ్రంధిని తొలగించాలి.
యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్విజహ్యాన్మలమాత్మనస్తమః
భజేత వర్ణం నిజమేష సోऽవ్యయో భూయాత్స ఈశః పరమో గురోర్గురుః
ఎలా రుద్రుని రోదనం పాపాలని పోగొడుతుందో, అగ్ని యొక్క జ్వాల చీకటిని పోగొడుతుందో, మానవుడు తన మురికిని పోగొడతాడో, నీవు అందరికీ గురువు, గురువులందరికీఇ గురువు. ఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారు అన్ని పాపాలు తొలగించుకుంటారు. నీవు మమ్ము కాపాడి శుభం కలిగించుగాక.
న యత్ప్రసాదాయుతభాగలేశమన్యే చ దేవా గురవో జనాః స్వయమ్
కర్తుం సమేతాః ప్రభవన్తి పుంసస్తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే
నీ యొక్క పదివేలవ అంశతో ఇతర దేవతాదులందరూ, తమ తమ విధులను సక్రమముగా నిర్వహించగలుగుతారు, అటువంటి నీకు శరణం వేడుతున్నాను
అచక్షురన్ధస్య యథాగ్రణీః కృతస్తథా జనస్యావిదుషోऽబుధో గురుః
త్వమర్కదృక్సర్వదృశాం సమీక్షణో వృతో గురుర్నః స్వగతిం బుభుత్సతామ్
ఇంతవరకూ లోకం కళ్ళు లేని వారంతా తమ గుడ్డివాడిని పెట్టుకుని నడిచినట్లుగా ఉంది. అజ్ఞ్యానులైన వారంతా ఒక మూర్ఖున్ని పెట్టుకుని పని చేస్తున్నారు. ఆ మూర్ఖుడే గురువు అజ్ఞ్యానులకు. కన్నులేని వారకు గుడ్డివాడు ముందు ఉంటాడు. అటువంటి పని మేము చేయకుండా సూర్యునికి కూడా తేజస్సు ప్రసాదించే అందరి చూపులకు చూపు ఐన నిన్ను మేము గురువుగా ఎన్నుకున్నాము
జనో జనస్యాదిశతేऽసతీం గతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః
త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమఞ్జసా ప్రపద్యతే యేన జనో నిజం పదమ్
దాట రాని మహా అంధకారాన్ని పోగొట్టి మానవులకు ఉత్తమ బుద్ధినీ జ్ఞ్యానాన్నీ నీవు ప్రసాదించాలి. అర్థం కాని జ్ఞ్యానమును సులభముగా పొందే నీకు శరణం.
త్వం సర్వలోకస్య సుహృత్ప్రియేశ్వరో హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్టసిద్ధిః
తథాపి లోకో న భవన్తమన్ధధీర్జానాతి సన్తం హృది బద్ధకామః
సకల లోకాలకూ ప్రియుడవూ మిత్రుడవూ అధిపతివీ, నీవే ఆత్మ జ్ఞ్యానం గురువు, ఇష్ట సిద్ధివీ. గుడ్డి బుద్ధి ఉన్న వారు నిన్ను తెలుసుకోలేరు. కోరికతో కొట్టబడి హృదయములో ఉన్న నిన్ను తెలుసుకోలేరు.
తం త్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ
ఛిన్ధ్యర్థదీపైర్భగవన్వచోభిర్గ్రన్థీన్హృదయ్యాన్వివృణు స్వమోకః
ఇదే గాయత్రీ మంత్రం. నీవు సకల దేవతలకూ శ్రేష్టుడవు, ఉత్తమ తేజోవంతుడవు, అటువంటి నిన్ను ఆశ్రయించి జ్ఞ్యానం పొందడానికి, అర్థములను ప్రకాశింపచేసే దీపమువంటి నీ వాక్యములతో మా అజ్ఞ్యానాన్ని తొలగించు. హృదయ గ్రంధులను తొలగించు. నీ దివ్య తేజస్సును సాక్షాత్కరింపచేయవలసింది. అని ప్రార్థించాడు.
శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తవన్తం నృపతిం భగవానాదిపూరుషః
మత్స్యరూపీ మహామ్భోధౌ విహరంస్తత్త్వమబ్రవీత్
స్వామి విహరిస్తూ తత్వం మొత్తం చెప్పాడు.
పురాణసంహితాం దివ్యాం సాఙ్ఖ్యయోగక్రియావతీమ్
సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమశేషతః
తన రహస్యం చెప్పాడు, సాంఖ్య యోగ క్రియను చెప్పాడు.
అశ్రౌషీదృషిభిః సాకమాత్మతత్త్వమసంశయమ్
నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనమ్
ఎలాంటి సంశయం లేకుండా ఆత్మ తత్వాన్ని హాయిగా నావలో కూర్చుని స్వామి చెప్పిన తత్వాన్ని విన్నాడు. తను నావ కింద ఉండి పడవను మోస్తూ పడవలో ఉన్న వారికి తత్వోపదేశం చేసాడు. ఇది మత్స్యావతార రహ్సస్యం. శిష్యుడి బరువు మోసేవాడు గురువు.
అతీతప్రలయాపాయ ఉత్థితాయ స వేధసే
హత్వాసురం హయగ్రీవం వేదాన్ప్రత్యాహరద్ధరిః
ప్రళకాల రాత్రి ఐన తరువాత బ్రహ్మ నిదుర నుండి లేచాడు. స్వామి హయగ్రీవుడనే రాక్షసున్ని చంపి వేదాలను ఇచ్చాడు
స తు సత్యవ్రతో రాజా జ్ఞానవిజ్ఞానసంయుతః
విష్ణోః ప్రసాదాత్కల్పేऽస్మిన్నాసీద్వైవస్వతో మనుః
సత్యవ్రతుడు పరమ విజ్ఞ్యానం జ్ఞ్యానం కలవాడు. ఆయనే ఈ కల్పములో (వైవస్వత మన్వతరములో) పరమాత్మ అనుగ్రహముతో మనువు అయ్యాడు
సత్యవ్రతస్య రాజర్షేర్మాయామత్స్యస్య శార్ఙ్గిణః
సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్
ఈ సత్యవ్రత మహారాజు చరిత్ర, మత్స్య మూర్తితో ఆయన సంవాదం వింటే అన్ని పాపాలూ తొలగుతాయి.
అవతారం హరేర్యోऽయం కీర్తయేదన్వహం నరః
సఙ్కల్పాస్తస్య సిధ్యన్తి స యాతి పరమాం గతిమ్
ప్రతీరోజు ఈ మత్స్యావతార కథను అనుసంధానం చేస్తే అన్ని సంకల్పాలూ నెరవేరి ఉత్తమ గతిని చెందుతాడు
ప్రలయపయసి ధాతుః సుప్తశక్తేర్ముఖేభ్యః
శ్రుతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా
దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం
తమహమఖిలహేతుం జిహ్మమీనం నతోऽస్మి
ప్రళయ సముద్రములో పడుకుని ఉన్న బ్రహ్మ ముఖమునుండి తొలగించబడిన వేదములను అపహరించిన రాక్షసున్ని చంపి వాటిని బ్రహ్మగారికి ఇచ్చాడు. సత్యవ్రతుడనే రాజుకూ సత్యవ్రతులైన ఋషులందరికీ పరబ్రహ్మ గూర్చి ఎవరు బోధించారో అటువంటి సకల జగద్కారణమైన కపట మత్స్యావతారానికి మా నమస్కారం.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు