Followers

Thursday 17 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం మూడవ అధ్యాయం

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః
యర్హ్యేవాజనజన్మర్క్షం శాన్తర్క్షగ్రహతారకమ్

పరమ మంగళకరమైన సకల గుణములతో కూడి ఉన్న ఉత్తమ కాలములో బ్రహ్మ పుట్టిన నక్షత్రములో (రోహిణీ) సకల నక్షత్రాలూ గ్రహములూ శాంతముగా ఉన్న కాలములో

దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయమ్
మహీ మఙ్గలభూయిష్ఠ పురగ్రామవ్రజాకరా

దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి, ఆకాశం రాత్రి అంతా నక్షత్రాలతో పగలంతా మబ్బులతో ఉంది.
భూమంతా శుభములూ మంగళములతో పురములూ గ్రామములూ వ్రజములూ, మడుగులూ చెరువులూ నిండాయి

నద్యః ప్రసన్నసలిలా హ్రదా జలరుహశ్రియః
ద్విజాలికులసన్నాద స్తవకా వనరాజయః

అన్ని తోటలూ పుష్పాలూ ఫలాలతో ఉన్నాయి. వాయువు కూడా సుఖ స్పర్శనిస్తోంది

వవౌ వాయుః సుఖస్పర్శః పుణ్యగన్ధవహః శుచిః
అగ్నయశ్చ ద్విజాతీనాం శాన్తాస్తత్ర సమిన్ధత

బ్రాహ్మణోత్తముల అగ్నులు కూడా బాగా ప్రజ్వరిల్లాయి.

మనాంస్యాసన్ప్రసన్నాని సాధూనామసురద్రుహామ్
జాయమానేऽజనే తస్మిన్నేదుర్దున్దుభయః సమమ్

రాక్షసుల శత్రువులైన దేవతలూ మంచివారి మనసులు ప్రసన్నమయ్యాయి. పరమాత్మ అవతరించిన సమయములో దుందుభులు మోగాయి.

జగుః కిన్నరగన్ధర్వాస్తుష్టువుః సిద్ధచారణాః
విద్యాధర్యశ్చ ననృతురప్సరోభిః సమం ముదా

కిన్నెర గంధర్వాదులు గానం చేసారూ నాట్యం చేసారు. మునులూ దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు.

ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః
మన్దం మన్దం జలధరా జగర్జురనుసాగరమ్

పెద్దవాళ్ళ ముందర ఎక్కువగా మాట్లాడకూడదని మబ్బులన్నీ మెల్ల మెల్లగా సముద్రం వడ్డునే ఉన్నాయి.

నిశీథే తమౌద్భూతే జాయమానే జనార్దనే
దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణుః సర్వగుహాశయః
ఆవిరాసీద్యథా ప్రాచ్యాం దిశీన్దురివ పుష్కలః

పరమాత్మ అర్థ రాత్రి సమయములో పుట్టబోతూ ఉంటే, దేవరూపిణి ఐన దేవకి యందు అందరి హృదయములో అంతర్యామిగా ఉన్న  పరమాత్మ తూర్పు దిక్కున చంద్రునిలాగ దేవకి యందు పరమాత్మ ఆవిర్భవించాడు

తమద్భుతం బాలకమమ్బుజేక్షణం చతుర్భుజం శఙ్ఖగదాద్యుదాయుధమ్
శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతామ్బరం సాన్ద్రపయోదసౌభగమ్

వసుదేవుడు పుత్రుని ముఖాన్ని చూచాడు. కృష్ణ పరమాత్మ ముఖాన్ని చూచాడు. ఆయన శిశువుగా ఆవిర్భవించలేదు. శ్రీమన్నారాయణునిగా ఆవిర్భవించాడు. దేవకీ వసుదేవులు నమ్మడానికి ఆ రూపములో వచ్చాడు. శ్రీమన్నారాయణుని అన్ని గుర్తులూ ఆ పిల్లవానిలో ఉన్నాయి.మధ్యభాగం అంతా తెలుపు ఉండి కనుల కొనలలో ఎర్రని జీర ఉంది. ఆయన పుండరీకాక్షుడు. నాలుగు భుజములతో నాలుగు భుజాలలో నాలుగు ఆయుధాలు కలిగి ఉన్నాడు. వక్షస్థలములో శ్రీవత్సం అనే పుట్టుమచ్చా, మెడలో కౌస్తుభ మణి ఉంది. పీతాంబరం ధరించి ఉన్నాడు. నీలమేఘశ్యామునిగా ప్రకాశిస్తున్నాడు.

మహార్హవైదూర్యకిరీటకుణ్డల త్విషా పరిష్వక్తసహస్రకున్తలమ్
ఉద్దామకాఞ్చ్యఙ్గదకఙ్కణాదిభిర్విరోచమానం వసుదేవ ఐక్షత

 వైఢూర్యమణులతో ఏర్పరచబడిన కిరీటములూ కుండలములూ, వాటి కాంతి ముంగురులను అల్లుకుని ఉన్నాయి. మొలతాడులూ కాంచీ నూపురాలూ అంగదములూ కంకణములూ, ఇవన్నీ కలిగి ఉన్న స్వామిని వసుదేవుడు చూచాడు. అప్పుడే పుట్టిన బిడ్డలో ఇవన్నీ కనపడుతున్నాయి.

స విస్మయోత్ఫుల్లవిలోచనో హరిం సుతం విలోక్యానకదున్దుభిస్తదా
కృష్ణావతారోత్సవసమ్భ్రమోऽస్పృశన్ముదా ద్విజేభ్యోऽయుతమాప్లుతో గవామ్

అందుచే ఆశ్చర్యముతో విప్పారిన కళ్ళు కలవాడై ఆననకదుంబుద్భి అన్న పేరు కలవాడైన వసుదేవుడు కృష్ణుడు  అవతరించాడన్న ఆనందములో సంభ్రమించి, స్నానం చేసి (ఆప్లుతః), వెంటనే పదివేల గోవులు దానం చేయడానికి సంకల్పించాడు (ఎన్ని గోవులను దానం చేయదలచుకున్నాడో అన్ని గోవులను దానం చేయడానికి సంకల్పించడానికి) . ఆ గోవులను కంస వధానంతరం దానం చేసి తన సంకల్పాన్ని నిలబెట్టుకున్నాడు.

అథైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాఙ్గః కృతధీః కృతాఞ్జలిః
స్వరోచిషా భారత సూతికాగృహం విరోచయన్తం గతభీః ప్రభావవిత్

పరమ పురుషునిగా స్వామిని గుర్తించినాడు, పరమ పురుషుడే ఇతను అని నిశ్చయించుకుని (అవధార్య), చేతులు జోడించి, శరీరాన్ని వంచి (నత అంగః), పరమ సంతోషముతో కంసుని చెరసాలలో ఉన్నా పరమాత్మ ప్రభావం తెలుసు కాబట్టి, తన కాంతితో మొత్తం ప్రసూతి గృహాన్ని ప్రకాశింపచేస్తున్న స్వామిని చూడగానే కంసుడు ఏదో చేస్తాడన్న భయము పోయి స్తోత్రం చేస్తున్నాడు.

శ్రీవసుదేవ ఉవాచ
విదితోऽసి భవాన్సాక్షాత్పురుషః ప్రకృతేః పరః
కేవలానుభవానన్ద స్వరూపః సర్వబుద్ధిదృక్

నీవు ప్రకృతికి అతీతుడవైన పరమ పురుషుడవన్న విషయం తెలుసుకున్నాను. నీవు కేవల ఆనంద స్వరూపుడవు. అనుభవానంద స్వరూపుడవు. ఆనందమును ఆనందముగా అనుభవించుటే పరమాత్మను సాత్క్షాత్కరించుకోవడం. అనుభవించేవాడూ అనుభవించబడేవాడు అని వేరేగా ఉండరు. ఈ అనంతమైన ప్రపంచములో ఏ మూల ఉన్న వారు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసు. బుద్ధిలో హృదయములో ఉన్నది ఆయనే. 

స ఏవ స్వప్రకృత్యేదం సృష్ట్వాగ్రే త్రిగుణాత్మకమ్
తదను త్వం హ్యప్రవిష్టః ప్రవిష్ట ఇవ భావ్యసే

ప్రకృతి మహత్ తత్వం అహంకారం పంచభూతములూ పంచ జ్ఞ్యానేంద్రియములూ పంచ కర్మేంద్రియములూ అన్ని కలిసి ఒక అండము. అందులోంచి విరాట్ పురుషుడు పుడతాడు. అవికృతములైన ప్రకృతి మహదహంకారాలతో వికృతములైన జ్ఞ్యాన కర్మేంద్రియములు కలిగి నీ సంకల్పముతో విడిగా ఉన్నవి కలిసాయి.

యథేమేऽవికృతా భావాస్తథా తే వికృతైః సహ
నానావీర్యాః పృథగ్భూతా విరాజం జనయన్తి హి

సన్నిపత్య సముత్పాద్య దృశ్యన్తేऽనుగతా ఇవ
ప్రాగేవ విద్యమానత్వాన్న తేషామిహ సమ్భవః

ఒకదానితో ఒకటి కలిసి (సన్నిపత్య - కలవకుండా ఉండేవాటిని కలపడానికి చేసే ప్రయత్నం సన్నిపాతము.) ఒకదానితో ఒకటి సృష్టించబడినట్లుగా కనపడుతూ ఉంటాయి. కానీ ఇవి ఇప్పుడే పుట్టినవి కావు. అంతకు ముందే ఉన్నాయి. అందువలన మళ్ళీ ఇక్కడ పుట్టుట అన్న మాట లేదు.కనపడకుండా ఉన్నవి కనపడుతున్నాయి, అంతే.

ఏవం భవాన్బుద్ధ్యనుమేయలక్షణైర్గ్రాహ్యైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహః
అనావృతత్వాద్బహిరన్తరం న తే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః

నీవు కూడా బుద్ధి చేత మాత్రమే ఊహించదగిన లక్షణములు కల, గ్రహించడానికి యోగ్యమైన గుణములతో కలిగి ఉండి కూడా ఆ గుణములతో నీవు గ్రహించబడలేదు. పరమాత్మకు ఉన్న గుణాలు వాత్సల్యమూ ఔదార్యమూ సౌందర్యమూ సౌశీలమూ మొదలైనవి. అవి పరమాత్మకు ఉన్నాయి అని మన బుద్ధితో మనం తెలుసుకోగలమా? అలా తెలుసుకోలేనప్పుడు మనమాయనను స్తోత్రం చేయగలమా. మనకుందే ప్రతీ గుణాలకు ఒక దుర్గుణం ఉంటుంది. మనమేదో ఆశించి ఆయనను కొలిస్తే మనకు ఆయన కనపడతాడా. గ్రహించబడే వాడే ఐనా మనచేత గ్రైంచబడడు
పరమాత్మ అనావృతుడు. ఆయనను ఏమీ ఆవరించలేదు.మన ఆత్మను శరీరం, దాన్ని పంచభూతాలూ, దాన్ని మహత్తూ, మొదలైనవి ఆవరిస్తాయి. మనని కప్పి పెట్టిన ముసుగులను దాటి బయటకు వెళితే గాని ఆయన కనపడడు. ఆయన చూడబడేవాడే, చూచే మనకే అన్ని అడ్డుగోడలూ ఉంటాయి. 

య ఆత్మనో దృశ్యగుణేషు సన్నితి వ్యవస్యతే స్వవ్యతిరేకతోऽబుధః
వినానువాదం న చ తన్మనీషితం సమ్యగ్యతస్త్యక్తముపాదదత్పుమాన్

జ్ఞ్యానం లేని వాడు ఎదురుగా ఉండేవారు మనకన్నా భిన్నులనీ కనపడే సత్వ రజస్తమో గుణముల యందే అస్తిత్వ బుద్ధి ఉంచి నేను వేరు నీవు వేరు  వారు వేరు అనే బుద్ధి పెట్టి, తాను విడిచిపెట్టిన దాన్ని తానే తీసుకుంటాడు. నీకు ఏ వికారం లేదు. ఏ వికారం లేని నీ చేత ఈ జగత్తు పుడుతోంది రక్షించబడుతోంది లయించబడుతోంది. ప్రపంచానికి గుణాలు ఉన్నాయి, పరమాత్మకు గుణాలు లేవు. పరమాత్మకు ఏ కోరికా లేదు (అనీహ), ఆయన సృష్టించిన ప్రాణులకు అన్ని కోరికలూ ఉన్నాయి

త్వత్తోऽస్య జన్మస్థితిసంయమాన్విభో
వదన్త్యనీహాదగుణాదవిక్రియాత్
త్వయీశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే
త్వదాశ్రయత్వాదుపచర్యతే గుణైః

ఇవన్నీ నీయందు పుట్టాయి అనుకుంటారు అందరూ. 

స త్వం త్రిలోకస్థితయే స్వమాయయా
బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః
సర్గాయ రక్తం రజసోపబృంహితం
కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే

మూడు లోకాలనూ కాపాడటానికి తెలుపు రంగు (సత్వ గుణాన్ని) స్వీకరిస్తావు. 

త్వమస్య లోకస్య విభో రిరక్షిషుర్గృహేऽవతీర్ణోऽసి మమాఖిలేశ్వర
రాజన్యసంజ్ఞాసురకోటియూథపైర్నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చమూః

రాజులనే వంక పెట్టుకుని వచ్చిన కోట్లమంది రాక్షసులను సంహరించడానికి ఈ లోకాన్ని కాపాడటానికి నీవు మా ఇంటిలో అవతరించావు

అయం త్వసభ్యస్తవ జన్మ నౌ గృహే
శ్రుత్వాగ్రజాంస్తే న్యవధీత్సురేశ్వర
స తేऽవతారం పురుషైః సమర్పితం
శ్రుత్వాధునైవాభిసరత్యుదాయుధః

ఈ కంసుడు అసభ్యుడు. నీవు మా ఇంటిలో పుట్టబోతున్నావని విని నీ అన్నలందరనూ సంహరించాడు. నీవు పుట్టావన్న మాట భటులతో వింటే ఆయుధం తీసుకుని పరిగెత్తుకుని వస్తాడు. 

శ్రీశుక ఉవాచ
అథైనమాత్మజం వీక్ష్య మహాపురుషలక్షణమ్
దేవకీ తముపాధావత్కంసాద్భీతా సువిస్మితా

తనకు కలిగిన కుమారునిలో పరమాత్మ లక్షణాలను చూచి కంసుడంటే భయపడే దేవకి పరమాత్మను శుచిస్మితయై (మన ముఖములో చిరునవ్వు మనకు సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక ధరియాన్ని కలిగిస్తుంది) స్తోత్రం చేసింది. 

శ్రీదేవక్యువాచ
రూపం యత్తత్ప్రాహురవ్యక్తమాద్యం
బ్రహ్మ జ్యోతిర్నిర్గుణం నిర్వికారమ్
సత్తామాత్రం నిర్విశేషం నిరీహం
స త్వం సాక్షాద్విష్ణురధ్యాత్మదీపః

పరమాత్మా! నీ రూపం ఎవరికీ తెలియబడేది కాదు. అన్నిటికంటే మొదటిది. సత్వాది గుణములు లేనిది. ఉత్పత్తి వినాశాలు లేనిది. పరమాత్మ అంటే ఉన్నవాడు. ఎటువంటి వికారాలు లేనివాడవు. ఎటువంటి కోరికా లేనివాడవు. అలాంటి నీవే పరమాత్మవు, అధ్యాత్మ దీపం( పరమ సత్వ స్వరూపాన్ని ప్రకాశింపచేసేవాడవు)

నష్టే లోకే ద్విపరార్ధావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు
వ్యక్తేऽవ్యక్తం కాలవేగేన యాతే భవానేకః శిష్యతేऽశేషసంజ్ఞః

ప్రళయకాలములో (బ్రహ్మ ఆయువు పూర్తి ఐన తరువతా, పరార్థ కాలములో), వ్యత్కము కాస్తా  అవ్యక్తములో చేరతాయి. అప్పుడు నీవొక్కడవే మిగులుతావు శేషుడు అన్న పేరుతో. నీ చేష్టే కాలము. కాలమనేది నీ చేష్ట. 

యోऽయం కాలస్తస్య తేऽవ్యక్తబన్ధో
చేష్టామాహుశ్చేష్టతే యేన విశ్వమ్
నిమేషాదిర్వత్సరాన్తో మహీయాంస్
తం త్వేశానం క్షేమధామ ప్రపద్యే

సకల ప్రపంచమూ కాలము చేతనే పని చేస్తోంది. మనదరితో పని చేయిస్తోంది కాలం. ఆ కాలమే నీ స్వరూపం. కాలమంటే నిమేషం నుంచీ వత్స్రం వరకూ. ఆ కాలాన్ని ప్రకృతినీ  గుణాన్ని కాకుండా అన్ని క్షేమాలకూ నిలయమైన నిన్ను శరణు వేడుతున్నాను. 

మర్త్యో మృత్యువ్యాలభీతః పలాయన్లోకాన్సర్వాన్నిర్భయం నాధ్యగచ్ఛత్
త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య సుస్థః శేతే మృత్యురస్మాదపైతి

మృత్యువనే మహా భయానికి భయపడి అన్ని దిక్కులకూ పరిగెత్తి ఎక్కడా భయం లేని చోటు పొందలేక, నీ సంకల్పముతో నీ పాదాలని శరణు వేడి స్వస్థత పొందుతాడు. మృత్యువు అంటే సంసారం, ప్రకృతి యొక్క భయం. 

స త్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్నస్త్రాహి త్రస్తాన్భృత్యవిత్రాసహాసి
రూపం చేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాంసదృశాం కృషీష్ఠాః

నీవు నీ భక్తుల భయం తొలగించేవాడివి కాబట్టి ఉగ్రసేనుని పుత్రుని వలన మాకు కలిగిన భయం తొలగించవలసింది. మా కన్నులు మాంఅస్పు కన్నులు. ప్రకృతి వికారము చేత ఏరపరచిన మా కన్నులకు ప్రకృతికి అతీతమైన నీ రూపాన్ని చూపించకు 

జన్మ తే మయ్యసౌ పాపో మా విద్యాన్మధుసూదన
సముద్విజే భవద్ధేతోః కంసాదహమధీరధీః

నీవు మాకు కుమారుడిగా పుట్టావని ఈ దుర్మార్గుడికి తెలియకూడదు. నీకేమవుతుందో అని ప్రతీ క్షణం భయపడుతూ ఉన్నాను

ఉపసంహర విశ్వాత్మన్నదో రూపమలౌకికమ్
శఙ్ఖచక్రగదాపద్మ శ్రియా జుష్టం చతుర్భుజమ్

నీ అలౌకికమైన నీ రూపాన్ని ఉపసంహరించు. మామూలు శిశువుగానే ఉండు.

విశ్వం యదేతత్స్వతనౌ నిశాన్తే యథావకాశం పురుషః పరో భవాన్
బిభర్తి సోऽయం మమ గర్భగోऽభూదహో నృలోకస్య విడమ్బనం హి తత్

ప్రళయ కాలములో సకల చరాచర జగత్తూ నీ కడుపులో దాచుకునే నీవు నా కడుపులో పెరిగావు. అది కేవలం విడంబనం మాత్రమే. 

శ్రీభగవానువాచ
త్వమేవ పూర్వసర్గేऽభూః పృశ్నిః స్వాయమ్భువే సతి
తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః

ఈ రూపముతో రావడానికి కారణం, నీవు పూర్వ జన్మలో పృష్ణివి, ఈ వసుదేవుడు సుతప అనే ప్రజాపతి. మీరు బ్రహ్మ చేత ఆజ్ఞ్యాపించబడి ఉత్తమ సృష్టి జరపాలని అన్ని ఇంద్రియములనూ నిగ్రహించి వర్షమునూ గాలినీ మంచునూ అన్ని గుణాలనూ భరిస్తూ ప్రాణాయామముతో మనసు యొక్క మురికి తొలగించుకున్నవారై గాలి వలన రాలిన ఆకులు మాత్రం తింటూ పరిశుద్ధమైన మనసుతో నానుండి కోరదలచి పన్నెండువేల దివ్య సంవత్సరాలు నన్ను ఆరాధించారు (నాలుగు యుగములు).

యువాం వై బ్రహ్మణాదిష్టౌ ప్రజాసర్గే యదా తతః
సన్నియమ్యేన్ద్రియగ్రామం తేపాథే పరమం తపః

వర్షవాతాతపహిమ ఘర్మకాలగుణానను
సహమానౌ శ్వాసరోధ వినిర్ధూతమనోమలౌ

శీర్ణపర్ణానిలాహారావుపశాన్తేన చేతసా
మత్తః కామానభీప్సన్తౌ మదారాధనమీహతుః

ఏవం వాం తప్యతోస్తీవ్రం తపః పరమదుష్కరమ్
దివ్యవర్షసహస్రాణి ద్వాదశేయుర్మదాత్మనోః

తదా వాం పరితుష్టోऽహమమునా వపుషానఘే
తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావితః

మీ తపస్సుకూ శ్రద్ధకూ భక్తికీ సంతోషించిన నేను 

ప్రాదురాసం వరదరాడ్యువయోః కామదిత్సయా
వ్రియతాం వర ఇత్యుక్తే మాదృశో వాం వృతః సుతః

మీకు వరములు ఇవ్వదలచి ఆవ్రిభవించాను. మీరు నన్ను చూచి మీ కనులు మిరుమిట్లు గొలపగా నా వంటి కొడుకుని కావాలి అని అడిగారు. 

అజుష్టగ్రామ్యవిషయావనపత్యౌ చ దమ్పతీ
న వవ్రాథేऽపవర్గం మే మోహితౌ దేవమాయయా

భార్యా భరతల వైవాహిక జీవితాన్ని మీరు అనుభవించకపోవడము వలన మీరు గ్రామ్య విష్యాలను అడిగారు. నా మాయతో మోహించబడి నన్ను కొడుకుగా అడిగారు తప్ప మోక్షాన్ని కోరలేదు. 

గతే మయి యువాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతమ్
గ్రామ్యాన్భోగానభుఞ్జాథాం యువాం ప్రాప్తమనోరథౌ

అలాంటి వరమును మీకు ఇచ్చి నేను అంతర్థానమవ్వగా మీరు మీ ఇంటికి వెళ్ళి గ్రామ్యమైన అన్ని అనుభూతులనూ పొంది కాలం గడుపుతున్నారు. 

అదృష్ట్వాన్యతమం లోకే శీలౌదార్యగుణైః సమమ్
అహం సుతో వామభవం పృశ్నిగర్భ ఇతి శ్రుతః

నాలాంటి వాడు ఇంకొకరు లేరు కాబట్టి, నేనే మీకు కుమారునిగా పుట్టాను. అప్పుడు నన్ను పృష్ణి గర్భుడు అన్నారు

తయోర్వాం పునరేవాహమదిత్యామాస కశ్యపాత్
ఉపేన్ద్ర ఇతి విఖ్యాతో వామనత్వాచ్చ వామనః

తరువాత మీరే అథితి కశ్యపులు అవ్వగా మీకు వామనుడిగా పుట్టాను. 

తృతీయేऽస్మిన్భవేऽహం వై తేనైవ వపుషాథ వామ్
జాతో భూయస్తయోరేవ సత్యం మే వ్యాహృతం సతి

మూడవ సారి నేను మీకు ఇలా పుట్టాను. మూడవ జన్మలో అదే రూపముతో (నా దివ్య రూపముతో ) నేను చెప్పినది మీరు నమ్మడానికి ఇలా ఈ రూపముతో వచ్చాను. నీ పూర్వ జన్మ జ్ఞ్యానం కూడా నీకు కలగడానికి ఇలా కనపడ్డాను

ఏతద్వాం దర్శితం రూపం ప్రాగ్జన్మస్మరణాయ మే
నాన్యథా మద్భవం జ్ఞానం మర్త్యలిఙ్గేన జాయతే

లేకపోతే మానవుడిగా ఉన్నవాడికి పూర్వ జన్మ జ్ఞ్యానం పరమాత్మ జ్ఞ్యానం కలుగుతుందా మానవులకు. 

యువాం మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్
చిన్తయన్తౌ కృతస్నేహౌ యాస్యేథే మద్గతిం పరామ్

మీరు నన్ను కొడుకుగానూ పెంచుతారూ, పరమాత్మగానూ పెంచుతారు. ఇలా చాలా మార్లు నన్నే ధ్యానం చేస్తూ ప్రేమగలవారై చివరికి అవసానములో నా గత్నిని చేరతారు.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త్వాసీద్ధరిస్తూష్ణీం భగవానాత్మమాయయా
పిత్రోః సమ్పశ్యతోః సద్యో బభూవ ప్రాకృతః శిశుః

ఇలా చెప్పి స్వామి మౌనం వహించాడు. దేవకీ దేవి చెప్పిన దాని ప్రకారం ప్రాకృతి శిశువు అయ్యాడు తన మాయచేతనే.

తతశ్చ శౌరిర్భగవత్ప్రచోదితః
సుతం సమాదాయ స సూతికాగృహాత్
యదా బహిర్గన్తుమియేష తర్హ్యజా
యా యోగమాయాజని నన్దజాయయా

తరువాత స్వామి వసుదేవిడికి ఏమి చేయాలో చెప్పాడు. వ్రేపల్లెకు తనను తీసుకుని వెళ్ళమనీ, అక్కడున్న అమ్మాయిని ఇక్కడకు చేరచమనీ చెప్పగా,ఇంతలోనే యోగమాయ కూడా యశోదకు పుట్టింది. ఈ యోగ మాయ పుట్టిన తేదీనే మహర్నవమీ అంటాము. ఒకే రాత్రిలో ఈ రెండూ ఉండాలి. మధ్య రాత్రి కృష్ణుడు పుట్టాడు, అదే రాత్రిన అమ్మవారూ పుట్టారు.కృష్ణాష్టమి అంటే ఇద్దరిదీ అవుతుంది. నవమీ అష్టమీ ఒకే రాత్రి ఉంటేనే కృష్ణాష్టమి జరపాలి. రామ నవమి కూడా నవమీ దశమీ కలిస్తేనే జరపాలి. 

తయా హృతప్రత్యయసర్వవృత్తిషు ద్వాఃస్థేషు పౌరేష్వపి శాయితేష్వథ
ద్వారశ్చ సర్వాః పిహితా దురత్యయా బృహత్కపాటాయసకీలశృఙ్ఖలైః

ఆమె పుడితే గానీ అందరూ నిదురపోరు. ఆమె చేత మన సకల ఇంద్రియాలూ నిదురపోతాయి. ద్వారపాలకులందరూ పడుకోబెట్టబడ్డారు. ద్వారాలకు ఉక్కుతో చేసిన గడియలు గట్టిగా మూసుకుని ఉన్నాయి. అంత పెద్ద గడియలూ ద్వారాలూ కృష్ణుడికి వాహనమైన వసుదేవుడికి 

తాః కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం వ్యవర్యన్త యథా తమో రవేః
వవర్ష పర్జన్య ఉపాంశుగర్జితః శేషోऽన్వగాద్వారి నివారయన్ఫణైః

సూర్యుడు వస్తే చీకటి పోయినట్లుగా అన్ని ద్వారములూ తమకు తాముగానే తెరుచుకున్నాయి. పర్జన్యుడు కూడా మెల్లగా ఉరుముతూ వర్షించాడు. వానపడుతూ ఉంటే స్వామి మీద వాన పడకుండా పడగలతో వర్షాన్ని ఆపుతూ శేషుడు గొడుగు పట్టి వెంట వచ్చాడు

మఘోని వర్షత్యసకృద్యమానుజా గమ్భీరతోయౌఘజవోర్మిఫేనిలా
భయానకావర్తశతాకులా నదీ మార్గం దదౌ సిన్ధురివ శ్రియః పతేః

ఇలా చాలా రోజుల నుంచీ వర్షం పడుతూ ఉంటే యమానుజ (యమున) గంభీరమైన ప్రవాహముతో భయం కలిగించే వందల సుడిగుండాలు ఉన్న ఆ నది శ్రీరామచంద్రునికి సముద్ర దాటి ఇచ్చినట్లుగా కృష్ణుడికి యమున దారి ఇచ్చింది. (పాద్మ పురాణములో ఉంది ఈ కథ - వసుదేవుడు ఎక్కడా ఆగకుండా యమునా నదిలోకి దిగాడు, అలా దిగుతూ ఉండి ఒక్కొక్క భాగమూ మునుగూ ఉండగా నాసిక వరకూ వచ్చింది, నాసిక తగలగానే ఒక్కసారిగా యమున  ఉదృతి తగ్గిపోయి దారి ఇచ్చింది. అవతల వడ్డుకు వెళ్ళగానే యమున తన రూపముతో వసుదేవుడికి ప్రత్యక్షమై, పరమాత్మ పాదాలను కడగాలని అలా పొంగాను కానీ నీకు ఆపద కలిగించాలని కాదు అని క్షమాపణ కోరింది. సంసారములో ఉన్నవారంతా ఈ భావనతో ఉంటే (మనతోనే భగవానుడు ఉన్నాడు) అప్పుడు సంసారములో మునగరు వసుదేవునిలాగ.యమునా వసుదేవ సంవాదం అని పాద్మపురాణములో పదహారు లోకాలు ఉన్నాయి) 

నన్దవ్రజం శౌరిరుపేత్య తత్ర తాన్
గోపాన్ప్రసుప్తానుపలభ్య నిద్రయా
సుతం యశోదాశయనే నిధాయ తత్
సుతాముపాదాయ పునర్గృహానగాత్

నందవ్రజానికి వెళ్ళి చూడగా అందరూ పడుకుని ఉన్నారు. యశోదమ్మ పక్కలో కుమారున్ని పడుకోబెట్టి అక్కడ ఉన్న కూతురుని తీసుకుని వచ్చాడు

దేవక్యాః శయనే న్యస్య వసుదేవోऽథ దారికామ్
ప్రతిముచ్య పదోర్లోహమాస్తే పూర్వవదావృతః

అమ్మాయిని దేవకి పక్కలో ఉంచుకుని తన సంకెళ్ళను తాను కట్టుకున్నాడు. 

యశోదా నన్దపత్నీ చ జాతం పరమబుధ్యత
న తల్లిఙ్గం పరిశ్రాన్తా నిద్రయాపగతస్మృతిః

యశొదకు ప్రసవించానని తెలుసు కానీ ఆ  ప్రసవ వేదనలో అలసటలో పుట్టినది ఆడ బిడ్డా మగ బిడ్డా అని తెలియలేదు. ఆమెకు స్మృతి పోయి ఉంది. 
                                                            సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 

Popular Posts