Followers

Wednesday 9 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఇరవైమూడవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తవన్తం పురుషం పురాతనం మహానుభావోऽఖిలసాధుసమ్మతః
బద్ధాఞ్జలిర్బాష్పకలాకులేక్షణో భక్త్యుత్కలో గద్గదయా గిరాబ్రవీత్

ఇంత స్పష్టముగా చెప్పిన స్వామితో మహానుభావుడైన, లోకములో ఉన్న సజ్జనులందరికీ సమ్మతుడైన బలి చక్రవర్తి చేతులు జోడించి ఆనందబాష్పాలతో గద్గమైన కంఠముతో ఇలా అన్నాడు

శ్రీబలిరువాచ
అహో ప్రణామాయ కృతః సముద్యమః ప్రపన్నభక్తార్థవిధౌ సమాహితః
యల్లోకపాలైస్త్వదనుగ్రహోऽమరైరలబ్ధపూర్వోऽపసదేऽసురేऽర్పితః

లోకపాలకులకు కూడా లభించని నీ అనుగ్రహం నీచుడనీ రాక్షసుడని ఐన నాకు లభించింది. ఒక్క సారి దండం పెడితే ఇంత లాభమా. ఆ ఒక్క నమస్కారం చేయడానికి చేసిన ప్రయత్నం ఆశ్రయించిన భక్తులకు కావలసిన వాటిని కూర్చడములో సత్ప్రయత్నమయ్యింది. అటువంటి దయ నాకిచ్చావు

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త్వా హరిమానత్య బ్రహ్మాణం సభవం తతః
వివేశ సుతలం ప్రీతో బలిర్ముక్తః సహాసురైః

ఈ మాట చెప్పి, రుద్రునితో ఉన్న బ్రహ్మకు నమస్కరించి, విడుదల చేయబడి సుతల లోకానికి ప్రయాణం చేసాడు

ఏవమిన్ద్రాయ భగవాన్ప్రత్యానీయ త్రివిష్టపమ్
పూరయిత్వాదితేః కామమశాసత్సకలం జగత్

ఇంద్రలోకాన్ని ఇంద్రునికి మళ్ళీ ఇచ్చి అథితి కోరికను తీర్చి సకల జగత్తునూ శాసించాడు

లబ్ధప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిమ్
నిశామ్య భక్తిప్రవణః ప్రహ్రాద ఇదమబ్రవీత్

అనుగ్రహం పొందీ, బంధం నుండి విడువడిన బలి చక్రవర్తిని చూచిన ప్రహ్లాదుడు స్వామిని స్తోత్రం చేసాడు

శ్రీప్రహ్రాద ఉవాచ
నేమం విరిఞ్చో లభతే ప్రసాదం న శ్రీర్న శర్వః కిముతాపరేऽన్యే
యన్నోऽసురాణామసి దుర్గపాలో విశ్వాభివన్ద్యైరభివన్దితాఙ్ఘ్రిః

ఇంత దయ ఎపుడైన బ్రహ్మ శివుడు, లక్ష్మీ అమ్మవారూ ఎవరూ పొందలేదు. నీవు రాక్షసులకు దుర్గ పాలకుడవు (క్షేత్ర పాలకుడవు) అయ్యావు. సకల ప్రపంచము చేత నమస్కరించబడే వారి చేత నమస్కరించబడే పాదపద్మములు కల నీవు మాకు దుర్గపాలకుడవయ్యావు. ఈ అనుగ్రహం ఎవరికి లభిస్తుంది.

యత్పాదపద్మమకరన్దనిషేవణేన
బ్రహ్మాదయః శరణదాశ్నువతే విభూతీః
కస్మాద్వయం కుసృతయః ఖలయోనయస్తే
దాక్షిణ్యదృష్టిపదవీం భవతః ప్రణీతాః

నీ పాద పద్మ మకరందాన్ని సేవించడముతో బ్రహ్మాదులు ఇతర లోకములను రక్షిస్తున్నారు. మా పరంపరే దుష్ట పరంపర. దుర్మార్గులమూ దుష్టులమైన మా మీద అనుగ్రహ దృష్టి ప్రసరింపచేసావు. నీ దయ ఏ కారణం చెప్పవచ్చు

చిత్రం తవేహితమహోऽమితయోగమాయా
లీలావిసృష్టభువనస్య విశారదస్య
సర్వాత్మనః సమదృశోऽవిషమః స్వభావో
భక్తప్రియో యదసి కల్పతరుస్వభావః

నీ సంకల్పం బహు విచిత్రం. అంతులేని యోగ మాయా లీలతో ప్రపంచాన్ని సృష్టించావు. నీవు సర్వాత్ముడవు సమ దృష్టి కలవాడవు, విషమ స్వాభవం కలవాడవు, నీవు భక్తులకు ప్రియుడవు కల్పవృక్షము వంటి వాడవు. అడిగిన వారికి ఇవ్వడం కల్పవృక్షానికి పక్షపాతం కాదు. అది కల్పవృక్ష స్వభావం

శ్రీభగవానువాచ
వత్స ప్రహ్రాద భద్రం తే ప్రయాహి సుతలాలయమ్
మోదమానః స్వపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ

నీకు మేలు కలుగుతుంది, నీవు కూడా అక్కడకే వెళ్ళి నీ పౌత్రునితో కలిసి సంతోషించి అక్కడే ఉండు. అక్కడ నిత్యం గద పట్టుకుని ఉన్న నన్ను చూస్తూ ఉండు

నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాపాణిమవస్థితమ్
మద్దర్శనమహాహ్లాద ధ్వస్తకర్మనిబన్ధనః

నిరంతర నన్ను దర్శించుట చే నీవు చేసిన అన్ని కర్మల పాపాలూ బంధములూ తొలగిపోతాయి. అక్కడికి వెళ్ళు.

శ్రీశుక ఉవాచ
ఆజ్ఞాం భగవతో రాజన్ప్రహ్రాదో బలినా సహ
బాఢమిత్యమలప్రజ్ఞో మూర్ధ్న్యాధాయ కృతాఞ్జలిః

పరమాత్మ యొక్క ఆజ్ఞ్యను శిరస్సున ధరించి చేతులు జోడించి బలి చక్రవర్తితో కలిసి శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణం చేసి 

పరిక్రమ్యాదిపురుషం సర్వాసురచమూపతిః
ప్రణతస్తదనుజ్ఞాతః ప్రవివేశ మహాబిలమ్

సర్వ రాక్షస అధిపతి అయిన ప్రహ్లాదుడు ఆ మహాబిలానికి వెళ్ళాడు

అథాహోశనసం రాజన్హరిర్నారాయణోऽన్తికే
ఆసీనమృత్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినామ్

ఆ తరువాత నారాయణుడు శుక్రాచార్యునితో అంటున్నాడు. బ్రహ్మవాదులైన అందరి దగ్గరా కూర్చున్న శుక్రాచార్యునితో 

బ్రహ్మన్సన్తను శిష్యస్య కర్మచ్ఛిద్రం వితన్వతః
యత్తత్కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్

నీ శిష్యుని యొక్క ఈ కర్మను పూర్తి చేయి. కర్మలో ఏమైనా లోపమైతే నీవంటి బ్రాహ్మణోత్తములు చూస్తే ఆ లోపం పోతుంది. యజ్ఞ్యం పూర్తి చేయి


శ్రీశుక్ర ఉవాచ
కుతస్తత్కర్మవైషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్
యజ్ఞేశో యజ్ఞపురుషః సర్వభావేన పూజితః

కర్మాధిపతి ఐన యజ్ఞేశుడవైన నిన్ను అన్ని భావములతో బలి చక్రవర్తి పూజించాడు. మంత్ర తన్ర దేశ కాల వస్తు లోపాలన్నీ నీ నా సంకీర్తన సరిచేస్తుంది.

మన్త్రతస్తన్త్రతశ్ఛిద్రం దేశకాలార్హవస్తుతః
సర్వం కరోతి నిశ్ఛిద్రమనుసఙ్కీర్తనం తవ

తథాపి వదతో భూమన్కరిష్యామ్యనుశాసనమ్
ఏతచ్ఛ్రేయః పరం పుంసాం యత్తవాజ్ఞానుపాలనమ్

 నీ నామ సంకీర్తన లోపాలని పూర్తి చేస్తుంది. అటువంటిది నీవే వచ్చావు.నీవు ఆజ్ఞ్యాపించావు కాబట్టి నీ ఆజ్ఞ్యను పరిపాలిస్తాను. పురుషులకు నీ ఆజ్ఞ్యాపాలనమే ఉత్తం శ్రేయస్సు. 

శ్రీశుక ఉవాచ
ప్రతినన్ద్య హరేరాజ్ఞాముశనా భగవానితి
యజ్ఞచ్ఛిద్రం సమాధత్త బలేర్విప్రర్షిభిః సహ

శుక్రాచార్యులు పరమాత్మ ఆజ్ఞ్యను అభినందించి బలిచక్రవర్తి యొక్క యజ్ఞ్య విఘ్నాన్ని అందరితో కలిసి పూర్తిచేసాడు. 

ఏవం బలేర్మహీం రాజన్భిక్షిత్వా వామనో హరిః
దదౌ భ్రాత్రే మహేన్ద్రాయ త్రిదివం యత్పరైర్హృతమ్

ఈ ప్రకారముగా శ్రీమన్నరాయణుడు బలిచక్రవర్తిని యాచించి అన్నగారైన ఇంద్రునికి రాజ్యం ఇచ్చాడు

ప్రజాపతిపతిర్బ్రహ్మా దేవర్షిపితృభూమిపైః
దక్షభృగ్వఙ్గిరోముఖ్యైః కుమారేణ భవేన చ

బ్రహ్మ సనకాదులూ కుమారస్వామీ దక్షుడు శంకరుడూ కశ్యపులూ మొదలైన వారు వామనున్ని ఆధిపత్యాభిషేకం చేసారు. సకల లోకాధిపతిగా వామనున్ని అభిషేకించారు పరమ ప్రీతితో

కశ్యపస్యాదితేః ప్రీత్యై సర్వభూతభవాయ చ
లోకానాం లోకపాలానామకరోద్వామనం పతిమ్

వేదానాం సర్వదేవానాం ధర్మస్య యశసః శ్రియః
మఙ్గలానాం వ్రతానాం చ కల్పం స్వర్గాపవర్గయోః

సకల ప్రాణుల హితం కోసం సర్వ లోకాధిపత్యాభిషేకం చేసారు.

ఉపేన్ద్రం కల్పయాం చక్రే పతిం సర్వవిభూతయే
తదా సర్వాణి భూతాని భృశం ముముదిరే నృప

ఇదే ఉపేంద్ర పట్టాభిషేకం. ఉపేంద్ర అంటే ఇంద్రునికి తమ్ముడు అన్న అర్థం వచ్చినా, ఉపరి ఇంద్రః ఉపేంద్ర.ఇతన్ని సకల విభూతులకూ లోకములకూ అభిషేకం చేసారు. అపుడు అన్ని ప్రాణులూ సంతోషించాయి

తతస్త్విన్ద్రః పురస్కృత్య దేవయానేన వామనమ్
లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణా చానుమోదితః


అపుడు ఇంద్రుడు అథితి కశ్యపుల, లోకపాలకుల అనుమతి తీసుకుని స్వర్గానికి తీసుకుని వెళ్ళి పాలించమని అడిగాడు. అతని భుజపాలుడైన ఇంద్ర్డికి దైన్యం భయం పోయి సంతోషించాడు

ప్రాప్య త్రిభువనం చేన్ద్ర ఉపేన్ద్రభుజపాలితః
శ్రియా పరమయా జుష్టో ముముదే గతసాధ్వసః

బ్రహ్మా శర్వః కుమారశ్చ భృగ్వాద్యా మునయో నృప
పితరః సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చ యే

బ్రహ్మాదులందరూ పరమాత్మ అత్యద్భుతమైన కార్యాన్ని గానం చేస్తూ తమ తమ లోకాలకు వెళ్ళారు. అథితిని అందరూ స్తోత్రం చేసారు

సుమహత్కర్మ తద్విష్ణోర్గాయన్తః పరమద్భుతమ్
ధిష్ణ్యాని స్వాని తే జగ్మురదితిం చ శశంసిరే

సర్వమేతన్మయాఖ్యాతం భవతః కులనన్దన
ఉరుక్రమస్య చరితం శ్రోతౄణామఘమోచనమ్

ఇదంతా నేను చెప్పాను. వినే వారి పాపాలను ఇది పోగొడుతుంది

పారం మహిమ్న ఉరువిక్రమతో గృణానో
యః పార్థివాని విమమే స రజాంసి మర్త్యః
కిం జాయమాన ఉత జాత ఉపైతి మర్త్య
ఇత్యాహ మన్త్రదృగృషిః పురుషస్య యస్య

పరమాత్మ మహిమ ఇది అని చెప్పదలచుకున్నవాడు భూమి యొక్క రేనువులను లెక్కపెట్టాలని అనుకున్నవాడితో సమానం. పుట్టినవాడూ పుట్టబోయేవాడూ పుట్టి ఉన్నవాడు గానీ పరమాత్మ మహిమను పూర్తిగా తెలుసుకోగలడా. మంత్ర దృష్టి గల ఋషులు ఈ విషయం చెప్పారు

య ఇదం దేవదేవస్య హరేరద్భుతకర్మణః
అవతారానుచరితం శృణ్వన్యాతి పరాం గతిమ్

అద్భుత కర్మలు చేసే ఉత్తమ పురుషుడైన దేవ దేవుడైన పరమాత్మ యొక్క ఈ చైత్రను వింటే ఉత్తమ గతిని పొందుతారు

క్రియమాణే కర్మణీదం దైవే పిత్ర్యేऽథ మానుషే
యత్ర యత్రానుకీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః

యజ్ఞ్య యాగాలలో ఉత్సవాలలో పితృ కర్మలలో ఈ వామన చరితాన్ని కీర్తన చేసే పితృ దేవతలూ దేవతలూ బంధువులూ అందరూ దీన్ని అదృష్టముగా భావిస్తారు. ఇదే పుణ్యం. ఆయా కర్మలలో వామన చరిత్ర గానం చేయడం పుణ్యం.

Popular Posts