Followers

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదకొండవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
భగవానాత్మనాత్మానం రామ ఉత్తమకల్పకైః
సర్వదేవమయం దేవమీజేऽథాచార్యవాన్మఖైః

రామచంద్రుడు అనేకమైన యజ్ఞ్యములు గురువుగారితో చేసాడు 

హోత్రేऽదదాద్దిశం ప్రాచీం బ్రహ్మణే దక్షిణాం ప్రభుః
అధ్వర్యవే ప్రతీచీం వా ఉత్తరాం సామగాయ సః

రాజు యజ్ఞ్యం చేస్తే తన రాజ్యం మొత్తాన్ని యజ్ఞ్యం చేయించిన వారికి ఇవ్వాలి. హోతకు తూర్పు, బ్రహ్మకు దక్షిణ, పశ్చిమ దిక్కును అధ్వర్యుకు, ఉద్గీతకు ఉత్తర దిక్కునూ మిగిలిన దాన్ని గురువుగారికీ ఇచ్చాడు. ఆశలేని బ్రాహ్మణుడే సకల భూమండలాన్నీ పరిపాలించదగినవాడు అన్న భావముతో రాముడు రాజ్యాన్ని ఇచ్చాడు 

ఆచార్యాయ దదౌ శేషాం యావతీ భూస్తదన్తరా
అన్యమాన ఇదం కృత్స్నం బ్రాహ్మణోऽర్హతి నిఃస్పృహః

ఇత్యయం తదలఙ్కార వాసోభ్యామవశేషితః
తథా రాజ్ఞ్యపి వైదేహీ సౌమఙ్గల్యావశేషితా

ఒంటి మీద బట్టలూ ఆభరణాలూ తప్ప మొత్తమిచ్చివేసాడు. సీతమ్మ కూడా ఒక్క మాంగళ్యం ఉంచుకొని తక్కినవన్నీ దానం చేసింది 

తే తు బ్రాహ్మణదేవస్య వాత్సల్యం వీక్ష్య సంస్తుతమ్
ప్రీతాః క్లిన్నధియస్తస్మై ప్రత్యర్ప్యేదం బభాషిరే

రాముని యొక్క బ్రాహ్మణ భక్తికి ప్రీతిచెంది వాత్సల్యముతో నిండిపోయి ఆ భూమిని మరలా రామునికే ఇచ్చారు. 

అప్రత్తం నస్త్వయా కిం ను భగవన్భువనేశ్వర
యన్నోऽన్తర్హృదయం విశ్య తమో హంసి స్వరోచిషా

మాకెందుకు ఈ భూమి అది నీవే తీసుకో. నీవు మాకు ఏమి ఇవ్వలేదని? నీవు మాకు అన్నీ ఇచ్చావు. ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నావు

నమో బ్రహ్మణ్యదేవాయ రామాయాకుణ్ఠమేధసే
ఉత్తమశ్లోకధుర్యాయ న్యస్తదణ్డార్పితాఙ్ఘ్రయే

ఇది రాముని మంత్రం. బ్రాహ్మణులంటే ప్రీతి గలవాడు, మొక్కవోని మేధస్సు కలవాడు, పొరబాటు చేయని వాడు , మహానుభావుల చేత గానం చేయబడే వారిలో మొదటివాడు , దండమును వదిలిపెట్టినవాడు, 

కదాచిల్లోకజిజ్ఞాసుర్గూఢో రాత్ర్యామలక్షితః
చరన్వాచోऽశృణోద్రామో భార్యాముద్దిశ్య కస్యచిత్

ఈయన లోకం తన గురించి ఏమనుకుంటోందో అని తెలుసుకోవడానికి రాత్రిపూట మారువేషముతో నగరమంతా తిరుగుతూ, తన భార్య  గురించి ఎవరో మాట్లాడిన మాటలను స్వయముగా విన్నాడు 

నాహం బిభర్మి త్వాం దుష్టామసతీం పరవేశ్మగామ్
స్త్రైణో హి బిభృయాత్సీతాం రామో నాహం భజే పునః

ఇతరుల ఇంటిలో ఉన్న దుష్టురాలివైన నిన్ను నేను మళ్ళీ స్వీకరించను, స్త్రీవ్యామోహం గల రాముడు వరించాడేమో గానీ నేను వరించను అని విన్నాడు

ఇతి లోకాద్బహుముఖాద్దురారాధ్యాదసంవిదః
పత్యా భీతేన సా త్యక్తా ప్రాప్తా ప్రాచేతసాశ్రమమ్

ఎంత జాగ్రత్తగా ఉన్న ఆరాధించడానికి వీలు గాని లోకము నుండి విన్న ఈ మాటని విని లోకాపవాదుకు భయపడి వాల్మీకి ఆశ్రమములో విడిచిపెట్టాడు. అక్కడ లవ కుశ అనే ఇద్దరు పుత్రులను సీతమ్మ కన్నది

అన్తర్వత్న్యాగతే కాలే యమౌ సా సుషువే సుతౌ
కుశో లవ ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియా మునిః

అఙ్గదశ్చిత్రకేతుశ్చ లక్ష్మణస్యాత్మజౌ స్మృతౌ
తక్షః పుష్కల ఇత్యాస్తాం భరతస్య మహీపతే

లక్ష్మణ స్వామి కూడా ఇద్దరు కుమారులను పొందాడు. అంగద చిత్రకేతువు అన్న పేర్లతో.  

సుబాహుః శ్రుతసేనశ్చ శత్రుఘ్నస్య బభూవతుః
గన్ధర్వాన్కోటిశో జఘ్నే భరతో విజయే దిశామ్

తక్ష పుష్కల అని భరతునికి,సుబాహూ శృతసేన అని శతృఘ్నుడికీ ఒక సంధర్భములో గంధర్వులు మధించి బాధపెడుతున్నారని విన్న రాముడు భరతున్ని ఆజ్ఞ్యాపించగా కొన్ని కోట్ల మంది గంధర్వులను (ఈ గాధ అంతా విష్ణు ధర్మోత్తర పురాణములో ఉంది)

తదీయం ధనమానీయ సర్వం రాజ్ఞే న్యవేదయత్
శత్రుఘ్నశ్చ మధోః పుత్రం లవణం నామ రాక్షసమ్
హత్వా మధువనే చక్రే మథురాం నామ వై పురీమ్

ఆ ధనమంతా తెచ్చి రామచంద్రునికి అర్పించాడు. శత్రుఘ్నుడు మధుపుత్రుడైన లవణాసురున్ని సంహరించి మధురానగరాన్ని నిర్మించుకుని అక్కడ రాజ్యపాలన చేసాడు

మునౌ నిక్షిప్య తనయౌ సీతా భర్త్రా వివాసితా
ధ్యాయన్తీ రామచరణౌ వివరం ప్రవివేశ హ

సీతమ్మ పుత్రులను రామునికి అప్పగించి తాను పాతాళానికి వెళ్ళిపోయింది 

తచ్ఛ్రుత్వా భగవాన్రామో రున్ధన్నపి ధియా శుచః
స్మరంస్తస్యా గుణాంస్తాంస్తాన్నాశక్నోద్రోద్ధుమీశ్వరః

ఈ వార్త వాల్మీకి ద్వారా విన్న రాముడు ఉబికి వస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకుని మనసులో బాధను అరికట్టుకుని ఉన్నాడు. ఆడా మగా పెళ్ళీ సంసారం అంటే చివరకు మిగిలేది ఇలాంటి ఏడుపే అని చెప్పడానికి తాను ఏడ్చాడు. అక్కడ భయమూ దుఃఖమూ తప్ప మరేమీ ఉండవు. పరమాత్మకే తప్పకుంటే మామూలు మనషుల సంగతి వేరే చెప్పాలా. బ్రహ్మచర్యాన్ని ధరించి ఎన్నో యజ్ఞ్యాలు చేసాడు. పదమూడు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసాడు.  

స్త్రీపుంప్రసఙ్గ ఏతాదృక్సర్వత్ర త్రాసమావహః
అపీశ్వరాణాం కిముత గ్రామ్యస్య గృహచేతసః

తత ఊర్ధ్వం బ్రహ్మచర్యం ధార్యన్నజుహోత్ప్రభుః
త్రయోదశాబ్దసాహస్రమగ్నిహోత్రమఖణ్డితమ్

స్మరతాం హృది విన్యస్య విద్ధం దణ్డకకణ్టకైః
స్వపాదపల్లవం రామ ఆత్మజ్యోతిరగాత్తతః

దండకారణ్యములో తిరిగినపుడు తన కాలిలో గుచ్చుకున్న ముళ్ళను భక్తుల హృదయములో గుచ్చి ఆయన వెళ్ళిపోయాడు. తన దివ్య స్థానాన్ని తాను చేరాడు. 

నేదం యశో రఘుపతేః సురయాచ్ఞయాత్త
లీలాతనోరధికసామ్యవిముక్తధామ్నః
రక్షోవధో జలధిబన్ధనమస్త్రపూగైః
కిం తస్య శత్రుహననే కపయః సహాయాః

యస్యామలం నృపసదఃసు యశోऽధునాపి
గాయన్త్యఘఘ్నమృషయో దిగిభేన్ద్రపట్టమ్
తం నాకపాలవసుపాలకిరీటజుష్ట
పాదామ్బుజం రఘుపతిం శరణం ప్రపద్యే

అంత పెద్ద సముద్రాన్ని వారధి కట్టినవాడు, రావణాసురున్ని చంపినవాడు. చిన్న ఆయుధముతో కుంభకర్ణున్ని చంపినవాడు. ఇవన్నీ చేసినవాడికి వానర సహాయం నిజముగా కావాలా. ఇదంతా మనకు తన వాత్సల్యాన్ని చూపడానికి చేసాడు. వానరుల సాయముతో రావణాసురున్ని చంపాడు అన్న దానిని కీర్తిగా స్వీకరించాడు ఇప్పటికీ రాముని యొక్క కీర్తి ప్రతీ రాజుల సభలో ఇంటిలో క్షేత్రములో ఋషుల ఆశ్రములో లోకాలలో గానం చేయబడుతోంది. ఇది పాపాలను పోగొడుతుంది. 

ఇంద్ర కుబేరాదుల కిరీటములతో అలంకరించబడిన రాముని పాదాలను శరణం వేడుతున్నాము. 


స యైః స్పృష్టోऽభిదృష్టో వా సంవిష్టోऽనుగతోऽపి వా
కోసలాస్తే యయుః స్థానం యత్ర గచ్ఛన్తి యోగినః

రామున్ని ముట్టుకున్నవారూ రాముడు ముట్టుకున్నవారూ రాముణ్ణి చూచిన వారు రాముని చేత చూడబడీన ఆరు రాముని వెంట ఉన్నవారూ నడచిన వారు ఐన కోసల దేశ వాసులందరూ అన్ని ప్రాణులూ ఆయన వెంట వైకుంఠానికి వెళ్ళాయి. యోగులు వెళ్ళే ఆ లోకానికి వెళ్ళారు
తానాచరించే అన్ని రకముల కర్మ బంధములు పోవాలంటే ప్రతీవారూ రామ చరితాన్ని వినాలి

పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్
ఆనృశంస్యపరో రాజన్కర్మబన్ధైర్విముచ్యతే

శ్రీరాజోవాచ
కథం స భగవాన్రామో భ్రాత్న్వా స్వయమాత్మనః
తస్మిన్వా తేऽన్వవర్తన్త ప్రజాః పౌరాశ్చ ఈశ్వరే

ఎవరూ చెప్పగా వినలేదు. లోకములో అన్నాదమ్ములకు తల్లీ కొడుకులకూ తండ్రీ కొడుకులకూ పడదు. అలాంటిది రాముని విషయములో అందరూ ఏకముఖముగా అందరూ ఆయనను ఎలా ప్రేమించారు 

శ్రీబాదరాయణిరువాచ
అథాదిశద్దిగ్విజయే భ్రాత్ంస్త్రిభువనేశ్వరః
ఆత్మానం దర్శయన్స్వానాం పురీమైక్షత సానుగః

ఆసిక్తమార్గాం గన్ధోదైః కరిణాం మదశీకరైః
స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాం వా సుతరామివ

రామచంద్రుడు రాజ్యం స్వీకరించిన తరువాత అన్ని దిక్కులనూ గెలవడానికి ఆయా దిక్కులకు తమ్ములను పంపాడు. వారు వెళ్ళీ అన్ని గెలిచి తిరిగి వచ్చారు. వారు తిరిగి వస్తున్న విషయం తెలిసిన ఊరి వారందరూ ముత్యాల ముగ్గులు వేసి సుగంధ ద్రవ్యాలు చల్లీ పుష్పాలూ పేలాలూ చల్లారు

ప్రాసాదగోపురసభా చైత్యదేవగృహాదిషు
విన్యస్తహేమకలశైః పతాకాభిశ్చ మణ్డితామ్

పూగైః సవృన్తై రమ్భాభిః పట్టికాభిః సువాససామ్
ఆదర్శైరంశుకైః స్రగ్భిః కృతకౌతుకతోరణామ్

బంగారు చెంబులతో తోరణాలతో అలంకరించి మంచి వస్త్రాలు ధరించి, ప్రతీ స్తంభానికి అద్దాలు పెట్టారు రామున్ని అద్దములోనైనా చూడటానికి

తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణపాణయః
ఆశిషో యుయుజుర్దేవ పాహీమాం ప్రాక్త్వయోద్ధృతామ్

ప్రజలందరూ కానుకలు తీసుకుని వచ్చారు. నీవే ఈ భూమిని కాపాడాలి. ఇంతకు ముందు ఈభూమిని నీవే సముద్రం నుండి ఉద్ధరించావు అని అన్నారు

తతః ప్రజా వీక్ష్య పతిం చిరాగతం దిదృక్షయోత్సృష్టగృహాః స్త్రియో నరాః
ఆరుహ్య హర్మ్యాణ్యరవిన్దలోచనమతృప్తనేత్రాః కుసుమైరవాకిరన్

స్త్రీలూ పురుషులూ బాలురూ పూలతో స్వాగతం చెప్పారు. ఇలా తన అంతఃపురానికి స్వామి చేరగా

అథ ప్రవిష్టః స్వగృహం జుష్టం స్వైః పూర్వరాజభిః
అనన్తాఖిలకోషాఢ్యమనర్ఘ్యోరుపరిచ్ఛదమ్

విద్రుమోదుమ్బరద్వారైర్వైదూర్యస్తమ్భపఙ్క్తిభిః
స్థలైర్మారకతైః స్వచ్ఛైర్భ్రాజత్స్ఫటికభిత్తిభిః

అక్కడి గోడలూ గదులూ అలంకారాలూ ధూప దీపాలు అలంకరించుకున్న స్త్రీపురుషులూ 

చిత్రస్రగ్భిః పట్టికాభిర్వాసోమణిగణాంశుకైః
ముక్తాఫలైశ్చిదుల్లాసైః కాన్తకామోపపత్తిభిః

ధూపదీపైః సురభిభిర్మణ్డితం పుష్పమణ్డనైః
స్త్రీపుమ్భిః సురసఙ్కాశైర్జుష్టం భూషణభూషణైః

సీతమ్మతో కలిసి ఉన్న రాముడు అప్పుడు ఎప్పుడూ ధర్మమునకు భంగం రాని విధముగా అన్ని భోగాలనూ అనుభవించాడు. అందరూ రామున్ని ప్రేమించడానికి ఇదే కారణం

తస్మిన్స భగవాన్రామః స్నిగ్ధయా ప్రియయేష్టయా
రేమే స్వారామధీరాణామృషభః సీతయా కిల

బుభుజే చ యథాకాలం కామాన్ధర్మమపీడయన్
వర్షపూగాన్బహూన్నౄణామభిధ్యాతాఙ్ఘ్రిపల్లవః

ఎవరికీ కొరతలేకుండా చేసాడు కాబట్టి రామున్ని అందరూ ప్రేమించారు. ధర్మ వ్యతికరం కాని భోగానుభవం కలిగి ఉండాలి మనం కూడా.
ఇలా పదమూడు వేల సంవత్సరాలు రాజ్యపాలన గావించాడు

Popular Posts