Followers

Saturday 26 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఏడవ అధ్యాయం


    ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
కేశీ తు కంసప్రహితః ఖురైర్మహీం
మహాహయో నిర్జరయన్మనోజవః
సటావధూతాభ్రవిమానసఙ్కులం
కుర్వన్నభో హేషితభీషితాఖిలః

కేశి తన గిట్టలతో భూమిని తవ్వుతూ మనోవేగముతో జూలును ఒకసారి ఊపి ఆకాశములో మేఘ మండలమును చెల్లచెదురు చేస్తూ గుర్రపు సకిలింపుతో అందరినీ భయపెడుతూ విశాల నేత్రముతో పెద్ద దంతములతో నోరు బాగా తెరచి పెద్ద మెడతో పెద్దగా నల్లగా ఉన్నవాడు కంసునికి హితం చేయగోరి నంద వ్రజాన్ని వణికిస్తూ వెళ్ళాడు

తం త్రాసయన్తం భగవాన్స్వగోకులం
తద్ధేషితైర్వాలవిఘూర్ణితామ్బుదమ్
ఆత్మానమాజౌ మృగయన్తమగ్రణీర్
ఉపాహ్వయత్స వ్యనదన్మృగేన్ద్రవత్

స తం నిశామ్యాభిముఖో మఖేన ఖం
పిబన్నివాభ్యద్రవదత్యమర్షణః
జఘాన పద్భ్యామరవిన్దలోచనం
దురాసదశ్చణ్డజవో దురత్యయః

కృష్ణుడు ఎక్కడ ఉన్నడో వెతుక్కుంటూ వెళుతున్న వాడితో సింహములా గర్జిస్తూ నేను ఇక్కడే ఉన్నాను రమ్మన్నాడు కృష్ణుడు. అది చూసి ఆవేశముగా కాళ్ళతో కృష్ణున్ని తన్నడానికి ప్రయత్నించగా

తద్వఞ్చయిత్వా తమధోక్షజో రుషా ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః
సావజ్ఞముత్సృజ్య ధనుఃశతాన్తరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థితః

ఆ కేశి యొక్క ప్రయత్నాన్ని వ్యర్థం చేసి ఏ కాళ్ళతో తన్నబోయాడో ఆ కాళ్ళను రెండు చేతులా పట్టుకుని గరుత్మంతుడు పామును తిప్పినట్లుగా ఈ గుర్రాన్ని స్వామి తిప్పిపడవేసాడు.

సః లబ్ధసంజ్ఞః పునరుత్థితో రుషా
వ్యాదాయ కేశీ తరసాపతద్ధరిమ్
సోऽప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్
ప్రవేశయామాస యథోరగం బిలే

 మళ్ళీ బలం పుంజుకుని వేగముగా మళ్ళీ వచ్చాడు. ఈ సారి నోరు తెరచి వచ్చాడు. ఆ తెరచిన నోటిలో తన  బాహువును పెట్టాడు స్వామి. అలా లోపల పెట్టి, తన చేతిని బాగా పెంచాడు. వెంటనే కేశి కొట్టుకుంటూ మలం వదిలిపెడుతూ ప్రాణం విడిచాడు.

దన్తా నిపేతుర్భగవద్భుజస్పృశస్
తే కేశినస్తప్తమయస్పృశో యథా
బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో
యథామయః సంవవృధే ఉపేక్షితః

వాడి పళ్ళన్నీ రాలి కిందపడ్డాయి. కడుపులో పెట్టిన శిశువు పెరిగినట్లు కేశి నోట్లో పెట్టిన చేయి కూడా పెరిగింది. దానితో గాలి ఆగిపోయింది, కాళ్ళు కొట్టుకుంటూ, కళ్ళు కాస్తా తిరిగిపోయి, మలాన్ని వదిలిపెడుతూ కిందపడిపోయి ప్రాణం విడిచాడు.

సమేధమానేన స కృష్ణబాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ్చ విక్షిపన్
ప్రస్విన్నగాత్రః పరివృత్తలోచనః పపాత లణ్డం విసృజన్క్షితౌ వ్యసుః

తద్దేహతః కర్కటికాఫలోపమాద్వ్యసోరపాకృష్య భుజం మహాభుజః
అవిస్మితోऽయత్నహతారికః సురైః ప్రసూనవర్షైర్వర్షద్భిరీడితః

అతని దేహం నుంచి తన చేతిని మళ్ళీ వెనక్కు లాకున్నాడు. దేవతలు కృష్ణుని మీద పుష్ప వర్షం కురిపించాడు.

ఇక్కడ అశ్వం అంటే ఇంద్రియం. నోరు అంటే రసనేంద్రియం. నోటిని జాగ్రత్తగా ఉంచుకుంటే మనం బాగుపడతాము. అందుకే నోటిని చేత్తో తిప్పాడు. అంటే కర్మతోనే ఇంద్రియాలను జయించాలి. ఆహారముతో (అనుభవముతో ) ప్రయత్నిస్తే నరకానికి వెళతాము.

దేవర్షిరుపసఙ్గమ్య భాగవతప్రవరో నృప
కృష్ణమక్లిష్టకర్మాణం రహస్యేతదభాషత

ఇది జరిగిన వెంట నారదుడు వచ్చి పరమాత్మను రహస్యముగా కలిసాడు.

కృష్ణ కృష్ణాప్రమేయాత్మన్యోగేశ జగదీశ్వర
వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో

కృష్ణ కృష్ణా! నీవే సకల ప్రాణులకూ ఆత్మ, నీవే ఒక్కడవే జ్యోతివి, నీవే అంతర్యామిగా రహస్యముగా ప్రతీ వారి హృదయములో ఉంటావు.

త్వమాత్మా సర్వభూతానామేకో జ్యోతిరివైధసామ్
గూఢో గుహాశయః సాక్షీ మహాపురుష ఈశ్వరః

నీవే సర్వ సాక్షివీ మహాపురుషుడవు, సకల జగన్నియంతవు.నిన్ను నీవే ఆశ్రయించుకుని మాయతో మూడు గుణాలను (ప్రకృతినీ) సృష్టించావు, దానితో జగతును సృష్టించి రక్షించి సంహరిస్తున్నావు

ఆత్మనాత్మాశ్రయః పూర్వం మాయయా ససృజే గుణాన్
తైరిదం సత్యసఙ్కల్పః సృజస్యత్స్యవసీశ్వరః

స త్వం భూధరభూతానాం దైత్యప్రమథరక్షసామ్
అవతీర్ణో వినాశాయ సాధునాం రక్షణాయ చ

భూమికి భారం కలిగించే దైత్యుల నాశానికి అవతరించావు, ధర్మ మర్యాదను కాపాడడానికి వచ్చావు

దిష్ట్యా తే నిహతో దైత్యో లీలయాయం హయాకృతిః
యస్య హేషితసన్త్రస్తాస్త్యజన్త్యనిమిషా దివమ్

ఈ కేశిని నీవు లీలగా వధించావు అదృష్టవశాత్తు, ఇతను గట్టిగా సకిలిస్తే దేవతలు రాత్రి కూడా పగటిలా చూస్తారు (నిదురపోరు)

చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినమ్
కంసం చ నిహతం ద్రక్ష్యే పరశ్వోऽహని తే విభో

ఎల్లుండి ముష్టికున్నీ చాణూరున్నీ మల్లులనూ మావటి వాడినీ ఏనుగునూ కంసున్నీ నీవు చంపగా నేను చూస్తాను.

తస్యాను శఙ్ఖయవన మురాణాం నరకస్య చ
పారిజాతాపహరణమిన్ద్రస్య చ పరాజయమ్

దాని తరువాత శంఖ యవన ముర నరకులను సంహరించి పారిజాతాన్ని అపహరించి ఇంద్రుని గర్వాన్ని అణుస్తావు

ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణమ్
నృగస్య మోక్షణం శాపాద్ద్వారకాయాం జగత్పతే

వీర్యశుల్కలైన వీర కన్యలను వరిస్తావు, పదహారువేల మందిని వివాహం చేసుకుంటావు. నృగుడికి విముక్తినిస్తావు

స్యమన్తకస్య చ మణేరాదానం సహ భార్యయా
మృతపుత్రప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః

శమంతకమణిని తీసుకుని భార్యతో సహా, బ్రాహ్మణునికి చనిపోయిన పుత్రులను తెచ్చి వారికి ఇస్తావు.

పౌణ్డ్రకస్య వధం పశ్చాత్కాశిపుర్యాశ్చ దీపనమ్
దన్తవక్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ

పౌండ్రక సంహారం, కాశీ దహనం, శిశుపాల దంతవక్త్ర సంహారం.

యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్భవాన్
కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి

నీవు ద్వారకా నగరములో ఉంటూ చేసే అనేక పవిత్ర గాధలను నేను చూస్తాను, నీవు చేస్తావు. ఆ చరితాలను కవులు గానం చేస్తారు

అథ తే కాలరూపస్య క్షపయిష్ణోరముష్య వై
అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జునసారథేః

భూభారాన్ని పోగొట్టదలచుకున్న నీవు అర్జనునికి సారధిగా ఉండి పద్దెనిమిద్ అక్షౌహిణీల సైన్యాన్ని వధిస్తావు.

విశుద్ధవిజ్ఞానఘనం స్వసంస్థయా
సమాప్తసర్వార్థమమోఘవాఞ్ఛితమ్
స్వతేజసా నిత్యనివృత్తమాయా
గుణప్రవాహం భగవన్తమీమహి

నీవు పరిశుద్ధమైన గుణ స్పర్శ లేని విజ్ఞ్యానం ముద్ద గట్టినట్లుగా ఉన్న నీవు అనుకున్న పనులు పూర్తి చేసుకుని సత్య సంకల్పుడవైన నిన్ను నేను సేవిస్తాను

త్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయా వినిర్మితాశేషవిశేషకల్పనమ్
క్రీడార్థమద్యాత్తమనుష్యవిగ్రహం నతోऽస్మి ధుర్యం యదువృష్ణిసాత్వతామ్

నీ మాయతో సకల లోకాలను సృష్టించి రక్షించి సంహరించేవాడవు. విలాసం కోసం క్రీడ కోసం మానవ రూపం ధరించిన నిన్ను చూడగలుగుతున్నాను. యాదవ వంశాన్ని పునీతం చేయడానికి వచ్చిన నిన్ను చూస్తున్నాను

శ్రీశుక ఉవాచ
ఏవం యదుపతిం కృష్ణం భాగవతప్రవరో మునిః
ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవః

పరమ భాగవతుడైన నారదుడు ఇలా చెప్పి నమస్కారం చేసి కృష్ణుని ఆజ్ఞ్య పొంది పరమాత్మను సందార్శించిన పరమానందములో వెళ్ళిపోయాడు

భగవానపి గోవిన్దో హత్వా కేశినమాహవే
పశూనపాలయత్పాలైః ప్రీతైర్వ్రజసుఖావహః

పరమాత్మ కూడా కేశిని సంహరించి వ్రేపల్లె వాసులకు సంతోషాన్ని కలిగింపచేసి కాపాడాడు

ఏకదా తే పశూన్పాలాశ్చారయన్తోऽద్రిసానుషు
చక్రుర్నిలాయనక్రీడాశ్చోరపాలాపదేశతః

ఒక సారి ఆ యమునా నదీ తీరములో దాగుడు మూతలాటలు ఆడుతున్నారు. కొందరు దొంగలు, కొందరు దొరలు. ఇలాంటి ఆటలో. కొందరు మేకలు కొందరు మేకలను కాపాడేవారు

తత్రాసన్కతిచిచ్చోరాః పాలాశ్చ కతిచిన్నృప
మేషాయితాశ్చ తత్రైకే విజహ్రురకుతోభయాః

మయపుత్రో మహామాయో వ్యోమో గోపాలవేషధృక్
మేషాయితానపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్

ఇలా వీళ్ళు ఆటలాడుతుంటే కంసునికి ప్రియమిత్రుడైన మయాసురుడి మిత్రుడైన వ్యోమకాసురుడు కంసునికి ప్రీతి చేయాలనుకుని, చాలా మందిని తీసుకు వెళ్ళి ఒక గుహలో దాచిపెట్టి వస్తున్నాడు. అందరినీ గుహలో పడేసి దానికి పెద్ద రాయి అడ్డముగా పెట్టాడు.

గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసురః
శిలయా పిదధే ద్వారం చతుఃపఞ్చావశేషితాః

తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణః శరణదః సతామ్
గోపాన్నయన్తం జగ్రాహ వృకం హరిరివౌజసా

అది గమనించాడు కృష్ణుడు తోడేలును సింహం పట్టినట్లుగా మరి ఇద్దరు పిల్లలను తీసుకుపోతున్నవాడిని గట్టిగా పట్టుకోగా

స నిజం రూపమాస్థాయ గిరీన్ద్రసదృశం బలీ
ఇచ్ఛన్విమోక్తుమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః

తన గోపాల రూపం తీసి వేసి  తన నిజ రూపం చూపించాడు. కృష్ణుడు పట్టు ఇంకా బిగించాడు. తోసి కింద పడవేసి పశువును చంపినట్లు కాలితో తొక్కి దేవతలందరూ చూస్తుండగా చంపాడు. గుహకు అడ్డుపెట్టిన గుండును సుకుమారముగా కాలితో తన్ని బయటకు తీసాడు.

తం నిగృహ్యాచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే
పశ్యతాం దివి దేవానాం పశుమారమమారయత్

గుహాపిధానం నిర్భిద్య గోపాన్నిఃసార్య కృచ్ఛ్రతః
స్తూయమానః సురైర్గోపైః ప్రవివేశ స్వగోకులమ్

గుహకు అడ్డుగా పెట్టిన గుండును సుకుమారముగా పగలగొట్టి వారందరినీ బయటకు తీసుకు వచ్చాడు. గోపికలూ దేవతలూ అందరూ స్తోత్రం చేస్తుండగా మళ్ళీ గోకులానికి ప్రవేశించాడు.

                                                సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Popular Posts