శ్రీబాదరాయణిరువాచ
పూరోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోऽసి భారత
యత్ర రాజర్షయో వంశ్యా బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే
పూరు (యయాతి కొడుకు) వంశాన్ని విను. నీవు పుట్టింది ఆ వంశములోనే. ఈ పూర్వు వంశములో పుట్టినవారు బ్రహ్మఋషులూ రాజర్షులూ అయ్యారు.
జనమేజయో హ్యభూత్పూరోః ప్రచిన్వాంస్తత్సుతస్తతః
ప్రవీరోऽథ మనుస్యుర్వై తస్మాచ్చారుపదోऽభవత్
పూర్వు పుత్రుడు జనమేజయుడు.
తస్య సుద్యురభూత్పుత్రస్తస్మాద్బహుగవస్తతః
సంయాతిస్తస్యాహంయాతీ రౌద్రాశ్వస్తత్సుతః స్మృతః
ఋతేయుస్తస్య కక్షేయుః స్థణ్డిలేయుః కృతేయుకః
జలేయుః సన్నతేయుశ్చ ధర్మసత్యవ్రతేయవః
దశైతేऽప్సరసః పుత్రా వనేయుశ్చావమః స్మృతః
ఘృతాచ్యామిన్ద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః
ఈ పది మందీ ఘృతాచీ అనే అప్సరస పుత్రులు. ఆత్మకు ఇంద్రియాలులా పది మంది రౌద్రాశ్వునకు కుమారులు
ఋతేయో రన్తినావోऽభూత్త్రయస్తస్యాత్మజా నృప
సుమతిర్ధ్రువోऽప్రతిరథః కణ్వోऽప్రతిరథాత్మజః
కణ్వ మహర్షి అప్రతిరథుని కుమారుడు
తస్య మేధాతిథిస్తస్మాత్ప్రస్కన్నాద్యా ద్విజాతయః
పుత్రోऽభూత్సుమతే రేభిర్దుష్మన్తస్తత్సుతో మతః
వీరందరూ బ్రాహ్మణులయ్యారు
దుష్మన్తో మృగయాం యాతః కణ్వాశ్రమపదం గతః
తత్రాసీనాం స్వప్రభయా మణ్డయన్తీం రమామివ
దుష్యంతుడు వేటకు బయలు దేరి వెళ్ళి కణ్వాశ్రమములో కూర్చుని ఉన్న సౌందర్యరాశిని చూచి దేవమాయను చూచి మోహం పొందినట్లు పొందాడు
విలోక్య సద్యో ముముహే దేవమాయామివ స్త్రియమ్
బభాషే తాం వరారోహాం భటైః కతిపయైర్వృతః
తద్దర్శనప్రముదితః సన్నివృత్తపరిశ్రమః
పప్రచ్ఛ కామసన్తప్తః ప్రహసఞ్శ్లక్ష్ణయా గిరా
ఆమెను చూడగానే అలసట పోయి చక్కని మాటతో నవ్వుతూ, నీవెవరవూ ఎవరి దానవు, ఏమి చేయాలని ఇక్కడ ఉన్నావు, నిన్ను చూస్తే రాజపుత్రికవని అనిపిస్తోంది.
కా త్వం కమలపత్రాక్షి కస్యాసి హృదయఙ్గమే
కిం స్విచ్చికీర్షితం తత్ర భవత్యా నిర్జనే వనే
వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే
న హి చేతః పౌరవాణామధర్మే రమతే క్వచిత్
నీవు క్షత్రియ పుత్రికవే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. పూరు వంశం వారి మనసు అధర్మాన్ని ఆలోచించదు. నేను క్షత్రియున్ని కాబట్టి, నేను మనసు పడ్డానంటే నీవు కూడా క్షత్రియ వంశములోనే పుట్టి ఉంటావు. అధర్మం అన్న ఆలోచనే రాదు.
శ్రీశకున్తలోవాచ
విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా వనే
వేదైతద్భగవాన్కణ్వో వీర కిం కరవామ తే
విశ్వామిత్రునికీ మేనకకూ పుట్టాను. నీవన్నది నిజమే. నన్ను కణ్వ మహర్షి పోషిస్తున్నాడు
ఆస్యతాం హ్యరవిన్దాక్ష గృహ్యతామర్హణం చ నః
భుజ్యతాం సన్తి నీవారా ఉష్యతాం యది రోచతే
వచ్చావు కదా, నీవు కూర్చుని మా పూజలను స్వీకరించి, భోజనాన్ని భుజించండి, ఈ ఆశ్రమం నచ్చితే ఉండండి.
శ్రీదుష్మన్త ఉవాచ
ఉపపన్నమిదం సుభ్రు జాతాయాః కుశికాన్వయే
స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకాః సదృశం వరమ్
విశ్వామిత్ర వంశములో పుట్టినదానవైన నీకు అతిథి మర్యాద బాగా తెలుసు. నీవు రాజపుత్రికవైతేనే లాభం. రాజపుత్రికలు తండ్రి ఇచ్చినవారిని పెళ్ళడరు. తమకు కావలసిన వారిని తామే వరిస్తారు
ఓమిత్యుక్తే యథాధర్మముపయేమే శకున్తలామ్
గాన్ధర్వవిధినా రాజా దేశకాలవిధానవిత్
శకుంతల అతని ప్రైతిపాదనను అంగీకరిస్తే ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
అమోఘవీర్యో రాజర్షిర్మహిష్యాం వీర్యమాదధే
శ్వోభూతే స్వపురం యాతః కాలేనాసూత సా సుతమ్
ఆమె యందు తన వీర్యం నిక్షిప్తం చేసి అతను వెళ్ళిపోగా కొంతకాలానికి ఆమె ఒక కుమారున్ని ప్రసవిస్తే కణ్వుడు ఆ పుత్రునికి జాత కర్మాదులు చేసాడు
కణ్వః కుమారస్య వనే చక్రే సముచితాః క్రియాః
బద్ధ్వా మృగేన్ద్రం తరసా క్రీడతి స్మ స బాలకః
ఈ భరతుడు సింహములతో ఆడుకొనేవాడు. అరణ్యములో ఏ కృరమృగం చెలరేగినా ఇతడు నిగ్రహించేవాడు
తం దురత్యయవిక్రాన్తమాదాయ ప్రమదోత్తమా
హరేరంశాంశసమ్భూతం భర్తురన్తికమాగమత్
ఇంతటి గొప్ప పరాక్రమం ఉన్న పిల్లవాడు, పరమాత్మ అంశ కలవాడిని తీసుకుని భర్త దగ్గరకు వెళ్ళగా ఆ రాజు నీవెవరో నాకు తెలియదు అని స్వీకరించకుంటే
యదా న జగృహే రాజా భార్యాపుత్రావనిన్దితౌ
శృణ్వతాం సర్వభూతానాం ఖే వాగాహాశరీరిణీ
అప్పుడు ఆకాశవాణి స్పష్టముగా చెప్పింది. అతను నీ పుత్రుడు నీవే భరించాలి, శకుంతలను అవమానించకు
మాతా భస్త్రా పితుః పుత్రో యేన జాతః స ఏవ సః
భరస్వ పుత్రం దుష్మన్త మావమంస్థాః శకున్తలామ్
రేతోధాః పుత్రో నయతి నరదేవ యమక్షయాత్
త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకున్తలా
తమ వీర్యం వలన పుత్రుడు తండ్రి నరకానికి వెళ్ళినా అక్కడినుంచి లాక్కుని స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఈ గర్భాదానం నీవు చేసినదే, ఈ కుమారుడు నీ కుమారుడే అని అశరీరవాణి సాక్ష్యం ఇచ్చింది
పితర్యుపరతే సోऽపి చక్రవర్తీ మహాయశాః
మహిమా గీయతే తస్య హరేరంశభువో భువి
తండ్రి మరణించిన తరువాత భరతుడు చక్రవర్తి అయ్యాడు.
చక్రం దక్షిణహస్తేऽస్య పద్మకోశోऽస్య పాదయోః
ఈజే మహాభిషేకేణ సోऽభిషిక్తోऽధిరాడ్విభుః
అతని కుడి హస్తములో చక్రమూ రెండు పాదములయందూ రెండు పద్మముల మొగ్గలు ఉన్నాయి. ఇతను పట్టాభిషేకం తరువాత పరమాత్మకు మహాభిషేకం చేసాడు. గంగానదీ తీరములో రెండు వందల యాభై ఐదు అశ్వమేధయాగాలు చేసాడు
పఞ్చపఞ్చాశతా మేధ్యైర్గఙ్గాయామను వాజిభిః
మామతేయం పురోధాయ యమునామను చ ప్రభుః
బృహస్పతి వదిన ఐన మమతా పుత్రుడిని (దీర్ఘతముడు) పురోహితునిగా చేసుకుని యమునా తీరములో ఇంకో డెబ్బై ఎనిమిది అశ్వమేధములు చేసాడు
అష్టసప్తతిమేధ్యాశ్వాన్బబన్ధ ప్రదదద్వసు
భరతస్య హి దౌష్మన్తేరగ్నిః సాచీగుణే చితః
సహస్రం బద్వశో యస్మిన్బ్రాహ్మణా గా విభేజిరే
ఇతను యజ్ఞ్యం చేస్తే అగ్ని హోత్రుడు స్వయముగా సాక్షాత్కార రూపములో బాహువులు జాచి హవిస్సులు తీసుకునేవాడు. వేల మంది బ్రాహ్మణులకు వేల ఆవులను దానం చేసాడు
త్రయస్త్రింశచ్ఛతం హ్యశ్వాన్బద్ధ్వా విస్మాపయన్నృపాన్
దౌష్మన్తిరత్యగాన్మాయాం దేవానాం గురుమాయయౌ
3300 అశ్వమేధ యాగాలను చేసాడు. దేవమాయను గెలిచి గురువును చేరాడు
మృగాన్ఛుక్లదతః కృష్ణాన్హిరణ్యేన పరీవృతాన్
అదాత్కర్మణి మష్ణారే నియుతాని చతుర్దశ
తెల్లని పలు వరుస కలిగిన కృష్ణ మృగములను బంగారు రంగు కలవాటిని, పధ్నాలుగు లక్షలు దానం చేసాడు
భరతస్య మహత్కర్మ న పూర్వే నాపరే నృపాః
నైవాపుర్నైవ ప్రాప్స్యన్తి బాహుభ్యాం త్రిదివం యథా
చేతులతో ఈతకొడుతూ స్వర్గాన్ని చేరలేనట్లు ఈ భరతుని ఈ గొప్ప పనిని ఇంతకు ముందు వారూ చేసి ఉండలేదు, ఇక ముందు వారు చేయబోరు.
కిరాతహూణాన్యవనాన్పౌణ్డ్రాన్కఙ్కాన్ఖశాన్ఛకాన్
అబ్రహ్మణ్యనృపాంశ్చాహన్మ్లేచ్ఛాన్దిగ్విజయేऽఖిలాన్
ఇతను దిగ్విజయములో రకరకాల శత్రువులను సంహరించాడు
జిత్వా పురాసురా దేవాన్యే రసౌకాంసి భేజిరే
దేవస్త్రియో రసాం నీతాః ప్రాణిభిః పునరాహరత్
కొందరు రాక్షసులు దేవతా స్త్రీలను యుద్ధములో గెలిచి తమ లోకానికి తీసుకు వెళితే ఇతను వెళ్ళి ఆ రాక్షసులను గెలిచి ఆ స్త్రీలను స్వర్గములో వదిలిపెట్టాడు. ఇతనికి భూమీ ఆకాశాలు కోరినవి ఇస్తున్నాయి. ఇతను ఇరవై ఏడు వేల సంవత్సరాలు పరిపాలించాడు
సర్వాన్కామాన్దుదుహతుః ప్రజానాం తస్య రోదసీ
సమాస్త్రిణవసాహస్రీర్దిక్షు చక్రమవర్తయత్
స సంరాడ్లోకపాలాఖ్యమైశ్వర్యమధిరాట్శ్రియమ్
చక్రం చాస్ఖలితం ప్రాణాన్మృషేత్యుపరరామ హ
ఇంతగా రాజ్యాన్ని పరిపాలించిన భరతుడు, అన్ని భోగాలనూ అనుభవిస్తూనే ఇదంతా అసత్యమూ, స్వప్నము లాంటిదీ అని తెలుసుకుని ఆ భోగాల నుండి విరమించాడు.
తస్యాసన్నృప వైదర్భ్యః పత్న్యస్తిస్రః సుసమ్మతాః
జఘ్నుస్త్యాగభయాత్పుత్రాన్నానురూపా ఇతీరితే
అతనికి ముగ్గురు భార్యలున్నారు. ఆ ముగ్గురికీ కుమారులు కలిగితే భరతుడు వారిని చూచి "ఈ పుత్రులు నాకు తగిన పుత్రులు కారు" అన్నాడు
తస్యైవం వితథే వంశే తదర్థం యజతః సుతమ్
మరుత్స్తోమేన మరుతో భరద్వాజముపాదదుః
అది విన్న భార్యలు భయపడి ఆ పుత్రులను విడిచిపెట్టి వేసారు. తనకు మళ్ళీ పిల్లలు కలగకపోవడముతో ఉత్తమ సంతానం కోసం మరుతూలతో యజ్ఞ్యం చేసాడు. అప్పటికే సంసారం నుండి విరక్తిని పొందాడు. అందుచేత ఆ మరుత్తులు
అన్తర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతిః
ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యముపాసృజత్
భరద్వాజ మహర్షిని వీరి వంశములో పుత్రునిగా ఏర్పాటు చేసారు. ఆ భరద్వాజ మహర్షిని తల్లీ తండ్రీ ఇద్దరూ విడిచిపెట్టారు. బృహస్పతి అన్నగారి భార్య పేరు మమత. బృహస్పతి ఆమె మీద వ్యామోహం చెందితే, మమత "నేను ఇప్పటికే గర్భవతిని" అని చెప్పినా బృహస్పతి వినలేదు. ఆ బృహస్పతి రేతస్సుని గర్భములో ఉన్న పిల్లవాడు కిందకి నెట్టి వేసాడు. అలా నెట్టి వేయబడిన పిల్లవాడిని నా కొడుకూ అంటే నా భర్త విడిచిపెడతాడని మమత చెప్పలేదు, విడిచిపెట్టి వెళ్ళబోయింది. తల్లికి లేని ప్రేమ నాకెందుకు అని బృహస్పతి వెళ్ళిపోయాడు. అప్పుడు బయట ఉన్న పిల్లవాడూ , లోపల ఉన్న పిల్లవాడూ కలిసి "మూడే భర ద్వాజం ఇమం", ఇద్దరి వలన పుట్టిన ఈ పిల్లవాడిని (ఒకరి క్షేత్రములో ఇంకొకరి బీజముతో పుట్టినవాడిని) భరించు అన్నారు. ఆ పిల్లవానికి అందుకే భరద్వాజ అన్న పేరు వచ్చింది. ఇది భరద్వాజుని మూడవ జన్మ. మొదటి జన్మ బ్రహ్మ పుత్రుడు. వేదాలను పూర్తిగా అధ్యయనం చేయడానికి బ్రహ్మ నుండి వరం పొందాడు. ఇతనికి మూడు ఆయువులు ఇచ్చాడు. ఆయువు అంటే ఇక్కడ ఇరవై వేల ఏళ్ళు. బ్రహ్మను మెప్పించి అరవై వేల యేళ్ళుగా పొడిగించుకున్నాడు. ఇంకొక భరద్వాజుడు వాల్మీకి శిష్యుడు. ఇంకొక భరద్వాజుడు రామంచంద్రునికి ఆతిథ్యం ఇచ్చినవాడు. ఈ భరద్వాజుడే ఇప్పుడు అవతరించాడు. ఇతనే భరత వంశానికి మూలం అయ్యాడు.
తం త్యక్తుకామాం మమతాం భర్తుస్త్యాగవిశఙ్కితామ్
నామనిర్వాచనం తస్య శ్లోకమేనం సురా జగుః
మూఢే భర ద్వాజమిమం భర ద్వాజం బృహస్పతే
యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజస్తతస్త్వయమ్
చోద్యమానా సురైరేవం మత్వా వితథమాత్మజమ్
వ్యసృజన్మరుతోऽబిభ్రన్దత్తోऽయం వితథేऽన్వయే
ఇలా వంశం వ్యర్థం కాబోతూ ఉంటే అవతరించాడు కాబట్టి వ్యర్థుడు (తల్లీ తండ్రీ వదిలిపెట్టినవాడు) ఐన భరద్వాజుడు వంశం వ్యర్థం అవుతూ ఉంటే క్షయించబోయే వంశాన్ని ఉద్దర్హించమని మరుత్తులు దత్తుడిని చేసారు.