Followers

Monday, 8 April 2013

గణపతి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము?


వినాయకచవితినాడు అనేక పత్రాలనూ, పూలనూ తీసుకువచ్చి పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటానికి కారణము…..
ఓసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు.

Popular Posts