Followers

Wednesday, 3 April 2013

షోడస సంస్కారాలు అంటే ఏమిటి?

షోడస సంస్కారాలు అంటే ఏమిటి?

ధర్మశాస్త్రాల్లో 40 సంస్కారాల వరకు చెప్పబడ్డాయి. గౌతమస్మృతులు - 40 సంస్కారాలను, అంగీరస మహర్షి - 25, వ్యాసుడు - 16 సంస్కారాలను పేర్కొన్నారు. ఈ సంస్కారాల విషయంలో మత బేధాలున్నాయి. వ్యక్తిని సంస్కరించేవి సంస్కారాలు. సంస్కృతి, సంస్కారాలకు దూరమై ఆనందమంటే ఏమిటో తెలియక వ్యక్తులు యాంత్రిక జీవనం చేయడం చూస్తే... సంస్కృతీప్రియులకు బాధాకరంగా ఉంటుంది. ఇహపరలోక సుఖాల నిమిత్తం సుఖం ఆనందంగా పరిణమించే నిమిత్తం సంస్కారాలు వ్యక్తిని సంస్కారవంతుణ్ణి చేస్తాయి.

బహుమత సమ్మతమైన షోడశ సంస్కారాలు...
1. గర్భదానం, 2. పుంసవనం, 3. సీమంతం, 4. జాతకర్మ, 5. నామకరణం, 6. అన్నప్రాసన, 7. చేలం, 8. ఉపనయనం, 9. ప్రాజాపత్యం, 10. సౌమ్యం, 11. ఆగ్నేయం, 12. వైశ్వదేవం, 13. గోదానం, 14. సమావర్తనం, 15. వివాహం, 16. అంత్యేష్టి.
ఇవి మొత్తం 16 కలిపి షోడశ సంస్కారాలు అంటారు.

Popular Posts