దానం ప్రతిఫలాన్ని కోరకుండా ఆచరించే ధర్మం. దానం చేయడానికి డబ్బుంటే చాలదు, దానం చేసే మనసు కూడా ఉండాలి. దానం ఇవ్వడం వ్యక్తిగత బాధ్యత అని ఋగ్వేదం చెబుతోంది. తమ ఆస్తిలో పదోవంతు ఆదాయాన్ని దానంగా ఇవ్వాలని బైబిలు చెబుతోంది. రెండున్నర శాతం జకాత్గా అంటే దానంగా ఇవ్వాలని ఖురాను బోధిస్తోంది.
ఈ లోకంలో మనిషి, పశువులు, క్రిములు, కీటకాలు, చెట్లు అన్నీ బతికేస్తున్నాయి. అన్ని జీవుల మనుగడ అలవోకగా సాగిపోతోంది. ప్రతి మనిషి వారి వారి ధర్మాలను పాటిస్తున్నాడు. వాటిని సజావుగా అనుసరిస్తున్నాడు. అయితే మనిషిగా పుట్టినందుకు అంతకు మించి పాటించాల్సిన ధర్మాలు మరికొన్ని ఉన్నాయి.
అవే విశేషధర్మాలు. సామాన్యధర్మాలు పాటిస్తూనే వాటితో పాటు సర్వజనుల హితవు కోరే విశేషధర్మాల్ని కూడా నిర్వర్తించాలి. వీటిలో వితరణ గుణం విశేషమయినది. అంటే దానగుణం. దానం ప్రతిఫలాన్ని కోరకుండా ఆచరించే ధర్మం. దానం చేయడానికి డబ్బుండాలి. అయితే అదొక్కటే చాలదు.
దానం చేసే మనసు కూడా ఉండాలి. దానం ఇవ్వడం వ్యక్తిగత బాధ్యత అని ఋగ్వేదం చెబుతోంది. తమ ఆస్తిలో పదోవంతు ఆదాయాన్ని దానంగా ఇవ్వాలని బైబిలు చెబుతోంది. రెండున్నర శాతం జకాత్ గా అంటే దానంగా ఇవ్వాలని ఖురాను బోధిస్తోంది. అంటే అన్ని మతాలూ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించమనే చెబుతున్నాయి.
కర్ణుడు, శిబి... వంటి మహామహులైన దానశీలురకు ఆలవాలమైన పుణ్యభూమి మనది. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు కర్ణుని దానగుణం గురించి అదేపనిగా పొగుడుతుంటే అది విన్న అర్జునుడికి కోపం వచ్చింది. ఆపుకోలేక, ‘ఇవ్వగల వసతి ఉంటే నేనూ చేస్తాను దానం’ అన్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడు కోరినది తక్షణం ఇవ్వగలిగే మహిమ ఉన్న అక్షయపాత్రను సృష్టించి, దాని సహాయంతో దానధర్మాలు చేయమని అర్జునుడి చేతికిచ్చాడు.
పేదప్రజలందరినీ పిలిచి, ఆ అక్షయపాత్ర నుంచి తీసి దానం చేయడం మొదలుపెట్టాడు. అది చూసి కృష్ణుడు నవ్వుకున్నాడు.
ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు. తన సందేహాన్ని అడిగాడు అర్జునుడు. వెంటనే కర్ణుడిని పిలిపిస్తాను, అతడు దానం చేసే విధానం చూడు అన్నాడు. ఆ సమయంలో కర్ణుడి దగ్గరకు ఒక బీద బ్రాహ్మణుడికి సాక్షాత్తు తన దగ్గరున్న ఆ అక్షయపాత్రను దానం చేసి నమస్కరించాడు కర్ణుడు.
మహోన్నతమైన కర్ణుడి దానగుణం చూసి అర్జునుడు సిగ్గుతో తలదించుకున్నాడు. అది నిజమైన వితరణ గుణం అంటే.
మనం సంపాదించుకున్న డబ్బుకు తగిన రక్షణ కలిగించేది దానం ఒక్కటే అంటాడు హితోపదేశకారుడు ...
ఉపార్జితానాం విత్తానాం త్యాగాపవహి రక్షణం
తటాకోదర సంస్థానాం పరీవాహ ఇవామ్బసామ్
(169వ శ్లోకం, హితోపదేశం)
చెరువు మధ్యలోఉన్న నీటికి రక్షణ ఆ చెరువుకున్న తూము. దాచిపెట్టబడిన ధనానికి రక్షణ దానం.
ఉన్న దాంట్లోనే సాధ్యమైనంతవరకు ఆపన్నులను ఆదుకోవడమే మానవజన్మ సుకృతంగా భావించాలి. మంచిని మించిపోయేలా పదిమందికి పంచాలి.
- యండపల్లి పాండురంగ -