దీపారాధనకు నువ్వుల నూనె వాడాలా, కొబ్బరి నూనె
వాడవచ్చా?
స్వచ్ఛమైన స్వదేశీ ఆవునెయ్యి నిత్య దీపారాధనకు
ఉత్తమం. అది కుదరకపోతే నువ్వుల నూనె. అది కూడా
దొరక్కపోతే కొబ్బరి నూనె. ఇదికాక ప్రత్యేక
కామ్యకర్మలకు ఆయా తంత్ర గ్రంథాలలో చెప్పిన
తైలాలు వేరు. అవి నిత్యపూజకు కాదు.