Followers

Wednesday, 4 September 2013

ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు .. ఏమి తిన్నామన్నదే ముఖ్యం

దక్షిణ భారతం లో ఎక్కువ మంది తినేది అన్నం. ఒకప్పుడు అన్నం కేవలం పండగలకి మాత్రమే వండుకునేవారట.దానిని ధనికులు మాత్రమే తినేవారు. ఇప్పుడు అందరు అదే తింటున్నారు. జొన్నన్నం తిన్న మన తాతలు పెద్దవాల్లు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో మనం చుస్తునే ఉన్నాం. దానికి కారణం లేకపోలేదు. అన్నం కేవలం ధర లోనే ధనికం, కానీ పోషక విలువల విషయం లో అది చాలా పేదది.

క కెజి బియ్యం తింటే వచ్చే బలం కేవలం ఒక్క నూట ముప్పయ్ గ్రాముల గోధుమలు తింటే వస్తుందన్నమాట. ఇది తెలియక మనవాళ్ళు చిన్న పిల్లలకి బలవంతంగా అన్నం తినిపిస్తూ ఉంటారు. దానివల్ల వారికి బొజ్జ పెరగటమేగాని బలం అనేది రాదు. ఇంకొంతమంది మెడికల్ షాప్ లో దొరికే కొన్ని బిస్కెట్స్ కొని పెడుతూ ఉంటారు. అవి చాలా ఖరీదే కాకుండా పెద్ద ఉపయోగం కూడా ఉండదు.

ఒకప్పుడు తవుడు, పనికిమాలిన చెత్త తో బిస్కట్స్ తయారు చేసే బ్రిటానియా ఇప్పుడు .. డయాబెటీస్ కి మంచిది అంటూ రాగి బిస్కట్స్ ని తయారు చేస్తుంది. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ప్రజలందరికి ఏది మంచిదో ఏది కాదో మీడియా ద్వారా తెలిసిపొతుండటం వల్ల ఇక ఈ కంపనీలకి మంచివి తయారుచెయ్యక తప్పట్లేదు.   

అన్నిటికన్నా మంచి పొషకవిలువలు గలిగినది మల్టి గ్రైన్ (బహుళ ధాన్యాలు) పిండి. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లి, సోయా బీన్స్, మొక్క జొన్నలు, కొర్రలు .. ఇవే కాకుండా ఇంకా బాదం పప్పు, జీడి పప్పు ... ఇలా అన్ని కలిపి పిండి చేసుకుని జావ లాగా తయారు చెసుకుని రోజూ ఏదో ఒక సమయం లో తాగుతూ ఉంటే .. పోషకాహార సమస్యలెమీ తలెత్తవు..ఇంకా ఇది తీసుకున్నవారు చాలా ఆరొగ్యం గా ఉంటారు.



ఈ బహుళ ధాన్యాల పిండి బయట చాలా కంపనీలు తయారు చేసి అమ్ముతున్నారు..కానీ స్వయం గా చెసుకుంటే చాలా మంచిది. పిల్లల ఎదుగుదలలో ఈ పిండి చాలా ఉపయోగపడుతుంది. పనికిమాలిన పిజ్జాలు, బర్గర్లు, చెత్తా చెదారం పొట్టలో పడెయ్యకుండా .. ఇలాంతి మంచి పొషకాహారం తీసుకుంటే ఆరోగ్యం..బలం..ఆనందం.

గోధుమలు -- 1 కెజి
రాగులు -- 1 కెజి
జొన్నలు -- 1 కెజి
సజ్జలు -- 1 కెజి
బార్లి -- 1 కెజి
మొక్క జొన్నలు -- 1 కెజి
సోయా బీన్స్ -- 250 గ్రాములు 

అన్నిటిని, శుభ్రముగా కడిగి, పొట్టు ఉంటే తీసేసి .. కలిపి పిండి కొట్టించాలి.
సోయా బీన్స్ లో ఎక్కువ పొషకాలుంటాయి..కాని అవి ఎక్కువ కలిపితే చేదుగా ఉంటుంది. 
అందువల్ల 250 గ్రాములు చాలు. 


పయిన చెప్పిన ఏడు ఖచితంగా ఉండాలి. ఇంకా
అలసందలు -- 1 కెజి
అల్మండ్స్ -- 100 గ్రాములు
జీడిపప్పు  -- 250 గ్రాములు
బాదం పప్పు -- 250 గ్రాములు
పిస్తా పప్పు -- 250 గ్రాములు

పిండి గా చేసి కలుపుకోవచ్చు .


ఈ పిండిని, నీళ్ళలో చాలా సేపు తిప్పి పేస్టు లా అయ్యాక జావ తయారు చేసుకోవాలి. లేకపోతే ఉండలు ఉండలు గా అవుతుంది.

ఇది రోజూ తీస్కుంటే మాత్రం ఇక మందులు వాడాల్సిన పని ఉండదు.నేను వాడి చూసాను, మామూలు టిఫిన్ తిన్న రోజుకి , ఈ జావ తాగిన రోజుకి చాలా తేడా.
అందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ  సూర్య ప్రదీప్  

Popular Posts