Followers

Monday, 2 September 2013

శ్రీరాముడు.. మానవుడా.. దేవుడా?

శ్రీరాముడు..
మానవుడా.. దేవుడా?
దైవం మానవరూపంలో అవతరించాడా?
మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా?
వాలిని చెట్టు చాటు నుంచి చంపిన వాడు
భార్యను అడవుల పాలు చేసిన వాడు
ప్రపంచానికి రోల్‌మోడల్‌ ఎలా అయ్యాడు?
రాముళు్ల ఇద్దరున్నారా?
రామాయణానికి రుజువులేమిటి?

.......................................................................
శ్రీరాముడు... సుగుణాభి రాముడు.. మర్యాదా పురుషోత్తముడు.. జగదభిరాముడు.. ఎన్ని పేర్లు.. ఎన్ని స్తోత్రాలు.. ఆయన పేరే ఒక తారకమంత్రం. ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని చెప్తారు. నిజంగా రాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు.. వాలిని చెట్టు చాటు నుంచి చంపినవాడు.. ఎవరో తాగుబోతు మాటలు విని భార్యను అడవుల పాలు చేసిన వాడు ఆదర్శపురుషుడు ఎలా అయ్యాడు? రామాయణం నిండా రకరరకాల ఛిౌ్టట్చఛీజీఛ్టిజీౌట కనిపిస్తాయి.. వాదాలు, వివాదాలూ ఉన్నాయి. అయినా రామరాజ్యం రావాలని, రాముడి లాంటి పాలకులు, లీడర్లు రావాలని ఎందుకు కోరుకుంటారు? ఈ ఆదర్శ రాముడు ఎవరు?
.....................................
భారత దేశంలో ఆదర్శపురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు.. ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు.. ఆదర్శపాలకుడు ఎవరంటే శ్రీరాముడు.. ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం.. ఇవాళ మన పాలకులంతా మైకుల ముందు ఊదరగొట్టే ఉపన్యాసాల్లో తరచూ చెప్పే మాట.. మళ్లీ రామరాజ్యం తెస్తామని? ఏమిటీ రామరాజ్యం? అసలు ఈ రాముడు మనిషా? దేవుడా? ఏమిటీ సీక్రెట్‌..?   
...................................
రామాయణం. రాముడు.. సీతారాములు.. లక్షల సంవత్సరాల నాటి చరిత్ర... అఖండ భారత దేశమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర.. దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర.. మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర.. ఇంతకీ ఈ రాముడు ఎవరు? మనందరికీ తెలిసినంతవరకు విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు.. రావణుడిని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు. 
కొడుకుగా రాముడు
అన్నయ్యగా రాముడు
భర్తగా రాముడు
స్నేహితుడిగా రాముడు
రాజుగా రాముడు
ఏమిటీ రాముడి అవతారంలోని గొప్ప సీక్రెట్‌.. ఆయన ఫేస్‌ వాల్యూ లక్షల సంవత్సరాల తరువాత కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉంది. సాక్షాత్తూ నారాయణుడే రాముడిగా అవతరించి ఉంటే.. నేరుగా వెళ్లి రావణుణ్ణి హతమార్చి ఉండవచ్చు కదా? అంతకు ముందు వచ్చిన అన్ని అవతారాల్లోనూ ఆయన చేసింది అదే.. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ కొద్ది నిమిషాల్లో ముగిసినవే..
మరి రామావతారం మాత్రం వాల్మీకి రామాయణం ప్రకారం పదకొండు వేల సంవత్సరాలు ఎలా కొనసాగింది.. ? దిగివచ్చిన దేవుడు రాముడిగా ఎందుకు అష్టకష్టాలు పడినట్లు.. వనవాసం ఎందుకు చేసాడు..? నేరుగా వెళ్లి రావణుడితో యుద్ధం చేసి హతమార్చి ఉండవచ్చు కదా.. కేవలం మానవమాత్రుడిలాగా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొన్నాడు? ఈ రాముడు దైవమా? దైవంగా ఎదిగిన మనీషా?
రాముడు దేవుడే అయితే, ఎందుకిలా కష్టపడ్డాడన్న ప్రశ్న హేతుబద్ధమే. కానీ, ఇక్కడే ఓ ట్విస్‌‌ట ఉంది. పురాణాల ప్రకారమే అయితే, విష్ణుమూర్తి అవతారాల్లో  పూర్ణమానవుడిగా అవతరించిన సందర్భం రాముడే.. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో రాముడు చేసి చూపించాడు.. ఆయన కేవలం రావణ వధ చేయటం కోసమే అవతరించాడా, లేక మరేదైనా గొప్ప కార్యాన్ని సాధించటానికి పుట్టాడా?
.................
రాముడు దేవుడా? రామాయణం ఎప్పుడు జరిగింది.. ఇవి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు.. ఈ తరానికి అంతుపట్టని తెలియని ప్రశ్నలు.. అసలు రామాయణమే లేదని, ఇది కేవలం ఒక మిథ్యావాదమని, కల్పిత కావ్యమే తప్ప, చరిత్ర కాదని చెప్పేవాళు్ల ఎక్కువమందే ఉంటారు.. కానీ, రామాయణ కాలం ఇప్పటికే విస్పష్టమైంది.. టైమ్‌తో సహా  తేలింది.. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో ఉన్నాం.. రామాయణం 26వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి రామాయణం చెప్పుకొచ్చింది. ఒక మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలన్నమాట. ఒక మహాయుగం అంటే 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అంటే ఒక్కో యుగం లక్షా ఎనిమిది వేల సంవత్సరాలన్నమాట. ఈ ప్రకారం చూస్తే, రామాయణం పది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది.
రామాయణానికి సంబంధించిన రుజువులు అన్నీ దొరికాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యలో రాముడి జన్మస్థలాన్ని విక్రమాదిత్యుడు కనుగొని గొప్ప ఆలయాన్ని నిర్మించాడు.. రామాయణంలో పేర్కొన్న సరయూ నదీతీరం, సాకేతపురి అన్నీ ధృవీకరణ జరిగాయి. లంకలో రావణాసురుడి ఆనవాళు్ల స్పష్టంగా లభించాయి. అన్నింటికీ మించి రాముడు లంకకు నిర్మించిన సేతువు ఇవాళ్టికీ 30 కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది. 

ఇవన్నీ మానవ నిర్మితాలని, ప్రపంచ అతి ప్రాచీన నాగరికతకు గుర్తులని, ఇంటర్నేషనల్‌ సైంటిస్టులే గుర్తించారు.. ఇదిగో చూడండి.. ఇవి రాముడి సేతువుకు సంబంధించిన సాటిలైట్‌ ఇమేజెస్‌. ఇవి మన భారతీయులో.. లేక ఏ హిందూ సంస్థలో తీసిన చిత్రాలు కావు. ప్రపంచం అంతా దేనై్నతే ప్రామాణికంగా భావిస్తుందో, దేని మాటైతే వేదంలా నెత్తిన పెట్టుకు పూజిస్తుందో ఆ నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసిన చిత్రాలు.. పదిలక్షల సంవత్సరాల క్రితం ఒక రాజు నిర్మించినట్లు కూడా అది వివరించింది. ఇదొక్కటి చాలు రామాయణం వాస్తవమని చెప్పటానికి.. 

అటు హంపి దగ్గర కిష్కింధలోనూ, తిరుమలలోని అంజనాద్రిపైనా, నాసిక్‌, చిత్రకూటం ఇలా రాముడు అయోధ్య నుంచి లంక వరకు ప్రయాణించిన మార్గమంతటా ఏవో ఒక గుర్తులు మనకు కనిపిస్తాయి. 

రామాయణం మాట సరే.. మరి రాముడి మాటేమిటి? విష్ణుమూర్తి నరుడిగా అవతరించాడా? నరుడే నారాయణుడయ్యాడా? ఈ మీమాంస ఎప్పుడూ ఉండేదే.. దేవుడ్ని మనం ఎలాగూ చూడలేదు.. కానీ, రాముడి చరిత్ర మాత్రం మనకు తెలుసు.. దేవుడిగా ఆయన అవతరించాడని హిందూ పురాణేతిహాసాలు చెప్తున్నాయి. అంతకంటే మించిన గొప్ప సంస్కృతిని ఈ దేశం ఆవిష్కరించింది. భగవంతుడిగా మానవుడు ఎదగటం.. ఎదిగేలా చేయటం..


రాముడు దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి.. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్టసుఖాలన్నీ అనుభవించాడు.  రాజుగా ప్రజల్ని పరిపాలించాడు.. మరి ఒక మిలియన్‌ ఇయర్‌‌స తరువాత కూడా  ఆదర్శరాముడని కొలుస్తున్నారు.. రాముడికి ముందు కానీ, రాముడి తరువాత కానీ, ప్రజల్ని ప్రభావితం చేసిన రాజే లేడా? అసలు ఇన్ని తరాలకు ఆయన రోల్‌ మోడల్‌ ఎలా అయ్యాడు?   
.......................................
నిజం.. రాముడు తానే ఓ తారకమంత్రం. జైశ్రీరాం అన్నది ఒక దివ్యౌషధం.. అంతగా భారతీయ సంస్కృతిలో రామచంద్రుడు నాటుకుపోయాడు. కారణం ఏమిటి? ఒక మనిషిగా జన్మించాక, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధుమిత్రులతో ఎలా ఉండాలి.. ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి.. కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి అన్న వాటిని ఆచరించి చూపించిన వాడు రాముడు.

తల్లి దండ్రుల గారాల పట్టి అయిన రాముడు 17ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట వెళ్లమంటే మారు మాటాడకుండా వెళ్లాడు.. రేపు పట్టాభిషేకం అనగా పధ్నాలుగేళు్ల వనవాసం చేయమంటే అలాగే అంటూ వెళ్లిపోయాడు.. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఇవాళ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రుల్ని కాదని రాత్రికి రాత్రి ఇల్లు వదిలేసే సంతానాన్ని మనం చూస్తున్నాం. జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నది ఈ రాముడే.. కన్నతల్లి, కన్నభూమి స్వర్గంతో సమానమన్నాడు.. అందుకే ఆయన ఆదర్శరాముడయ్యాడు.

అన్నగా తము్మళ్ల పట్ల అపారమైన ప్రేమను కురిపించిన వాడు. ఆయన తము్మళు్ల కూడా అదే విధంగా అన్నపట్ల ప్రేమతో ఉన్నారు.. తల్లులు వేరైనా ఏనాడూ కూడా దాయాదుల పోరు జరగలేదు. సీతాపహరణం తరువాత సుగ్రీవుడితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని తము్మడి భార్యను అపహరించిన వాలిని సంహరించాడు.. 

వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు.. అంతటి వీరుడు చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చింది? దీనికి రకరకాల సమాధానాలు ఉన్నాయి. ఎవరికి తోచిన జవాబులు వాళు్ల చెప్పుకొచ్చారు. జంతువును చెట్టుచాటునుంచి చంపటం తప్పుకాదన్నారు. దీని వెనుక సాంకేతికంగా ఓ లాజిక్‌ ఉంది. దాని గురించి వాల్మీకి స్వయంగా రామాయణంలో చెప్పుకొచ్చాడు. వాలిలో ఒక గొప్ప శక్తి ఉంది.. ఆయన ముందు ఎవరు నిలబడ్డా.. ఆయన్ను చూసిన వెంటనే మెస్మరైజ్‌ అయిపోతారు.. ఎదుటివారిలో శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది ఒకరకంగా హిప్నటిజం లాంటిదే.. ఇప్పుడంటే హిప్నటిజంలో ఎదుటి వ్యక్తి అనుమతితో అతణ్ణి మెస్మరైజ్‌  చేస్తారు. ఆనాడు వాలి సూపర్‌ హిప్నాటిస్‌‌ట అన్నమాట.

ఒకటి కాదు.. రెండు కాదు.. హు్యమానిటీ అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఎన్నో ఉదాహరణలు రామాయణంలో మనకు కనిపిస్తాయి. పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన శబరి, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణ సమయంలో ఉడుత, శరణు కోరిన శత్రువు తము్మడు.. చివరకు తొలి రోజు యుద్ధంలో నిరాయుధుడైన రావణున్ని సైతం వదిలేసిన ఉదాత్త పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా, అందరికీ, తరతరాలకు, యుగయుగాలకు ఆదర్శమయ్యాడు.. యుగపురుషుడయ్యాడు.


ఇంతవరకు బాగానే ఉంది..  మరి రాముడి విషయంలో ఉన్న మిగతా కథనాల మాటేమిటి? రావణ వధ తరువాత సీతమ్మను అగ్నిప్రవేశం చేయించాడు.. ఆ తరువాత నిండు గర్భవతిని అడవుల్లో వదిలేశాడు.. అది కూడా ఓ తాగుబోతు మాటలు విని వదిలేశాడు.. ఇలాంటి వ్యక్తి  భావి తరానికి ఎలా ఆదర్శమూర్తిగా నిలుస్తాడు? ఇవాళ్టికీ రామరాజ్యం రావాలని అంతా ఎందుకు కోరుకుంటున్నారు...?
రాముడి ఆదర్శం విషయంలో భారత దేశంలో తలెత్తే అతి పెద్ద ప్రశ్న సీతాదేవి విషయంలో రాముడు వ్యవహరించిన తీరు.. దీనిపై వంద సంవత్సరాలుగా వాదాలు, చర్చలు తీవ్రంగానే జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి కూడా.  అసలు సీత రాముడికి ఏమవుతుందని బల్లగుద్ది క్వశ్చన్‌ చేసేవాళూ్ల ఉన్నారు.. వీటన్నింటికీ జవాబులు వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి. వాస్తవానికి సీత భూమి నుంచి పుట్టలేదు.. జనకుడికి భూమిలో ఒక పెట్టెలో దొరికింది. ఆమె అయోనిజ. ఈమె భూదేవి కూతురు కాదు. లక్ష్మీదేవే శిశువుగా భూమిలో దొరికింది. కాబట్టి శ్రీదేవి, భూదేవి విష్ణుమూర్తి భార్యలు కాబట్టి అందులో ఒకామె కూతుర్ని ఆయన ఎలా పెళ్లి చేసుకున్నాడన్న ప్రశ్నే ఉదయించదు.
రావణ వధ తరువాత సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది రాముడనే వ్యక్తి మరి కొద్ది రోజుల్లో రాజుగా పట్టాభిషేకం పొందనున్నాడు. అంటే పబ్లిక్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడని అర్థం. పబ్లిక్‌ లైఫ్‌లో అడుగుపెట్టే వ్యక్తి జీవితానికి క్లీన్‌చిట్‌ అనేది ముఖ్యం. ఒకసారి పబ్లిక్‌ లైఫ్‌లో అడుగుపెట్టాక ప్రజలే సర్వస్వం కావాలే తప్ప వ్యక్తిగతానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. అందుకే ఆ క్లీన్‌చిట్‌ కోసమే అగ్నిప్రవేశం చేయించాడు. ఇవాళ్టికీ మన పల్లె సమాజాల్లో నిప్పులపై నడిచే సంప్రదాయాలు ఉన్నాయి. ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయాలకు ఎంత గౌరవం ఇవ్వాలో ఆనాడే ఆయన ఆచరించి చూపాడు.. కాబట్టే ఆయనది రామరాజ్యంగా ఇవాళ్టికీ చెప్పుకుంటున్నారు..
ఇక సీతమ్మను అడవుల్లో వదిలేయటం సంగతి... వాల్మీకి రాసిన రామాయణం 24 వేల పద్యాల్లో ఉంది. వాల్మీకి రామాయణం తరువాత దాదాపు 300 వెర్శన్‌‌సలో 20 భాషల్లో రామాయణాలు వచ్చాయి. వీటిలో కొన్ని సంస్కృతంలో వచ్చి, వాటిని వాల్మీకికి ఆపాదించినవీ ఉన్నాయి. వాస్తవానికి మహాభారతానిది కూడా అదే పరిస్థితి. అసలు 8,800 పద్యాలున్న భారతం కాలం గడుస్తున్న కొద్దీ లక్ష దాకా పెరుగుతూ పోయింది. ఇవి రెండూ గ్రోయింగ్‌ ఎపిక్‌‌స. 
ఇలాంటిదే ఉత్తర రామాయణం కూడా.. వాల్మీకి తన రామాయణానికి ముందే దాని సంగ్రహాన్ని విస్పష్టంగా వివరించాడు. అందులో ఎక్కడా ఉత్తర రామాయణం ప్రస్తావన లేదు. వాల్మీకి రామాయణం రామ పట్టాభిషేకంతోనే ముగుస్తుంది. పట్టాభిషేకం తరువాత 11వేల సంవత్సరాల పాటు రాముడు ఈ భూమిని పరిపాలించి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయాడని కూడా చివరి పద్యాల్లో ఉంటుంది. చివరకు రామాయణం ఫలశ్రుతి కూడా ఉంటుంది. ప్రాచీన చారిత్రక ఇతిహాసాలన్నీ ఫలశ్రుతితోనే ముగియటం అందరికీ తెలిసిన సత్యమే.. అలాంటప్పుడు ఉత్తర రామాయణం అనేది ఆ తరువాత కల్పించిన కథ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతమ్మను అడవుల్లో వదిలేశాడన్నదీ ఈ కల్పితంలో భాగమే. 
రాముడి పాత్రపై, ఉత్తర రామాయణంపై కానీ, రకరకాల కథనాలు ఆ తరువాతి కాలంలో ఆయా కాలాలకు అనుగుణంగా వచ్చినవే.. ఆనాటి సమాజానికి అనుగుణంగా మార్పులు చేర్పులకు గురైనవే. రాముడి నిజమైన వ్యక్తిత్వాన్ని వాల్మీకి మాత్రమే ఆవిష్కరించాడు.. ఆ తరువాత వచ్చినవన్నీ పుక్కిటి పురాణాలే.. వాల్మీకి చూపించిన రాముడే మనకు ఇవాళ ఆదర్శంగా నిలిచిన జగదభిరాముడు.. మర్యాదాపురుషోత్తముడు. 

Popular Posts