Followers

Wednesday, 2 October 2013

అహింస,భక్తి తత్వములు:శ్రీ కృష్ణ భగవానుడు

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, "వేదాలు భౌతిక విషయాల గురించి చెబుతాయి, ఒక పూర్తిగా ఙ్ఞానం సంపాదించిన మేధావికి వేదాలు ఎలాంటివంటే ఒక నది పూర్తిగా జలంతో నిండి ఉన్నపుడు నదిలో త్రవ్విన బావి ఉపయోగం వంటిది".


తరువాత కాలంలో అంటే ఇప్పటికి ౩౦౦౦ సంవత్సరాల క్రితం భాగవతులు అనే శివ భక్తులు తయారయి యఙ్ఞ యాగాలను విమర్శిస్తు , భగవంతుని భక్తితో కొలవడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చని ఉద్భోదలు చేశారు. వీరు మధ్య భారత దేశంలో మొదట కాన వచ్చారు. నారధ ముని , శ్రీ కృష్ణ పరమాత్యుడు, అంగీరసుడు , సాండిల్యుడు మొదలైన వారు ఈ కోవకు చెందిన ప్రవక్తలు.


 


భగవంతుడు యఙ్ఞాల్లో సాగించే బలిదాన హింసకు వ్యతిరేకంగా ఈ విధంగా చెప్పారు, "యఙ్ఞాల వల్ల వర్షాలు కురవవు. దట్టమైన అడవులు వర్షం కోసం యఙ్ఞాలు చేస్తున్నాయా? "


నారద ముని ఎమన్నాడంటే, " అహం వదిలి భగవంతుని ధ్యానించడం వల్లనే మోక్షం వస్తుందా? "అని.  


సాండిల్యుడు ఎమన్నాడంటే, " భక్తి అంటే భగవంతుని ప్రేమించడమే, ప్రేమించడమంటే ద్వేషాన్ని త్యజించడమే"!


ఈ విధంగా, భారత సంస్కృతి ఎన్నో తత్వాలను , మనుష్య గణాల్ని, ప్రాంతాల్ని కలుపుకుంటూ నూతన వ్యక్తుల్ని, నూతన సమాజాల్ని వారి వారి భావాలని , కట్టుబాట్లని గౌరవిస్తూ తమ ఆచార వ్యవహారాల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూవస్తుంది. ఎమైనా అపశృతులు , ఉద్వేగాలు, తాత్కాలికం మాత్రమే!

Popular Posts