శ్రీ భగవానువాచ:-
పరం భూయః ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞానముత్తమమ్,
యజ్జ్ఞాత్వా మునయః సర్వే
పరాం సిద్ధిమితో గతాః.
శ్రీ భగవంతుడు చెప్పెను: (ఓ అర్జునా!) దేనిని తెలిసికొని మునులందఱును ఈ సంసారబంధము నుండి (విడివడి) సర్వోత్తమమగు మోక్షసిద్ధినిబడసిరో, అట్టి - పరమాత్మ విషయికమైనదియు, జ్ఞానములలో కెల్ల ఉత్తమమైనదియునగు జ్ఞానమును మఱల చెప్పుచున్నాను.
******************************************************************************************* 1
ఇదం జ్ఞానముపాశ్రిత్య
మమ సాధర్మ్యమాగతాః,
సర్గేపి నోపజాయంతే
ప్రలయే న వ్యథంతి చ.
ఈ జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యము నొందినవారై (నా స్వరూపమును బడసి) సృష్టి కాలమున జన్మింపరు; ప్రళయకాలమున నశింపరు. (జనన మరణ రహితులై పునరావృత్తి లేక యుందురని భావము).
******************************************************************************************* 2
మమ యోనిర్మహద్బ్రహ్మ
తస్మిన్ గర్భం దధామ్యహమ్,
సంభవః సర్వభూతానాం
తతో భవతి భారత.
అర్జునా! గొప్పదైన మూలప్రకృతి (మాయ) నాయొక్క సర్వభూతోత్పత్తిస్థానము. అద్దానియందు నేను గర్భకారణమైన చైతన్య రూపమగు బీజము నుంచుచున్నాను. దానివలన సమస్త ప్రాణుల యొక్కయు ఉత్పత్తి సంభవించుచున్నది.
******************************************************************************************* 3
సర్వయోనిషు కౌంతేయ
మూర్తయస్సంభవంతి యాః,
తాసాం బ్రహ్మ మహద్యోని
రహం బీజప్రదః పితా.
అర్జునా! (దేవమనుష్యాది) సమస్తజాతులందును ఏ శరీరము లుద్భవించుచున్నవో, వానికి మూల ప్రకృతి (మాయ) యే మాతృస్థానము (తల్లి). నేను బీజమునుంచునట్టి తండ్రిని.
******************************************************************************************* 4
సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసంభవాః,
నిబధ్నంతి మహాబాహో
దేహే దేహినమవ్యయమ్.
గొప్పభుజములుగల ఓ అర్జునా! ప్రకృతి వలన బుట్టిన సత్త్వరజస్తమోగుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు (లేక దేహమునకు) బంధించివైచుచున్నవి.
******************************************************************************************* 5
తత్ర సత్త్వం నిర్మలత్వా
త్ప్రకాశక మనామయమ్,
సుఖసంగేన బధ్నాతి
జ్ఞానసంగేన చానఘ.
పాపరహితుడవగు ఓ అర్జునా! ఆ సత్త్వాది గుణములలో సత్త్వగుణము నిర్మలమైనదగుటవలన ప్రకాశమును గలుగజేయునదియు, ఉపద్రవము లేనిదియు (అగుచు), (ఇంద్రియ) సుఖమునందలి యాసక్తి చేతను, (వృత్తి) జ్ఞానమునందలి ఆసక్తి చేతను జీవుని బంధించుచున్నది.
******************************************************************************************* 6
రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసంగసముద్భవమ్,
తన్నిబధ్నాతి కౌంతేయ
కర్మసంగేన దేహినమ్.
ఓ అర్జునా! రజోగుణము దృశ్యవిషయముల యెడల ప్రీతినిగలుగజేయునదియు, తృష్ణను (కోరికను), ఆసక్తిని కలుగజేయునదియు, (అని) యెరుగుము. అయ్యది కర్మములందలి ఆసక్తిచేత (కర్మబంధముచేత) ఆత్మను (జీవుని) లెస్సగ బంధించివేయుచున్నది.
******************************************************************************************* 7
తమస్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్,
ప్రమాదాలస్యనిద్రాభి
స్తన్నిబధ్నాతి భారత.
ఓ అర్జునా! తమోగుణము అజ్ఞానము వలన కలుగునదియు, సమస్త ప్రాణులకును మోహమును (అవివేకమును) గలుగజేయునదియునని యెఱుగుము. అయ్యది మఱపు (పరాకు), సోమరితనము, నిద్ర మొదలగువానిచే జీవుని లెస్సగ బంధించివేయుచున్నది.
******************************************************************************************* 8
సత్త్వం సుఖే సంజయతి
రజః కర్మణి భారత,
జ్ఞానమావృత్య తు తమః
ప్రమాదే సంజయత్యుత.
ఓ అర్జునా! సత్త్వగుణము సుఖము నందును, రజోగుణము కర్మము నందును, తమోగుణము జ్ఞానమును (వివేకమును) కప్పివైచి ప్రమాదము (పొరపాటు) నందును జీవుని చేర్చుచిన్నవి (కలుపుచున్నవి) ఆశ్చర్యము!
******************************************************************************************* 9