Followers

Wednesday, 5 August 2015

సాంఖ్య యోగః 2 (అథ ద్వితీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


తమువాచ హృషీ కేశః
ప్రహసన్నివ భారత!
సేనయోరుభయోర్మధ్యే
విషీదంతమిదం వచః


ఓ ధృతరాష్ట్ర మహారాజా! రెండు సేనలమధ్య విలపించుచున్న ఆ అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వానివలె ఈ (క్రింది) వాక్యములను బలికెను.

*******************************************************************************************  10

శ్రీ భగవానువాచ :-

అశోచ్యానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ భాష సే,
గతాసూనగతాసూంశ్చ
నానుశోచంతి పణ్డితాః


శ్రీ కృష్ణభగవానుడు చెప్పెను: - (ఓ అర్జునా!) నీవు శోకింపదగిన వారినిగూర్చి శోకించితివి. పైగా బుద్ధివాదముతో గూడిన వాక్యములను గూడ పలుకుచున్నావు. జ్ఞానులగువారు మరణించినవారిని గురించిగాని, జీవించియున్న వారిని గురించిగాని యెన్నటికి దుఃఖింపరు.

*******************************************************************************************  11

న త్వేవాహం జాతు నాసం
న త్వం నేమే జనాధిపాః,
న చైవ న భవిష్యామ
స్సర్వే వయమతః పరమ్‌.


అర్జునా! నేనుగాని, నీవుగాని (యుద్ధభూమియందు గల) రాజులుగాని, ఒకప్పుడును లేనివారముకాము. ముందును లేకపోవువారముకాము.

*******************************************************************************************  12

దేహినోస్మిన్‌ యథా దేహే
కౌమారం యౌవనం జరా,
తథా దేహాంతర ప్రాప్తి
ర్ధీరస్తత్ర న ముహ్యతి.


జీవున కీశరీరమునందు బాల్య, యౌవన, వార్ధక్యములను అవస్థ లెట్లు కలుగుచున్నవో, అట్లే మరణానంతరము మఱియొక శరీరమును బొందుటయు తటస్థించుచున్నది. కావున నివ్విషయమున జ్ఞానియగువాడెంత మాత్రమును మోహమును(శోకమును) జెందడు.

*******************************************************************************************  13

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ!
శీతోష్ణసుఖదుఃఖదాః,
ఆగమాపాయినో నిత్యా
స్తాం స్తితిక్షస్వ భారత.


ఓ అర్జునా! ఇంద్రియములయొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకపుడు శీతమును, ఒకపుడు ఉష్ణమును, ఒకపుడు సుఖమును, మరియొకపుడు దుఃఖమును గలుగజేయుచుండును. మఱియు నవి రాకపోకడలు గలవియై అస్థిరములైయున్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము.

*******************************************************************************************  14

యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ!
సమదుఃఖసుఖం ధీరం
సో మృతత్వాయ కల్పతే.


పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఎవరిని ఈ శబ్దస్పర్శాదులు బాధింపవో (చలింపజేయవో), సుఖదుఃఖములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమున కర్హుడగును.

*******************************************************************************************  15

నాసతో విద్యతే భావో
నాభావో విద్యతే సతః,
ఉభయోరపి దృష్టోంతః
స్త్వనయోస్తత్త్వదర్శిభిః


అసత్యములై (నామరూపాత్మకములై, నశించు స్వభావముగలవియై) నట్టి దేహాదులకు ఉనికి లేదు. సత్యమైనట్టి ఆత్మకు లేమిలేదు. తత్త్వజ్ఞానులగ్గువారీ రెండింటియొక్క నిశ్చయమును బాగుగ తెలిసికొని యున్నారు.

*******************************************************************************************  16

అవినాశి తు తద్విద్ధి
యేన సర్వమిదం తతమ్‌,
వినాశమవ్యయస్యాస్య
న కశ్చిత్కర్తుమర్హతి.


ఓ అర్జునా! ఈ సమస్త ప్రపంచమున్ను ఏ పరమాత్మచేత వ్యాపింపబడియున్నదో, అది నాశరహితమైయున్నదని యెరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశము నెవడును కలుగజేయజాలడు.

*******************************************************************************************  17

అంతవంత ఇమే దేహా
నిత్యస్యోక్తాశ్శరీరిణం,
అనాశినో ప్రమేయస్య
తస్మాద్యుధ్యస్వ భారత!


ఓ అర్జునా! నిత్యుడును, నాశరహితుడును, అప్రమేయుడునగు దేహి (ఆత్మ) యొక్క ఈ దేహములు నాశవంతములుగ జెప్పబడినవి.(ఆత్మయో శాశ్వతుడు.) కాబట్టి (ఆత్మనుగూర్చికాని, దేహమును గూర్చికాని శోకమును వదలి) నీవు యుద్ధము చేయుము.

*******************************************************************************************  18



Popular Posts