వృష్ణీనాం వాసుదేవోస్మి
పాణ్డవానాం ధనంజయః,
మునీనామప్యహం వ్యాసః
కవీనా ముశనాకవిః.
నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను (శ్రీకృష్ణుడను), పాండవులలో అర్జునుడను, మునులలో వేదవ్యాస మునీంద్రుడను, కవులలో శుక్రాచార్యుడను అయియున్నాను.
******************************************************************************************* 37
దణ్డో దమయతామస్మి
నీతిరస్మిజిగీషతామ్,
మౌనం చైవాస్మి గుహ్యానాం
జ్ఞానం జ్ఞానవతామహమ్.
నేను దండించువారియొక్క దండనమును (శిక్షయు), జయింప నిచ్చగలవారి యొక్క (జయోపాయమగు) నీతియు అయియున్నాను. మఱియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనైయున్నాను.
******************************************************************************************* 38
యచ్చాపి సర్వభూతానాం
బీజం తదహమర్జున
న తదస్తి వినా యత్స్యా
న్మయా భూతం చరాచరమ్.
ఓ అర్జునా! సమస్త ప్రాణికోట్లకు ఏది మూలకారణమై యున్నదో అదియు నేనే అయియున్నాను. (వెయ్యేల) స్థావరజంగమాత్మకమైన వస్తువేదియు నన్ను వినాగా లేనేలేదు. (నాకంటే వేఱుగలేదు).
******************************************************************************************* 39
నాంతోస్తి మమ దివ్యానాం
విభూతీనాం పరంతప,
ఏష తూద్దేశతః ప్రోక్తో
విభూతేర్విస్తరో మయా.
ఓ అర్జునా! నాయొక్క దివ్యములైన విభూతులకు అంతములేదు. అయినను కొన్నిటిని సంక్షేపముగ నేనిపుడు వివరించి చెప్పితిని.
******************************************************************************************* 40
యద్వద్విభూతిమత్సత్త్వం
శ్రీమదూర్జితమేవ వా,
తత్తదేవావగచ్ఛ త్వం
మమ తేజోంశ సంభవమ్.
(ఈ ప్రపంచమున) ఐశ్వర్యయుక్త మైనదియు కాంతివంతమైనదియు (నిర్మలమైనదియు), ఉత్సాహముతో గూడినదియు (శక్తివంతమైనదియు) నగు వస్తువు (లేక ప్రాణి) ఏది యేది కలదో అది యది నా తేజస్సుయొక్క అంశము వలన కలిగిన దానినిగ నీవెఱుగుము.
******************************************************************************************* 41
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన తవార్జున,
విష్టభ్యాహమిదం కృత్స్న
మేకాంశేన స్థితో జగత్.
అర్జునా! లేక విస్తారమైన ఈ (విభూతి) జ్ఞానముచే నీకేమి ప్రయోజనము? నేనీ జగత్తునంతను ఒక్క అంశముచేతనే వ్యాపించియున్నాను (అని తెలిసికొనుము).
******************************************************************************************* 42
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, విభూతియోగీనామ దశమోధ్యాయః