Followers

Thursday, 6 August 2015

కర్మసన్న్యాసయోగః 3 (అథ పంచమోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


ఇ హైవ తైర్జితః సర్గో
యేషాం సామ్యే స్థితం మనః,
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్బ్రహ్మణి తే స్థితాః.


ఎవని యొక్క మనస్సు సమభావమందు (నిశ్చల సమస్థితియందు, లేక సర్వప్రాణులందును ఆత్మను సమముగ జూచుటలో) స్థిరముగ నున్నదో, అట్టివారీజన్మమునందే జననమరణభూత సంసారమును జయించినవారగుదురు. ఏలయనిన, బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున (సమత్వమందు స్థితిగల) వారు బ్రహ్మమునందున్నవారే యగుదురు.

*******************************************************************************************  19

న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య
నో ద్విజేత్ప్రాప్యచాప్రియమ్‌,
స్థిరబుద్ధి రసమ్మూఢో
బ్రహ్మవిద్బృహ్మణి స్థితః.


స్థిరముగ బుద్ధిగలవాడును, మోహరహితుడును బ్రహ్మమందు నిలకడకలవాడునగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషముగాని అనిష్టమైన దానిని పొందినపుడు దుఃఖమునుగాని పొందకుండును.

*******************************************************************************************  20

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
విందత్యాత్మని యత్సుఖమ్‌,
స బ్రహ్మయోగయుక్తాత్మా
సుఖ మక్షయ మశ్నుతే.


బాహ్యములగు శబ్దాది విషయములం దాసక్తి లేని వాడు ఆత్మయందెట్టి (నిరతిశయ) సుఖముకలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై (బ్రహ్మానుసంధానపరుడై) అక్షయమగు సుఖమును బడయుచున్నాడు.

*******************************************************************************************  21

యే హి సంస్పర్శజా భోగా
దుఃఖయోనయ ఏవతే,
ఆద్యంతవంతః కౌంతేయ
న తేషు రమతే బుధః.


ఓ అర్జునా! (ఇంద్రియ) విషయసంయోగము వలన గలుగు భోగములు దుఃఖహేతువులును, అల్పకాలముండునవియు నయియున్నవి. కావున విజ్ఞుడగువాడు వానియందు క్రిడింపడు, (ఆసక్తిగొనడు).

*******************************************************************************************  22

శక్నోతీ హైవ యస్సోఢుం
ప్రాక్ఛరీర విమోక్షణాత్‌,
కామక్రోధోద్సవం వేగం
న యుక్తః స సుఖీ నరః.


ఎవడీ శరీరమును విడుచుటకు పూర్వమే యిచ్చోటనే (ఈ జన్మయందే) కామక్రోధముల వేగమును అరికట్ట గలుగుచున్నాడో, అతడే యోగియు (చిత్తో పరతిగలవాడును), సుఖవంతుడునగును.

*******************************************************************************************  23

యోంతః సుఖోంతరారామ
స్తథాంతర్జ్యోతిరేవ యః,
స యోగీ బ్రహ్మనిర్వాణం
బ్రహ్మభూతోధిగచ్ఛతి.


ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే ప్రకాశముకలవాడై యుండునో, అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై, బ్రహ్మ సాక్షాత్కారమును (మోక్షమును) బొందును.

*******************************************************************************************  24

లభంతే బ్రహ్మనిర్వాణ
మృషయః క్షీణకల్మషాః,
ఛిన్నద్వైధా యతాత్మానః
సర్వభూతహితేరతాః.


పాపరహితులును, సంశయ వర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీనపరచుకొనినవారును, సమస్తప్రాణుల యొక్క క్షేమమందాసక్తిగలవారునగు ఋషులు (అతీంద్రియజ్ఞానులు) బ్రహ్మసాక్షాత్కారమును (మోక్షమును) బొందుచున్నారు.

*******************************************************************************************  25

కామక్రోధవియుక్తానాం
యతీనాం యతచేతసామ్‌,
అభితో బ్రహ్మనిర్వాణం
వర్తతే విదితాత్మనామ్‌.

కామక్రోధాదులులేనివారును, మనోనిగ్రహముకలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము (మోక్షము, బ్రహ్మానందము) అంతటను (శరీరమున్నపుడును, లేనపుడును సర్వత్ర) వెలయుచునే యున్నది.

*******************************************************************************************  26

స్పర్శాన్‌ కృత్వా బహిర్బాహ్యాం
శ్చక్షుశ్చైవాంతరే భ్రు వోః,
ప్రాణాపానౌ సమౌ కృత్వా
నాసాభ్యంతరచారిణౌ.

యతేంద్రియమ నూబుద్ధి
ర్మునిర్మోక్షపరాయణః
విగతేచ్ఛాభయక్రోధో
యస్సదా ముక్త ఏవ సః

ఎవడు వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివైచి (లోన ప్రవేశింపనీయక) చూపును భ్రూమధ్యముననిలిపి, నాసికాపుటములందు సంచరించు ప్రాణాపానవాయువులను సమముగజేసి ఇంద్రియమనో బుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయక్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై (ఆత్మ) మననశీలుడై యుండునో అట్టి వాడెల్లప్పుడును ముక్తుడేయగును.

*******************************************************************************************  27, 28

భోక్తారం యజ్ఞతపసాం
సర్వలోకమ హేశ్వరమ్‌,
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి.

యజ్ఞములయొక్కయు తపస్సుయొక్కయు భోక్త ( ఫలములనుభవించువాడు) గను, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు ( ప్రభువు, శాసకుడు) గను, సమస్తప్రాణులయొక్క హితకారిగను నన్నెఱిగి మనుజుడు శాంతిని బొందుచున్నాడు.

*******************************************************************************************  29

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, కర్మసన్న్యాసయోగో నామ పఞ్చమోధ్యాయః


Popular Posts