యథైధాంసి సమిద్ధోగ్ని
ర్భస్మసాత్కురుతేర్జున,
జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా.
అర్జునా! బాగుగ ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెల నేప్రకారము బూడిదగాజేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్తకర్మములను భస్మ మొనర్చివైచుచున్నది.
******************************************************************************************* 37
న హి జ్ఞానేన సదృశం
పవిత్ర మిహ విద్యతే,
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విందతి.
ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు. అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగ పొందుచున్నాడు .
******************************************************************************************* 38
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః,
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి
మచిరేణాధిగచ్చతి.
(గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.
******************************************************************************************* 39
అజ్ఞ శ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి,
నాయం లోకోస్తి న పరో
న సుఖం సంశయాత్మనః.
జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.
******************************************************************************************* 40
యోగసన్మ్యస్త కర్మాణం
జ్ఞాన సంఛిన్న సంశయమ్,
ఆత్మవంతం న కర్మాణి
నిబధ్నంతి ధనంజయ.
ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని (బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు.
******************************************************************************************* 41
తస్మాదజ్ఞాన సంభూతం
హృత్థ్సం జ్ఞానాసినాత్మనః,
ఛిత్వైనం సంశయం యోగ
మాతిష్ఠోత్తిష్ఠ భారత.
ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, అజ్ఞానము వలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే చేదించివైచి నిష్కామకర్మయోగము నాచరించుము. లెమ్ము.
******************************************************************************************* 42
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః