Followers

Saturday 8 August 2015

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః 3 ( అథ త్రయోదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత


ఉపద్రష్టానుమంతా చ
భర్తా భోక్తా మహేశ్వరః,
పరమాత్మేతి చాప్యుక్తో
దేహే స్మింపురుషః పరః.


పురుషుడు (ఆత్మ ) ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేఱైనవాడును, సాక్షిభూతుడును, అనుమతించువాడును, ధరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్ప ప్రభువు, నియామకుడును), పరమాత్మయు, అని చెప్పబడుచున్నాడు .

******************************************************************************************* 23

య ఏవం వేత్తి పురుషం
ప్రకృతిం చ గుణైస్సహ,
సర్వథా వర్తమానోపి
న స భూయోభిజాయతే.


ఎవడీ ప్రకారముగ పురుషుని (ఆత్మను) గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, అత డే విధముగ నున్నప్పటికిని మఱల జనింపదు.

******************************************************************************************* 24

ధ్యానేనాత్మని పశ్యంతి
కేచిదాత్మాన మాత్మనా,
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే.


ఆత్మను (ప్రత్యగాత్మను లేక పరమాత్మను) కొందఱు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగముద్వారా తమయందు గాంచుచున్నారు. సాక్షాత్కరించుకొనుచున్నారు. అట్లే మఱికొందరు సాంఖ్యయోగము చేతను, ఇంక కొందఱు కర్మయోగముచేతను చూచుచున్నారు. (అనుభూత మొనర్చుకొనుచున్నారు).

******************************************************************************************* 25

అన్యే త్వేవమజానంతః
శ్రుత్వాన్యేభ్య ఉపాసతే,
తేపి చాతితరంత్యేవ
మృత్యుం శ్రుతిపరాయణాః.


మఱికొందఱైతే ఈ ప్రకారముగ (ధ్యాన సాంఖ్య కర్మయోగమువలన) తెలిసికొనజాలనివారై, ఇతరుల వలన (ఆ పరమాత్మనుగూర్చి) విని ఉపాసించుచున్నారు (అనుష్ఠించుచున్నారు). శ్రవణ తత్పరులగువారున్ను మృత్యువును (మృత్యురూపమగు ఈ సంసారమును) తప్పక దాటుదురు.

******************************************************************************************* 26

యావత్సఞ్జాయతే కిఞ్చి
త్సత్త్వం స్థావర జజ్గమమ్‌,
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా
త్తద్విద్ధి భరతర్షభ.


భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఈ ప్రపంచమున స్థావరజంగమాత్మకమగు పదార్థమేదేది పుట్టుచున్నదో, అదియది యంతయు క్షేత్రక్షేత్రజ్ఞుల కూడిక వలనే కలుగుచున్నదని యెఱుగుము.

******************************************************************************************* 27

సమం సర్వేషు భూతేషు
తిష్ఠంతం పరమేశ్వరమ్‌,
వినశ్యత్స్వవినశ్యంతం
యః పశ్యతి స పశ్యతి.


సమస్త ప్రాణులందును సమముగ నున్నట్టి పరమాత్మను, ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశింపనివానినిగ ఎవడు చూచుచున్నాడో (తెలిసికొనుచున్నాడో) ఆతడే నిజముగ చూచువాడగును (విజ్ఞుడని భావము).

******************************************************************************************* 28

సమం పశ్యణి సర్వత్ర
సమవస్థిత మీశ్వరమ్‌,
న హినస్త్యాత్మ నాత్మానం
తతో యాతి పరాం గతిమ్‌.


ఏలయనగా సమస్త ప్రాణుల యందును లెస్సగ వెలయుచున్నట్టి పరమాత్మను సమముగ వ్యాపించి యున్నట్లు జూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున సర్వోత్తమగతిని (మోక్షమును) బొందుచున్నాడు.

******************************************************************************************* 29

ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశః,
యః పశ్యతి తథాత్మాన
మకర్తారం స పశ్యతి‌.


ఎవడు కర్మలను ప్రకృతిచేతనే సర్వవిధముల చేయబడుచున్నట్లు గను, అట్లే ఆత్మను కర్తకానివానిగను చూచుచున్నాడో (తెలిసికొనుచున్నాడో) ఆతడే నిజముగ చూచుచున్నవాడగును.

******************************************************************************************* 30


Popular Posts