మరో ఆసక్తికరమైన అంశం కూడా మట్టివినాయకుల
తయారీ విధానంలో ఇమిడి ఉంది. అదేమంటే, మట్టి
ప్రతిమలను పూజాదికాలు పూర్తయ్యాక, పత్రితోనూ,
నవధాన్యాలతోనూ కలిపి ఇంటిపెరడులోని చెట్టకింద
ఉంచేవారు. అందులోకూడా బలహీనంగా ఉన్న
చెట్టుకింద
ఉంచితే, ఆ చెట్టు త్వరగా , ఏపుగా పెరుగుతుందని
కూడా
విశ్వసించేవారు. ఇందులో దాగున్న అసలు విషయం
ఏమంటే, పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని
విశిష్టగుణాలు ఉండటమే. దీంతో పత్రి సమేత వినాయక
ప్రతిమ , వానల కారణంగా భూమిలోకి ఇంకి, పక్కనే
ఉన్న చెట్టుకు బలం చేకూరుస్తుంది. ఆతర్వాత కాలంలో
వినాయక విగ్రహాల నిమజ్జనం చోటుచేసుకున్నట్టు చరిత్ర
చెబుతున్న సత్యం.