Followers

Tuesday, 3 September 2013

శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన 
జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. 
నలుగుపిండితో తయారైన బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసింది 
ఆది శక్తి పార్వతీదేవి. అనంతరం, ఏనుగు తలను 
అతికించి పునఃప్రాణప్రతిష్ఠ చేశారు ఆదిదేవుడు 
పరమేశ్వరుడు. ఆనాటి నుంచి యుగాలు దొర్లుతున్నా, 
కాలం మారుతున్నా, మహాగణపతి 
పూజలందుకుంటూనే 
ఉన్నాడు.
సమాజంలో అనేక వర్గాలవారుంటారు. వారందరినీ, 
కలిపి 
మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో 
కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో 
సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక 
జనన రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి 
గజ శిరస్సు అమర్చడం, ఆపైన మూషికుడ్ని 
(ఎలుకను) 
వాహనంగా అమర్చడంలోనే సర్వప్రాణులు సమానమనే 
అర్థం స్ఫురిస్తోంది. ఆహారంగా ఔషధ మొక్కల ఆకులు 
తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

Popular Posts