Followers

Thursday, 6 March 2014

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 11



1. శమ దమ తపః శౌచం తితిక్ష ఉపరతి (విషయముల యందు ఇంద్రియాలు ప్రవర్తించకుండా ఆపుట ఆత్మా రామం.),  ఈ ఆరు అందరికీ ఉండాల్సినవి. అహింస సత్యం అస్తేయం (దొంగతనం చేయకపోవుట) అనసూయ ఉండాలి, అమర్షమూ (ఎదుటివారి వృద్ధిని చూచి సహించకపోవడం), లోలుపత ఉండకుండుట , - ఈ పన్నెండు గుణాలూ బ్రాహ్మణుడికి ఉండాలి.

2. వివాద శీలాం స్వయం అర్థ చోరిణి బహ్వాశినీం నిష్టుర వాక్య బాషిణీం దివాస్వపాం 
భక్తి ప్రజా విహీనాం, (భర్త యందూ భగవంతుని యందూ భక్తి లేనిదీ) అపి జహ్యాత్ శత పుత్ర మాతరం 
ఇలాంటి భార్య విడువదగినది 

3. రుచి మీదకు మనసు పోతే తినాలన్న ఆశ కలుగుతుంది,ఆహరం మీద లోలుపత్వం వస్తుంది, అది శరీరాన్ని బాగా బలిపిస్తుంది, దాని వలన శొమరితనమూ, శొమరితనం వలన అనాచారం, అనాచరం వలన భ్రష్టత వస్తుంది. శరీరమూ మనసూ పాడవుతుంది.

4. నిత్యానుభూతనిజలాభనివృత్తతృష్ణః
శ్రేయస్యతద్రచనయా చిరసుప్తబుద్ధేః
లోకస్య యః కరుణయాభయమాత్మలోకమ్
ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై

ఈ శ్లోకం నిత్యానుసంధానం. దీని వలన భక్తి మీద భక్తి కలుగుతుంది. నిరంతరం అనుభవించే సమస్త ఆనందములతో తనను తాను చూచుకుని ఆనందించి తృప్తి పొందినవాడు. ఆయనకు ఇది కావాలీ ఇది వద్దూ అన్న భావన లేదు. సాంసారిక విషయాల యందు మనసు ప్రసరించదు. సంసారములో ప్రవర్తించేవాడి బుద్ధి మోక్షాన్ని చూడలేక నిదురపోతూ ఉంటుంది. యోగమాయతో తనలోకం ఇలా ఉంటుంది, తన లోకాన్ని చేరాలి అని ఏ మహానుభావుడు చెప్పాడో అటువంటి వృషభ దేవునికి నమస్కారము. ఇది వృషభ ద్వాదశి. నిత్యానుసంధానం చేసుకోవలసినది

5. హేతు త్రయంతు నిద్రాయ: స్వభార్య, పుస్తకం, జపం
హేతు త్రయంతు అనిద్రాయా: జ్యూతం విత్తం పరాంగన 

6. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే
విశుద్ధసత్త్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి

ఈ మంత్రాన్ని జపిస్తూ. ఐశ్వర్యానికీ సంతానానికీ మానసిక దిగులు లేకుండా ఉండటానికి దీన్ని జపించాలి

7. సర్వభూతప్రియో హరిః -  పరమాత్మంటే సకల ప్రాణులకీ ప్రియుడు.

Popular Posts