Followers

Monday 24 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదిహేనవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఊచతుర్మృతకోపాన్తే పతితం మృతకోపమమ్
శోకాభిభూతం రాజానం బోధయన్తౌ సదుక్తిభిః

సంతానం కలిగితే అన్ని దుఃఖాలూ పోతాయి అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు. పుట్టిన వారు శాశ్వతముగా ఉంటారు అని ఎవరైనా మాట ఇచ్చారా, ఇవ్వగలరా? మొన్నటి వరకూ ఇతనెవరో నీకు తెలీదు. ప్రవాహములో కలిసిన కట్టెలు ఆ కలిసిన కాసేపూ నీవు భార్యా పిల్లలూ అంటూ ఉండడం సమంజసమా. ప్రవాహములో కట్టెలు కలిసినట్లుగా మానవులు కూడా కలుస్తూ ఉంటారూ విడిపోతూ ఉంటారు. ప్రతీ వరి గింజలో బియ్యపు గింజ ఉంటుందా. ఆన్ని భూమి నుంచి వచ్చినవే అయినా ఎంత తేడా ఉంటుంది.

కోऽయం స్యాత్తవ రాజేన్ద్ర భవాన్యమనుశోచతి
త్వం చాస్య కతమః సృష్టౌ పురేదానీమతః పరమ్

యథా ప్రయాన్తి సంయాన్తి స్రోతోవేగేన బాలుకాః
సంయుజ్యన్తే వియుజ్యన్తే తథా కాలేన దేహినః

యథా ధానాసు వై ధానా భవన్తి న భవన్తి చ
ఏవం భూతాని భూతేషు చోదితానీశమాయయా

వయం చ త్వం చ యే చేమే తుల్యకాలాశ్చరాచరాః
జన్మమృత్యోర్యథా పశ్చాత్ప్రాఙ్నైవమధునాపి భోః

భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హన్తి చ
ఆత్మసృష్టైరస్వతన్త్రైరనపేక్షోऽపి బాలవత్

ఇదంతా పరమాత్మ మాయతో జరుగుతుంది. మీరు కానీ మేము కానీ సకల సృష్టి గానీ. మనమిపుడు పుట్టాము, కొన్నాళ్ళకు మరణిస్తాము,  ఇలా సృష్టి స్థితి లయమూ జరుగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంటే మనం చావే వద్దని అంటాము, కష్టాలూ దరిద్రమూ వద్దని అంటాము. కానీ మనమస్వతంత్ర్యులము. పరమత్మ ఏమిస్తే అది తీసుకోవాలి. ఏదిస్తే అది ఎప్పుడిస్తే అప్పుడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అక్కడ మన ఇష్టమే లేదు.  మనకు స్వాతంత్ర్యం లేదు. శరీరం నీదైతే నీవనుకున్న నాడు ఉంటుందా. నాది అనుకుంటున్న దేహమే పోతున్నది. ఆ దేహముతో ఇంకో దేహం వస్తోంది. వచ్చిన దేహం ముందు పోతోందా, ఉన్న దేహం పోతోందా? అది మనం చెప్పలేము. 

దేహేన దేహినో రాజన్దేహాద్దేహోऽభిజాయతే
బీజాదేవ యథా బీజం దేహ్యర్థ ఇవ శాశ్వతః

ఒక విత్తమనముతో ఒక పైరు ఇంకో విత్తనముతో ఇంకో పైరూ వస్తుంది. కష్టపడి వేసిన పంటని మనమెలా కోస్తామో మన జీవితాలూ అంతే. మనం చేయదగినది ఏదీ ఉండదు. నీవెందుకు బాధపడుతున్నావు. 

దేహదేహివిభాగోऽయమవివేకకృతః పురా
జాతివ్యక్తివిభాగోऽయం యథా వస్తుని కల్పితః

ఈ శరీరమే ఆత్మ అనే వాదమే బుద్ధిలేని మాట. జాతి వస్తువు ధనం ఇల్లూ పిల్లలూ సంపదలూ వర్ణములూ అన్ని దేహాన్ని బట్టే. 

శ్రీశుక ఉవాచ
ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోక్తిభిః
విమృజ్య పాణినా వక్త్రమాధిమ్లానమభాషత

ఇలా అంగిరసుడు రాజును ఓదార్చాడు. అప్పుడు ముఖమును కడుగుకొని రాజు ఇలా అన్నాడు

శ్రీరాజోవాచ
కౌ యువాం జ్ఞానసమ్పన్నౌ మహిష్ఠౌ చ మహీయసామ్
అవధూతేన వేషేణ గూఢావిహ సమాగతౌ

ఇంత కష్టములో ఉన్న మమ్ములను ఓదార్చి అవధూత వేషములో ఉన్న బ్రాహ్మణోత్తములు ఎవరు మీరు 

చరన్తి హ్యవనౌ కామం బ్రాహ్మణా భగవత్ప్రియాః
మాదృశాం గ్రామ్యబుద్ధీనాం బోధాయోన్మత్తలిఙ్గినః

కుమారో నారద ఋభురఙ్గిరా దేవలోऽసితః
అపాన్తరతమా వ్యాసో మార్కణ్డేయోऽథ గౌతమః
వసిష్ఠో భగవాన్రామః కపిలో బాదరాయణిః
దుర్వాసా యాజ్ఞవల్క్యశ్చ జాతుకర్ణస్తథారుణిః
రోమశశ్చ్యవనో దత్త ఆసురిః సపతఞ్జలిః
ఋషిర్వేదశిరా ధౌమ్యో మునిః పఞ్చశిఖస్తథా
హిరణ్యనాభః కౌశల్యః శ్రుతదేవ ఋతధ్వజః
ఏతే పరే చ సిద్ధేశాశ్చరన్తి జ్ఞానహేతవః

వీరందరిలో మీరు ఒకరు అయ్యి ఉంటారు. దుఃఖములో ఉన్న మాకు జ్ఞ్యాన దీపం ఇవ్వాలని అనుకుంటున్నారు.

తస్మాద్యువాం గ్రామ్యపశోర్మమ మూఢధియః ప్రభూ
అన్ధే తమసి మగ్నస్య జ్ఞానదీప ఉదీర్యతామ్

శ్రీఙ్గిరా ఉవాచ
అహం తే పుత్రకామస్య పుత్రదోऽస్మ్యఙ్గిరా నృప
ఏష బ్రహ్మసుతః సాక్షాన్నారదో భగవానృషిః

నీకు సంతానం కావాలంటే నేను నీకు సంతానం ప్రసాదించాను. ఈయన సాక్షాత్ నారదుడు. బ్రాహ్మణ భక్తుడవైన నీవు దుఃఖించకూడదని దయతో మేము వచ్చాము. 

ఇత్థం త్వాం పుత్రశోకేన మగ్నం తమసి దుస్తరే
అతదర్హమనుస్మృత్య మహాపురుషగోచరమ్

అనుగ్రహాయ భవతః ప్రాప్తావావామిహ ప్రభో
బ్రహ్మణ్యో భగవద్భక్తో నావాసాదితుమర్హసి

తదైవ తే పరం జ్ఞానం దదామి గృహమాగతః
జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదామ్యహమ్

అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే
ఏవం దారా గృహా రాయో వివిధైశ్వర్యసమ్పదః

నీకు సంతానాన్ని ఇందుకే ఇచ్చాము. సంతానం ఉన్న లేకున్నా వారికోసమే ఏడుపు. నిరంతరం దుఃఖం కలిగించే సంతానాన్ని కోరడం తెలివి ఉన్నవారు చేసే పనేనా? సంతానం పేరుతో ఉన్న దుఃఖం బాధా అర్థం కావాలనే సంతానాన్ని ఇచ్చాము. ఇపుడు అర్థమయ్యిందా. భార్య ఇలూ అయినా ఇంతే. సంసారం అంటేనే బాధ.

శబ్దాదయశ్చ విషయాశ్చలా రాజ్యవిభూతయః
మహీ రాజ్యం బలం కోషో భృత్యామాత్యసుహృజ్జనాః

సర్వేऽపి శూరసేనేమే శోకమోహభయార్తిదాః
గన్ధర్వనగరప్రఖ్యాః స్వప్నమాయామనోరథాః

ఇవన్నీ పగటి కలల లాంటివి (గన్ధర్వనగరప్రఖ్యాః ).

దృశ్యమానా వినార్థేన న దృశ్యన్తే మనోభవాః
కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసోऽభవన్

వీటిలో ఏది ఉన్నా దుఃఖమే. దేహమంటేనే దుఃఖము. శరీరం కలవానికి శరీరమే అన్ని తాపములనూ కలిగిస్తుంది.

అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞానక్రియాత్మకః
దేహినో వివిధక్లేశ సన్తాపకృదుదాహృతః

తస్మాత్స్వస్థేన మనసా విమృశ్య గతిమాత్మనః
ద్వైతే ధ్రువార్థవిశ్రమ్భం త్యజోపశమమావిశ

బుద్ధిమంతుడవై "నేనంటే" ఎవరు అన్న దాని గురించి ఆలోచించు. అర్థం లేని దుఃఖాన్ని విడిచ్పెట్టు

శ్రీనారద ఉవాచ
ఏతాం మన్త్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతో మమ
యాం ధారయన్సప్తరాత్రాద్ద్రష్టా సఙ్కర్షణం విభుమ్

మేము నీ మీద దయకలిగి వచ్చాము. ఈ మంత్రాన్ని జపిస్తే ఏడు రోజులలో నీకు ఆదిశేషుడు (సంకర్షణుడు) సాక్షాత్కరిస్తాడు. 

యత్పాదమూలముపసృత్య నరేన్ద్ర పూర్వే
శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య
సద్యస్తదీయమతులానధికం మహిత్వం
ప్రాపుర్భవానపి పరం న చిరాదుపైతి

బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా సంకర్షణ ఉపాసనచే అంతటి మహిమను పొందారు. నీవు కూడా సంకర్షణుని ఉపాసన చేయవలసినదని నారదుడు చిత్రకేతునికి చెప్పాడు.

Popular Posts