Followers

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదకొండవ అధ్యాయం

       

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీశౌనక ఉవాచ
అథేమమర్థం పృచ్ఛామో భవన్తం బహువిత్తమమ్
సమస్తతన్త్రరాద్ధాన్తే భవాన్భాగవత తత్త్వవిత్

ఇంకో విషయం ఉంది, అడుగుతున్నాము. ఉన్న సకల శాస్త్రములలో భాగవత తత్వం తెలిసింది మీకు ఒక్కరికే

తాన్త్రికాః పరిచర్యాయాం కేవలస్య శ్రియః పతేః
అఙ్గోపాఙ్గాయుధాకల్పం కల్పయన్తి యథా చ యైః

తాంత్రికులు పరమాత్మ యొక్క ఆరాధన చేస్తారు శ్రియః పతికి
అవయవములూ ఉప అవయవములూ ఆయుధములనూ ఆరాధిస్తారు కదా

తన్నో వర్ణయ భద్రం తే క్రియాయోగం బుభుత్సతామ్
యేన క్రియానైపుణేన మర్త్యో యాయాదమర్త్యతామ్

వీటి తత్వం ఏమిటి. ఇలాంటి దాన్ని చేస్తే మానవుడు అమర్త్యుడవుతాడు

సూత ఉవాచ
నమస్కృత్య గురూన్వక్ష్యే విభూతీర్వైష్ణవీరపి
యాః ప్రోక్తా వేదతన్త్రాభ్యామాచార్యైః పద్మజాదిభిః

పరమాత్మ యొక్క విభూతులు చెప్పండి
కౌస్తుభం, శంఖం చక్రం మొదలైన్వాటి తత్వం ఏమిటి
బ్రహ్మా వశిష్టుడు విశ్వక్సేనుడు మొదలైన మునులు ఏమేమి చేసారో

మాయాద్యైర్నవభిస్తత్త్వైః స వికారమయో విరాట్
నిర్మితో దృశ్యతే యత్ర సచిత్కే భువనత్రయమ్

పరమాత్మ తొమ్మిది రకముల తత్వములతో సకల ప్రపంచం యొక్క వికారములను చూపెడతాడు, తాను ఉంటాడు.
జీవుడితో ఉన్న సకల జగములు మూడింటిలో పరమాత్మ వేంచేసి ఉన్నాడు

ఏతద్వై పౌరుషం రూపం భూః పాదౌ ద్యౌః శిరో నభః
నాభిః సూర్యోऽక్షిణీ నాసే వాయుః కర్ణౌ దిశః ప్రభోః

పాదములు భూమి.
ద్యు లోకం అనేది ఆయన శిరో భాగం
ఆకాశం ఆయన నాభి
సూర్యుడు నేత్రములు
వాయువు నాసిక
కర్ణములు దిక్కులు

ప్రజాపతిః ప్రజననమపానో మృత్యురీశితుః
తద్బాహవో లోకపాలా మనశ్చన్ద్రో భ్రువౌ యమః

ప్రజాపతి ప్రజననమూ
అపానము మృత్యువు
బాహువులు లోకపాలకులు
మనసు చంద్రుడు
కనుబొమ్మలు యముడు

లజ్జోత్తరోऽధరో లోభో దన్తా జ్యోత్స్నా స్మయో భ్రమః
రోమాణి భూరుహా భూమ్నో మేఘాః పురుషమూర్ధజాః

లజ్జ పైపెదవి
లోభము కిందిపెదవు
దంతములు వెన్నెల
నవ్వు భ్రమ
రోమాలు వృక్షములు
కేశములు మేఘములు

యావానయం వై పురుషో యావత్యా సంస్థయా మితః
తావానసావపి మహా పురుషో లోకసంస్థయా

ఈయన ఎంత ఉన్నాడో ఏ రూపములో ఉన్నాడో , ఎన్ని లోకాలను మనం చూస్తున్నామో అది అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు

కౌస్తుభవ్యపదేశేన స్వాత్మజ్యోతిర్బిభర్త్యజః
తత్ప్రభా వ్యాపినీ సాక్షాత్శ్రీవత్సమురసా విభుః

కౌస్తుభం అంటే జీవాత్మ
సకల ఆత్మలను కౌస్తుభముగా చేసుకుని తన హృదయములో ధరించాడు. అందుకే అది సముద్రములోంచి పుట్టింది. దాని కాంతే అంతటా వ్యాపిస్తుంది

స్వమాయాం వనమాలాఖ్యాం నానాగుణమయీం దధత్
వాసశ్ఛన్దోమయం పీతం బ్రహ్మసూత్రం త్రివృత్స్వరమ్

వనమాల పరమాత్మ యొక్క మాయ. ఇది నానా గుణములు కలది. స్వామి యొక్క పీతాంబరం సకల వేదమయము
యజ్ఞ్యోపవీతమే ఓంకారము

బిభర్తి సాఙ్ఖ్యం యోగం చ దేవో మకరకుణ్డలే
మౌలిం పదం పారమేష్ఠ్యం సర్వలోకాభయఙ్కరమ్

స్వామికి ఉన్న మకర కుండలాలు ఒకటి సాంఖ్యము రెండవది యోగము.
కిరీటము పారమేష్ఠ్యము. సకల లోకములకూ అభయాన్ని ఇచ్చేది

అవ్యాకృతమనన్తాఖ్యమాసనం యదధిష్ఠితః
ధర్మజ్ఞానాదిభిర్యుక్తం సత్త్వం పద్మమిహోచ్యతే

స్వామి యొక్క ఆసనం అనంతం - అంటే ప్రకృతి.
స్వామి ఉండే పద్మము ధర్మమూ జ్ఞ్యానమూ వైరాగ్యమూ ,మొదలైనవి గలిగి ఉంటుంది
ఈ సత్వాన్ని పద్మం అని అంటారు

ఓజఃసహోబలయుతం ముఖ్యతత్త్వం గదాం దధత్
అపాం తత్త్వం దరవరం తేజస్తత్త్వం సుదర్శనమ్

గద ముఖ్య తత్వము
శంఖం అంటే జలతత్వం
చక్రం తేజస్సు

నభోనిభం నభస్తత్త్వమసిం చర్మ తమోమయమ్
కాలరూపం ధనుః శార్ఙ్గం తథా కర్మమయేషుధిమ్

ఖడ్గం ఆకాశ తత్వం
చర్మం తమో మయము
శాంఖం కాలరూపము
అమ్ములపొది కర్మమయము

ఇన్ద్రియాణి శరానాహురాకూతీరస్య స్యన్దనమ్
తన్మాత్రాణ్యస్యాభివ్యక్తిం ముద్రయార్థక్రియాత్మతామ్

ఆయనన్ బాణములు ఇంద్రియములు
మన సంస్కారాలు ఆయన రథములు
తన్మాత్రలు ఆయన అభివ్యక్తి

మణ్డలం దేవయజనం దీక్షా సంస్కార ఆత్మనః
పరిచర్యా భగవత ఆత్మనో దురితక్షయః

మండలం దేవుని ఆరాధన
ఇదంతా భగవంతుని పరిచర్య

భగవాన్భగశబ్దార్థం లీలాకమలముద్వహన్
ధర్మం యశశ్చ భగవాంశ్చామరవ్యజనేऽభజత్

స్వామి వద్ద ఉండే పద్మం భగ శబ్దానికి అర్థం
జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు భగ శబ్దానికి అర్థం
ధర్మము చామరం
కీర్తి వ్యజనం

ఆతపత్రం తు వైకుణ్ఠం ద్విజా ధామాకుతోభయమ్
త్రివృద్వేదః సుపర్ణాఖ్యో యజ్ఞం వహతి పూరుషమ్

వైకుంఠము ఆతపత్రము
వేదము గరుత్మంతుడు. ఈయన యజ్ఞ్య పురుషున్ని వహిస్తాడు

అనపాయినీ భగవతీ శృః సాక్షాదాత్మనో హరేః
విష్వక్షేనస్తన్త్రమూర్తిర్విదితః పార్షదాధిపః
నన్దాదయోऽష్టౌ ద్వాఃస్థాశ్చ తేऽణిమాద్యా హరేర్గుణాః

పరమాత్మ ఆత్మ అమ్మవారు
విశ్వక్సేనుడు తంత్రానికి ప్రతినిధి
అష్ట ద్వారపాలకులు అష్ట సిద్ధులకు ప్రతీక

వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నః పురుషః స్వయమ్
అనిరుద్ధ ఇతి బ్రహ్మన్మూర్తివ్యూహోऽభిధీయతే

వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనే తత్వాలు పరమాత్మే. అవి ఆయన వ్యూహములు

స విశ్వస్తైజసః ప్రాజ్ఞస్తురీయ ఇతి వృత్తిభిః
అర్థేన్ద్రియాశయజ్ఞానైర్భగవాన్పరిభావ్యతే

వీటినే విస్మ విశ్వ తైజసా ప్రాజ్ఞ్య తురీయ అని చెప్పుకుంటాము
అర్థ ఇంద్రియ ఆశయ జ్ఞ్యాన అనే భావాలతో ఈయనే తెలియబడతాడు

అఙ్గోపాఙ్గాయుధాకల్పైర్భగవాంస్తచ్చతుష్టయమ్
బిభర్తి స్మ చతుర్మూర్తిర్భగవాన్హరిరీశ్వరః

ఈ నాలుగూ పైన చెప్పిన అంగములూ ఉపాంగములూ అవయవములూ ఆయుధములూ కలసి పరమాత్మ ఉంటాడు
ఈయనే నాలుగు రూపములతో ఉంటాడు

ద్విజఋషభ స ఏష బ్రహ్మయోనిః స్వయందృక్
స్వమహిమపరిపూర్ణో మాయయా చ స్వయైతత్
సృజతి హరతి పాతీత్యాఖ్యయానావృతాక్షో
వివృత ఇవ నిరుక్తస్తత్పరైరాత్మలభ్యః

ఈయనే బ్రహ్మయోని
స్వయం ప్రకాశకుడు
తన మాయతో తానే పరిపూర్ణుడు
సృష్టిస్తాడూ సంహరిస్తాడూ రక్షిస్తాడు
వివరించబడిన వేదార్థములాగ భగవంతుని భక్తులకు మాత్రమే ఈయన లభిస్తాడు

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభావనిధ్రుగ్
రాజన్యవంశదహనానపవర్గవీర్య
గోవిన్ద గోపవనితావ్రజభృత్యగీత
తీర్థశ్రవః శ్రవణమఙ్గల పాహి భృత్యాన్

శ్రీకృష్ణా, అర్జున సఖా, భూమికి ద్రోహం చేసిన రాజుల వధించినవాడా
మోక్ష వీర్యం గలవాడా
గోపికల చేతా గోపాలుర చేతా కీర్తించబడిన కీర్తి గలవాడా
మీ భక్తుల కాపాడు
శ్రీ కృష్ణా!యదుభూషణా!నరసఖా!శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా!దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!

నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

య ఇదం కల్య ఉత్థాయ మహాపురుషలక్షణమ్
తచ్చిత్తః ప్రయతో జప్త్వా బ్రహ్మ వేద గుహాశయమ్

ఈ మహాపురుష లక్షణాలను పొద్దున్నే లేచి ఆయన యందే మనసు ఉంచి అధయయనం చేస్తే పరబ్రహ్మ జ్ఞ్యానం కలుగుతుంది

శ్రీశౌనక ఉవాచ
శుకో యదాహ భగవాన్విష్ణురాతాయ శృణ్వతే
సౌరో గణో మాసి మాసి నానా వసతి సప్తకః

పరీక్షిత్తుకి శుకయోగీంద్రుడు సూర్యభగవానుని గురించి చెప్పాడని చెప్పారు.
సూర్యభగవానుడు ఒక్కో నెలా ఒక్కో రూపముతో తమ గణముతో(గణసప్తకం) కలసి సంచరిస్తాడు

తేషాం నామాని కర్మాణి నియుక్తానామధీశ్వరైః
బ్రూహి నః శ్రద్దధానానాం వ్యూహం సూర్యాత్మనో హరేః

వారి పేర్లేమిటి వారేమి చేస్తారో చెప్పవలసింది.
దీన్ని సూర్యవ్యూహం అంటారు. సంధ్యావందన యోగ్యత లేని వారు ఈ సూర్యవ్యూహాన్ని రోజూ అధయయనం చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో బ్రాహ్మణులుగా చెబుతారు

సూత ఉవాచ
అనాద్యవిద్యయా విష్ణోరాత్మనః సర్వదేహినామ్
నిర్మితో లోకతన్త్రోऽయం లోకేషు పరివర్తతే

పరమాత్మ యొక్క మాయతో పరమాత్మ యొక్క సంకల్పమే ఈ లోక తంత్రముగా వ్యవహరిస్తున్నారు

ఏక ఏవ హి లోకానాం సూర్య ఆత్మాదికృద్ధరిః
సర్వవేదక్రియామూలమృషిభిర్బహుధోదితః

సకల లోకములను పరిపాలింపచేసేవాడు లోకములను నాశం చేసేవాడు సూర్యభగవానుడు
అన్ని వేదాలకూ క్రియలకూ సూర్యుడే మూలం అని ఋషులు చాలా విధాలుగా చెప్పి ఉన్నారు.

కాలో దేశః క్రియా కర్తా కరణం కార్యమాగమః
ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్నవధోక్తోऽజయా హరిః

పరమాత్మ మాయ తొమ్మిది రకాలుగా ఉంటుంది
కాలమూ దేశమూ క్రియా కర్తా కరణం కార్యం ఆగమం ద్రవ్యం ఫలం

మధ్వాదిషు ద్వాదశసు భగవాన్కాలరూపధృక్
లోకతన్త్రాయ చరతి పృథగ్ద్వాదశభిర్గణైః

కాలరూపధారి ఐన సూర్యభగవానుడు మధ్వాది మాసం (మధు  - చైత్రం, మాధవ - వైశాఖం శుక్ర జ్యేష్ఠం శుచి - ఆషాడం) చైత్రాది మాసాలలో స్వామి సకల లోకాలనూ కాపాడడానికి తన గణములతో తిరుగుతాడు.
విడివిడిగా పన్నెండు గణములు ఉన్నాయి. ఒక్కో నెలా ఒక్కో గణముతో సంచరిస్తాడు

ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ

ధాతా కృతస్థలీ హేతీ వాసుకీ రథకృత్ పులస్త్య తుంబురూ - ఈ ఏడుగురూ మధుమాసములో ఉంటారు
ఈ ఏడుగురిలో ఒక యక్షుడూ ఒక అప్సరసా రాక్షసుడూ సర్పమూ మహర్షి ఒక గాయకుడు ఉంటారు
మొదటివాడు ధాతా - సూర్యునికి కూడా ధాతా అనే పేరు ఉంది. వీరు ఆయన వెంట ఉంటారు

అర్యమా పులహోऽథౌజాః ప్రహేతిః పుఞ్జికస్థలీ
నారదః కచ్ఛనీరశ్చ నయన్త్యేతే స్మ మాధవమ్

వైశాఖ మాసములో ఆయన పేరు అర్యమ.
పులహ ఓజ ప్రహేతీ పుంజకస్థలీ నారద కచ్చనీర అనే గణాలతో సంచరిస్తారు

మిత్రోऽత్రిః పౌరుషేయోऽథ తక్షకో మేనకా హహాః
రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయన్త్యమీ

జ్యేష్ఠ మాసములో మిత్ర అనే పేరుతో
ఋషి పేరు అత్రి.పౌరుషేయుడూ తక్షకుడూ మేనకా హహా, రథస్వన అనే వారు గణాలు

వసిష్ఠో వరుణో రమ్భా సహజన్యస్తథా హుహూః
శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయన్త్యమీ

వసిష్ఠ వరుణా రంభా సహజన్య హుహూ, చిత్రస్వన అనేవారు ఆషాఢ మాసములో తిరుగుతారు

ఇన్ద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాఙ్గిరాః
ప్రమ్లోచా రాక్షసో వర్యో నభోమాసం నయన్త్యమీ

శ్రావణ మాసములో సూర్యునిపేరు ఇంద్రుడు (అందుకే వర్షాలు ఎక్కువ వస్తాయి ఆ మాసములో)
విశ్వావసు శ్రోతా ఏలాతపత్ర అంగీరస ప్రంలోచా రాక్షస వర్య అనే వారు నభో (శ్రావణ) మాసము.

వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః
అనుమ్లోచా శఙ్ఖపాలో నభస్యాఖ్యం నయన్త్యమీ

వివస్వానుడు ఆషఢ మాసములో సూర్యుని పేరు
ఉగ్రసేన వ్యాఘ్ర ఆసారణ భృగు అనుంలోచ శంఖపాల అనే వారు ఆషాఢ మాసములో గణాలు

పూషా ధనఞ్జయో వాతః సుషేణః సురుచిస్తథా
ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయన్త్యమీ

పూష దనంజయ వాత సుషేణ సురుచి ఘృతాచీ గౌతమ - ఆశ్వయుజ మాసము

ఋతుర్వర్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్తథా
విశ్వ ఐరావతశ్చైవ తపస్యాఖ్యం నయన్త్యమీ

ఋతూ వర్చా భరద్వాజ పర్జన్యా సేనజిత్ విశ్వ ఐరావత  అనే గణాలు తపస్య (కార్తీక మాసము)

అథాంశుః కశ్యపస్తార్క్ష్య ఋతసేనస్తథోర్వశీ
విద్యుచ్ఛత్రుర్మహాశఙ్ఖః సహోమాసం నయన్త్యమీ

అంసు, కశ్యప కార్క్ష్య ఋతసేన ఊర్వశీ విద్యుత్ శత్రు మహాశంఖ - సహో (మార్గశీర్ష మాసం)

భగః స్ఫూర్జోऽరిష్టనేమిరూర్ణ ఆయుశ్చ పఞ్చమః
కర్కోటకః పూర్వచిత్తిః పుష్యమాసం నయన్త్యమీ

భగ (సూర్య్నిపేరు) , స్పూర్జ అరిష్టనేమి ఊర్ణ ఆయు కర్కోటక పూర్వచిత్తీ - పుష్య మాసము

త్వష్టా ఋచీకతనయః కమ్బలశ్చ తిలోత్తమా
బ్రహ్మాపేతోऽథ సతజిద్ధృతరాష్ట్ర ఇషమ్భరాః

త్వష్ట - మాఘ మాసములో సూర్యునిపేరు
కంబలా తిలోత్తమా బ్రహ్మాపేతా సతహిత్ దృతరాష్ట్ర ఇషంభర

విష్ణురశ్వతరో రమ్భా సూర్యవర్చాశ్చ సత్యజిత్
విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయన్త్యమీ

విష్ణు - సూర్యుని పేరు
అశ్వతరా రంభా సూర్య వర్చా సత్యజిత్ విశ్వామిత్ర మఖాపేత ఊర్జమాసములో

ఏతా భగవతో విష్ణోరాదిత్యస్య విభూతయః
స్మరతాం సన్ధ్యయోర్నౄణాం హరన్త్యంహో దినే దినే

ఇలా పన్నెండు నెలలలో సూర్యభగవానుని పన్నెండు విభూతులు చెబుతున్నాము
సంధ్యా సమయములో దీన్ని ప్రతీ రోజూ అనుసంధానం చేస్తే సంధ్యావంద ఫలితం బ్రహ్మజ్ఞ్యానమూ కలుగుతుంది

ద్వాదశస్వపి మాసేషు దేవోऽసౌ షడ్భిరస్య వై
చరన్సమన్తాత్తనుతే పరత్రేహ చ సన్మతిమ్

ఈ పన్నెండు నెలలలో ప్రతీ నెలలోనూ తాను కాక ఇంకొక ఆరుగురు తన గణముతో తిరుగుతూ
ఈ లోకములోనూ పరలోకములోనూ అందరికీ ఉత్తమ బుద్ధిని కలిగిస్తాడు

సామర్గ్యజుర్భిస్తల్లిఙ్గైరృషయః సంస్తువన్త్యముమ్
గన్ధర్వాస్తం ప్రగాయన్తి నృత్యన్త్యప్సరసోऽగ్రతః

ఈయన సంచరిస్తూ ఉంటే ఆయన గుర్తులైన ఋక్ యజు సామ వేదాలతో ఋషులు స్తోత్రం చేస్తారు
ఋషులు వేదములతో స్తోత్రం చేస్తారు
గంధర్వులు గానం చేస్తారు
అప్సరసలు నాట్యం చేస్తారు

ఉన్నహ్యన్తి రథం నాగా గ్రామణ్యో రథయోజకాః
చోదయన్తి రథం పృష్ఠే నైరృతా బలశాలినః

నాగులు రథాన్ని మోస్తాయి
రాక్షసులు తమ వీపు మీద ఉండి తోస్తారు

వాలఖిల్యాః సహస్రాణి షష్టిర్బ్రహ్మర్షయోऽమలాః
పురతోऽభిముఖం యాన్తి స్తువన్తి స్తుతిభిర్విభుమ్

అరవైవేల వాలఖిల్య మహర్షులు, పరిశుద్ధులు సూర్యభగవానుని ముందు వెళుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు

ఏవం హ్యనాదినిధనో భగవాన్హరిరీశ్వరః
కల్పే కల్పే స్వమాత్మానం వ్యూహ్య లోకానవత్యజః

ఆద్యంతములు లేని పరమాత్మ ఒక్కో కల్పములో తన స్వరూపాన్ని ఒక్కో వ్యూహముగా చెప్పి లోకాన్ని కాపాడతాడు. ఆయన మాత్రం పుట్టేవాడు కాడు


                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts